సంకల్పం మంచిదేగానీ... | Central Government Extend Seats In HIgher Educations | Sakshi
Sakshi News home page

సంకల్పం మంచిదేగానీ...

Published Fri, Jan 25 2019 12:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

Central Government Extend Seats In HIgher Educations - Sakshi

ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న వార్త చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. సీట్ల సంఖ్య పెరిగితే తమకు ఛాన్స్‌ ఉంటుందని ఆశించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు... విద్యావేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు.  విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవల తీసుకొచ్చిన 124వ రాజ్యాంగ సవరణకు అను గుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోటా అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గా లకు తాజా కోటా వల్ల నష్టం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్డేకర్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 40,000 కళాశాలలు, 900 యూనివర్సిటీలు తాజా నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాయాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు కూడా సీట్ల సంఖ్యను 25 శాతం పెంచాల్సి ఉంటుంది. వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తంగా 3 కోట్ల 66 లక్షలమంది విద్యార్థులున్నారని నిరుడు విడుదలైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సర్వే చెబుతోంది. అధ్యాపకుల సంఖ్య చూస్తే 13 లక్షలు దాటలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో 35 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని జవ్డేకర్‌ ఇటీవల చెప్పారు. ఇప్పుడున్న విద్యార్థులకు బోధించడానికే తగినంతమంది అధ్యాపకులు లేనప్పుడు కొత్తగా చేరేవారికి చదువుచెప్పేదెవరు?

దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నిజానికి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మన విద్యా సంస్థల తీరుతెన్నులెలా ఉన్నాయో అంతర్జాతీయంగా ఏటా విడుదలయ్యే సర్వేలు చెబుతాయి. ప్రపంచశ్రేణి విశ్వవిద్యాయాలు చైనాలో 10 ఉంటే మన దేశంలో ఒక్కటంటే ఒక్కటీ లేదని నిరుడు ‘యూనీర్యాంక్‌’ జాబితా వెల్లడించింది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టీహెచ్‌ఈ) టాప్‌–100 జాబితాలో మాత్రం మన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చోటు దక్కించుకుంది. ఏటా విడుదలయ్యే ఈ ర్యాంకులకు అనుసరించే గీటురాళ్లపై భిన్నాభిప్రాయాలున్నా ఉన్నత విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని అందరూ అంగీకరిస్తారు. అసలు మన పట్టభద్రుల్లో కేవలం 17.5 శాతంమందికి మాత్రమే తగిన ఉద్యోగార్హతలున్నాయని రద్దయిన ప్రణాళికా సంఘం కొన్నేళ్లక్రితం చెప్పింది. ఈ దుస్థితిని గమనించినప్పుడు కొత్తగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల ఒరి గేదేమి ఉంటుందన్న సంశయం సహజంగానే చాలామందికి వస్తుంది.

సీట్ల సంఖ్య పెరగడం వల్ల మరిన్ని వేలమందికి విద్యాసంస్థల్లో ప్రవేశం దొరికినా అక్కడ చదువు చెప్పడానికి తగిన సంఖ్యలో అధ్యాపకులు లేనప్పుడు, పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు ప్రయో జనం ఏముంటుంది? మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమా ణాలకు దీటైన పరిశోధనలు లేవని మొత్తుకుంటున్నా వినేవారు లేరు. ఉన్న అధ్యాపకులపైనే పని భారం పెరుగుతోంది. ఫలితంగా వారు పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి, విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించడానికి అవకాశం చిక్కడం లేదు.  కనుకనే ఇక్కడ విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా 50,000 కన్నా తక్కువ ఉంటున్నది. దీన్నంతటినీ పట్టించుకోవాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఘోరంగా విఫలమైంది. విశ్వవిద్యాలయాల ప్రమా ణాలు మెరుగుపర్చడానికి అది చేసిన కృషేమీ లేకపోగా వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడంలో, వాటికి సరిగా నిధులందకుండా చేయడంలో అది విజయం సాధించింది.

నిధుల దుర్వినియోగం ఆరోపణల సంగతి సరేసరి. దాని స్థానంలో రాబోయే భారత ఉన్నత విద్యా కమిషన్‌(హెచ్‌ఈసీఐ) ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందన్న అంశంలో విద్యా వేత్తల్లో అత్యధికులు పెదవి విరుస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి  సీ. రంగ రాజన్‌ ఆధ్వర్యంలోని 11వ ఆర్థిక సంఘం చేసిన సూచనలు పరిగణించదగ్గవి. మౌలిక సదు పాయాల కల్పన, విద్యా సంస్కరణలు, తగిన సంఖ్యలో అధ్యాపకులు ఉంటే ప్రమాణాలు పెరుగు తాయని ఆ సంఘం చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమష్టిగా కృషి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ ఈ విషయంలో పెద్దగా జరిగిందేమీ లేదు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే 1965లో ఏర్పాటైన డీఎస్‌ కొఠారి కమిషన్‌ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని సమగ్రంగా సమీక్షిం చిందే లేదు. అంటే దాదాపు 55 ఏళ్లుగా ఆ రంగంపై పాలకులెవరూ దృష్టి సారించలేదన్నమాట!  పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచడం వల్ల కొత్తగా సాధిం చేదేమి ఉంటుంది? 

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పెరిగే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలంటే అదనంగా కనీసం రూ. 4,000 కోట్లు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ఇందుకోసం కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలకు సైతం ఈ అదనపు సీట్ల వల్ల ఆర్థిక భారం గణనీయంగానే ఉంటుంది. ఆ నిధుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. అంతిమంగా అవి ఫీజుల పెంపుపైనే ఆధారపడక తప్పదు. ఇప్పటికే ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. అది మరింత భారమైతే ఎంతమంది దాన్ని అందిపుచ్చుకోగలరన్నది అనుమానమే. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. నిధుల మంజూరు మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకూ శరవేగంతో ముందుకు ఉరికితే తప్ప ఇదంతా పరిపూర్తి కాదు. మహా అయితే ‘అగ్రవర్ణ పేదలకు’ ఏదో చేశామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పాలకులు చివరికేం చేస్తారో చూడాలి.
 
ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న సీట్ల సంఖ్యను వచ్చే విద్యా సంవత్సరం నుంచి 25 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుందన్న వార్త చాలామందికి ఉపశమనం కలిగిస్తుంది. సీట్ల సంఖ్య పెరిగితే తమకు ఛాన్స్‌ ఉంటుందని ఆశించే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాదు... విద్యావేత్తలు కూడా ఈ నిర్ణయాన్ని హర్షిస్తారు.  విద్య, ఉద్యోగాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ఇటీవల తీసుకొచ్చిన 124వ రాజ్యాంగ సవరణకు అను గుణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కోటా అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గా లకు తాజా కోటా వల్ల నష్టం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవ్డేకర్‌ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 40,000 కళాశాలలు, 900 యూనివర్సిటీలు తాజా నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాయాలు, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ఎయిడెడ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీలు కూడా సీట్ల సంఖ్యను 25 శాతం పెంచాల్సి ఉంటుంది. వివిధ రకాల ఉన్నత విద్యా సంస్థల్లో మొత్తంగా 3 కోట్ల 66 లక్షలమంది విద్యార్థులున్నారని నిరుడు విడుదలైన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సర్వే చెబుతోంది. అధ్యాపకుల సంఖ్య చూస్తే 13 లక్షలు దాటలేదు. ఉన్నత విద్యాసంస్థల్లో 35 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని జవ్డేకర్‌ ఇటీవల చెప్పారు. ఇప్పుడున్న విద్యార్థులకు బోధించడానికే తగినంతమంది అధ్యాపకులు లేనప్పుడు కొత్తగా చేరేవారికి చదువుచెప్పేదెవరు?

దేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ నిజానికి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మన విద్యా సంస్థల తీరుతెన్నులెలా ఉన్నాయో అంతర్జాతీయంగా ఏటా విడుదలయ్యే సర్వేలు చెబుతాయి. ప్రపంచశ్రేణి విశ్వవిద్యాయాలు చైనాలో 10 ఉంటే మన దేశంలో ఒక్కటంటే ఒక్కటీ లేదని నిరుడు ‘యూనీర్యాంక్‌’ జాబితా వెల్లడించింది. టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌(టీహెచ్‌ఈ) టాప్‌–100 జాబితాలో మాత్రం మన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) చోటు దక్కించుకుంది. ఏటా విడుదలయ్యే ఈ ర్యాంకులకు అనుసరించే గీటురాళ్లపై భిన్నాభిప్రాయాలున్నా ఉన్నత విద్యా వ్యవస్థ పరిస్థితి ఏమాత్రం సరిగా లేదని అందరూ అంగీకరిస్తారు. అసలు మన పట్టభద్రుల్లో కేవలం 17.5 శాతంమందికి మాత్రమే తగిన ఉద్యోగార్హతలున్నాయని రద్దయిన ప్రణాళికా సంఘం కొన్నేళ్లక్రితం చెప్పింది. ఈ దుస్థితిని గమనించినప్పుడు కొత్తగా సీట్ల సంఖ్య పెంచడం వల్ల ఒరి గేదేమి ఉంటుందన్న సంశయం సహజంగానే చాలామందికి వస్తుంది. సీట్ల సంఖ్య పెరగడం వల్ల మరిన్ని వేలమందికి విద్యాసంస్థల్లో ప్రవేశం దొరికినా అక్కడ చదువు చెప్పడానికి తగిన సంఖ్యలో అధ్యాపకులు లేనప్పుడు, పరిశోధనకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేనప్పుడు ప్రయో జనం ఏముంటుంది? మన ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ ప్రమా ణాలకు దీటైన పరిశోధనలు లేవని మొత్తుకుంటున్నా వినేవారు లేరు. ఉన్న అధ్యాపకులపైనే పని భారం పెరుగుతోంది.

ఫలితంగా వారు పరిశోధనల్లో పాలుపంచుకోవడానికి, విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహించడానికి అవకాశం చిక్కడం లేదు.  కనుకనే ఇక్కడ విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా 50,000 కన్నా తక్కువ ఉంటున్నది. దీన్నంతటినీ పట్టించుకోవాల్సిన యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ఘోరంగా విఫలమైంది. విశ్వవిద్యాలయాల ప్రమా ణాలు మెరుగుపర్చడానికి అది చేసిన కృషేమీ లేకపోగా వాటి స్వయంప్రతిపత్తిని దెబ్బతీయడంలో, వాటికి సరిగా నిధులందకుండా చేయడంలో అది విజయం సాధించింది. నిధుల దుర్వినియోగం ఆరోపణల సంగతి సరేసరి. దాని స్థానంలో రాబోయే భారత ఉన్నత విద్యా కమిషన్‌(హెచ్‌ఈసీఐ) ఉన్నత విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందన్న అంశంలో విద్యా వేత్తల్లో అత్యధికులు పెదవి విరుస్తున్నారు. ఉన్నత విద్యలో ప్రమాణాలను పెంచడానికి  సీ. రంగ రాజన్‌ ఆధ్వర్యంలోని 11వ ఆర్థిక సంఘం చేసిన సూచనలు పరిగణించదగ్గవి. మౌలిక సదు పాయాల కల్పన, విద్యా సంస్కరణలు, తగిన సంఖ్యలో అధ్యాపకులు ఉంటే ప్రమాణాలు పెరుగు తాయని ఆ సంఘం చెప్పింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమష్టిగా కృషి చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ ఈ విషయంలో పెద్దగా జరిగిందేమీ లేదు. ఆశ్చర్యకరమైన అంశమేమంటే 1965లో ఏర్పాటైన డీఎస్‌ కొఠారి కమిషన్‌ తర్వాత ఉన్నత విద్యారంగాన్ని సమగ్రంగా సమీక్షిం చిందే లేదు. అంటే దాదాపు 55 ఏళ్లుగా ఆ రంగంపై పాలకులెవరూ దృష్టి సారించలేదన్నమాట!  పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నప్పుడు ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు పెంచడం వల్ల కొత్తగా సాధిం చేదేమి ఉంటుంది? 

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని విద్యా సంస్థల్లో పెరిగే సీట్ల సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు పెంచాలంటే అదనంగా కనీసం రూ. 4,000 కోట్లు అవసరమవుతాయని నిపుణుల అంచనా. ఇందుకోసం కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలకు సైతం ఈ అదనపు సీట్ల వల్ల ఆర్థిక భారం గణనీయంగానే ఉంటుంది. ఆ నిధుల్ని సమకూర్చుకోవడానికి ప్రభుత్వాలు ఎలాంటి వెసులుబాట్లు కల్పిస్తాయన్న విషయంలోనూ స్పష్టత లేదు. అంతిమంగా అవి ఫీజుల పెంపుపైనే ఆధారపడక తప్పదు. ఇప్పటికే ఉన్నత విద్య ఖరీదైన వ్యవహారంగా మారింది. అది మరింత భారమైతే ఎంతమంది దాన్ని అందిపుచ్చుకోగలరన్నది అనుమానమే. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి కొన్ని నెలల వ్యవధి మాత్రమే ఉంది. నిధుల మంజూరు మొదలుకొని మౌలిక సదుపాయాల కల్పన వరకూ శరవేగంతో ముందుకు ఉరికితే తప్ప ఇదంతా పరిపూర్తి కాదు. మహా అయితే ‘అగ్రవర్ణ పేదలకు’ ఏదో చేశామని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పాలకులు చివరికేం చేస్తారో చూడాలి.
 
No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement