‘ఈబీసీ కోటాలో మా వాటా ఎంతో తేల్చండి’ | Arya Vysya Body Leaders Demands Over EBC Reservation | Sakshi
Sakshi News home page

‘కనీసం 5 శాతం రిజర్వేషన్‌ కేటాయించాలి’

Published Wed, Jan 23 2019 8:13 PM | Last Updated on Wed, Jan 23 2019 8:40 PM

Arya Vysya Body Leaders Demands Over EBC Reservation - Sakshi

సాక్షి, గుంటూరు : అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఈబీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్‌లో తమ వాటా ఎంతో తేల్చాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో భాగంగా ఈ విషయంపై సమాలోచనలు చేశారు. ఇందులో భాగంగా ఈబీసీ రిజర్వేషన్‌లో కనీసం ఐదు శాతం వాటాను తమకు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ విషయమై మాజీ సీఎం రోశయ్యతో కూడా చర్చలు జరపాలని భావించిన ఆర్యవైశ్య సంఘం సీనియర్‌ నేతలు.. హైద్రాబాద్‌కు పయనమయ్యారు. రానున్న రెండు రోజుల్లో రిజర్వేషన్‌ విషయమై తమ పూర్తి డిమాండ్లను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement