roshaiah
-
చంద్రబాబు గురించి.. రోశయ్య చెప్పిన పచ్చి నిజాలు
-
నైతిక విలువ లేని వ్యక్తి పవన్ కల్యాణ్ : కిలారి వెంకట రోశయ్య
-
‘విలనిజంలో జేపీ కొత్త ఓరవడి సృష్టించారు’
సాక్షి, గుంటూరు: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డిలు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, నాటక రంగాల్లో ఆయనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని, తన స్వంత ఖర్చుతో గుంటూరులో నాటకాలను ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు జయప్రకాష్‌రెడ్డి భౌతకికాయాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విలనిజంలో జయప్రకాష్ కొత్త ఒరవడిని సృష్టించారని, వ్యక్తిగతంగా ఆయన చాలా సౌమ్యుడన్నారు. ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి జయప్రకాష్ అని నాటక రంగం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేవమని గిరిధర్ పేర్కొన్నారు. -
బాబు అక్రమాలపై పవన్ ఎప్పుడైనా మాట్లాడారా..?
-
‘ఈబీసీ కోటాలో మా వాటా ఎంతో తేల్చండి’
సాక్షి, గుంటూరు : అగ్రవర్ణ పేదలను ఆదుకునేందుకు కేంద్రం ఈబీసీలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో తమ వాటా ఎంతో తేల్చాలని ఆర్యవైశ్య సంఘం నేతలు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో భాగంగా ఈ విషయంపై సమాలోచనలు చేశారు. ఇందులో భాగంగా ఈబీసీ రిజర్వేషన్లో కనీసం ఐదు శాతం వాటాను తమకు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ విషయమై మాజీ సీఎం రోశయ్యతో కూడా చర్చలు జరపాలని భావించిన ఆర్యవైశ్య సంఘం సీనియర్ నేతలు.. హైద్రాబాద్‌కు పయనమయ్యారు. రానున్న రెండు రోజుల్లో రిజర్వేషన్ విషయమై తమ పూర్తి డిమాండ్లను వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ కారణజన్ముడు
-
ఒప్పించి మెప్పించే నైపుణ్యం జానారెడ్డిది
సాక్షి,హైదరాబాద్: అందరినీ ఒప్పించి మెప్పించగల అజాత శత్రువు జానారెడ్డి అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అభివర్ణించారు. ఆయన ఒక సమర్థవంతమైన శాసనసభ్యుడు, అన్ని విషయాలపై అవగాహన పెంచుకొని సరైన రీతిలో సమాధానాలు ఇవ్వడంలో దిట్ట అని ప్రశంసించారు. బుధవారం గాంధీ భవన్‌లోని ఇందిరాభవన్‌లో ప్రెస్ ఆకాడమీ మాజీ చైర్మన్ తిరుమలగిరి సురేందర్ తాజా మాజీ సీఎల్పీ నేత కె.జానారెడ్డి గురించి రాసిన ‘అజాత–శత్రువు’పుస్తకాన్ని రోశయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జానారెడ్డిపై రాసిన పుస్తకం చిన్నదైనా అందులో ఎంతో విషయం ఉందని రచయితను అభినందించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎవ్వరిని నొప్పించని మనస్తత్వం జానారెడ్డిదన్నారు. తెలుగు రాష్ట్రాలలో జానారెడ్డి గురించి తెలియని వ్యక్తి ఉండరని, రాష్ట్రంలోనే సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవులు నిర్వహించారన్నారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి మాట్లాడుతూ జానారెడ్డి ప్రత్యేక వ్యక్తిత్వం గల వ్యక్తి అన్నారు. రాజకీయాల్లో అజాత–శత్రువుగా ఉండడం ఎంతముఖ్యమో..అవసరమైనప్పుడు ధర్మాగ్రహం ప్రదర్శించడం అంతే అవసరమన్నారు. రాష్ట్రంలో అధర్మ స్థితి ఉందని, మెత్తగా మెల్లగా మాట్లాడితే బలహీనతగా చూస్తారని అందుకే అప్పుడప్పుడు దూకుడు పెంచాలని జానాకు సూచించారు. సీఎం పదవిని తిరస్కరించారు... తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు తమ పార్టీ అధిష్టానం జానారెడ్డిని సీఎం పదవి చేపట్టాలని కోరితే ఆయన తిరస్కరించారని శాసనమండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ వెల్లడించారు.తనకు పదవి వస్తే తెలంగాణ రాదని భావించి ఆ పదవిని త్యాగం చేశారని అన్నారు. కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ 16 శాఖలకు మంత్రిగా వ్యవహరించిన అనుభవశీలి జానారెడ్డి అని కొనియాడారు. తుదివరకూ ప్రజోపయోగ కార్యక్రమాలకు.. ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా అంతిమ దశ వరకు కొనసాగాలని ఉందని జానారెడ్డి మాట్లాడుతూ అన్నారు. అందరి ఆశీర్వాదం, దీవెనలు ఉన్నంత వరకు ఇలాగే ఉంటానని వెల్లడించారు. తన రాజకీయ గురువు కె.వి.సత్యనారాయణ ఈ పుస్తక ఆవిష్కరణకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా జానారెడ్డి చెప్పారు. ఒక దశలో తన మిత్రుడు రామానుజాచారి మంత్రి అవుతావని జోస్యం చెప్పారని, ఆ తరుణంలో టీడీపీ ఆవిర్భావం కావడం, దానిలో భాగస్వామిని కావడం, తొలిసారి ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం అనూహ్యంగా జరిగిపోయిందని అప్పటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రోశయ్యకు ఆత్మీయ సత్కారం
అనంతపురం కల్చరల్ : అనంతలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు వైఎస్సార్సీపీ నేతలు సత్కరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్తియార్ తదితరులు శనివారం స్థానిక ఆర్అండ్బీ బంగ్లాలో కలిసి పలుకరించారు. అనంతరం శాలువ కప్పి, పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని విషయాలను గుర్తు చేసుకున్నారు. -
'జయ మరణం తమిళ ప్రజలకు తీరని లోటు'
-
'రాజ్యాంగ రక్షకులను గవర్నర్‌గా నియమించాలి'
చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా రాజ్యాంగ రక్షకులను నియమించాలని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడులో ప్రస్తుతం భాష అల్ప సంఖ్యాక ప్రజలపై రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. చెన్నైలోని భాష అల్ప సంఖ్యాక వర్గాల హక్కులను కాపాడే వారిని గవర్నర్‌గా నియమించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి.. రోశయ్యతో తన ప్రయాణం, పరిచయం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చీరాల ఉప ఎన్నికలకు రోశయ్య, ఇప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంచార్జ్‌లుగా ఉన్నారన్నారు. అప్పట్లో వారితో కలిసి కేతిరెడ్డి.. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్టు తెలిపారు. చెన్నైలోని తెలుగు సంఘాలకు సంబంధించి తన ప్రకటనలు ఆయన దృష్టికి వెళ్లినప్పుడు కేతిరెడ్డి చాలా స్పీడ్ అంటూ సంబోధించేవారని చెప్పారు. తెలుగు కోసం తాను చేపట్టిన ఉద్యమం వివరాలను తొలుత రోశయ్యకు చెప్పి చేయడం జరిగిందని తెలిపారు. రోశయ్య ప్రత్యక్షంగా తెలుగు ఉద్యమానికి సంఘీభావం తెలుపక పోయినా పరోక్షంగా చాలా మేలు చేశారంటూ కేతిరెడ్డి కొనియాడారు. -
‘పేట’తో పాతికేళ్ల అనుబంధముంది
సూర్యాపేట : సూర్యాపేట పట్టణానికి నేను కొత్తేమి కాదని, పేటతో నాకు పాతికేళ్ల అనుబంధం ఉందని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేటలో నిర్వహించిన మర్చంట్స్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేటలోని వ్యాపారులతో తనకు దగ్గరి సంబంధాలు, మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెనాలికి వెళ్లేటప్పుడు ఎక్కువగా సూర్యాపేటలోనే ఆగి విశ్రాంతి తీసుకున్నానని పేర్కొన్నారు. సూర్యాపేటకు ఉమ్మడి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇక ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రముఖ పట్టణం ఉందంటే అది సూర్యాపేటేనని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ పేటకు పూర్వ వైభవం తీసుకొచ్చే సమయం కేవలం రెండు రోజులు మాత్రమే ఉందని నిండు సభలో తెలపడంతో వ్యాపారుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సూర్యాపేట ఆర్యవైశ్య సంఘానికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రకటించిన అవార్డును రోశయ్య చేతుల మీదుగా ఆ సంఘం సభ్యులు మురళీధర్, ఈగా దయాకర్, విద్యాసాగర్, గోపారపు రాజులకు అందజేశారు. అలాగే ఈ నలుగురికి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నతపదవులు కట్టబెట్టనున్నట్టు ప్రపంచ మహాసభ ఆర్యవైశ్య అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, ఆర్యవైశ్య సంఘం సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు బ్రాహ్మాండ్లపల్లి మురళీధర్‌గుప్త, ఈగా దయాకర్, నరేంద్రుని విద్యాసాగర్, రవీందర్, వీరెల్లి లక్ష్మయ్య, మల్లిఖార్జున్, ఉప్పల శారద, ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, దైవాదినం, నూకా వెంకటేశంగుప్త, బాలచంద్రుడు, గోపారపు రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రోశయ్యకు స్వాగతం పలికిన మంత్రి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మర్చంట్స్ డే కార్యక్రమానికి హాజరైందుకు వస్తూ ముందుకు పట్టణంలోని రహదారి బంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పూలబోకె అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. స్వాగతం పలికిన వారిలో నాయకులు టీఆర్ఎస్ నాయకులు కట్కూరి గన్నారెడ్డి, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, ఆకుల లవకుశ, శనగాని రాంబాబుగౌడ్, మోదుగు నాగిరెడ్డి, కక్కిరేణి నాగయ్యగౌడ్, కటికం శ్రీనివాస్, కోడి సైదులుయాదవ్, తూడి నర్సింహారావు తదితరులు ఉన్నారు. -
'అమ్మ' కేబినెట్లో ఇద్దరు తెలుగోళ్లు
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మంత్రివర్గంలో మరో నలుగురికి చోటు దక్కింది. 'అమ్మ' మంత్రివర్గంలో ఇద్దరు తెలుగువాళ్లకు స్థానం దక్కింది. తెలుగువాడైన హోసూయ ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డికి మంత్రి పదవి, రాజాకు ఐటీ శాఖను జయలలిత కేటాయించింది. కొత్తగా 13 మందిని తన మంత్రివర్గంలోకి తీసుకున్న జయలలిత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తమిళనాడు సీఎంగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, డీఎంకే నేత స్టాలిన్ హాజరయ్యారు. గవర్నర్ రోశయ్య మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు. -
ఆ ఉద్యమకారుడికి న్యాయం దక్కేనా?
- రోశయ్య హయాంలో సభలో జై తెలంగాణ అన్నందుకు పోలీస్ కేసు - కేసు కారణంగా కానిస్టేబుల్ ఉద్యోగం కోల్పోయిన యువకుడు - సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించినా దక్కని న్యాయం సాక్షి, హైదరాబాద్: ‘జై తెలంగాణ’ అనే పిలుపునిచ్చినందకు ఓ యువకుని జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. ‘మా రాష్ట్రం రావాలి... మా కష్టం తీరాలి’ అని నినాదాలు చేసిన అతని బతుకు నడిరోడ్డుపై పడింది. ఉద్యమ నినాద ఫలితమే చేతికందిన ఉద్యోగం కోల్పోయి నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రంగారెడ్డి జిల్లా బట్వారం మండలం రాంపూర్‌కు చెందిన చంద్రకాంత్‌రెడ్డి కానిస్టేబుల్‌గా ఎంపికైనా కొలువు దక్కడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2008లో విడుదలైన కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కు చంద్రకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. 2010 చివరి నాటికి రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన అన్ని ఈవెంట్లు, రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ అప్పటికే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో చంద్రకాంత్ కూడా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అదే సందర్భంగా 2010 మే 17న అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య రైతు చైతన్య యాత్రలు ప్రారంభించేందుకు బట్వారం మండలం యాచారంకు వచ్చారు. సభలో సీఎం రోశయ్య ప్రసంగిస్తుండగా ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలిచ్చాడు. సీఎం సభను భగ్నం చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో చంద్రకాంత్‌రెడ్డితో సహా పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ కేసులో వికారాబాద్ కోర్టు రూ.300 జరిమానా విధించింది. అయితే కానిస్టేబుల్ కొలువుకు ఎంపికవడంతో రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన వెరిఫికేషన్‌లో చంద్రకాంత్‌పై కేసు నమోదై.. శిక్షపడినట్లు రుజువు కావడంతో పోలీస్ కొలువును నిలిపేసింది. ఈ నేపథ్యంలో ఒక వైపు న్యాయస్థానాల చుట్టూ, మరోవైపు ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా కానిస్టేబుల్ కొలువు దక్కడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా... ఉద్యమ కారుడికి మాత్రం న్యాయం జరగడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఆఖరికి సీఎం కేసీఆర్‌ను కలిసి సమస్యను విన్నవించినా ఇప్పటికీ పరిష్కారం లభించడంలేదంటూ బాధితుడు వాపోతున్నాడు. -
ఇలాగైతే హామీలే మిగలవు
‘ఉచిత’ పథకాలపై తమిళనాడు గవర్నర్ రోశయ్య హైదరాబాద్: జనాకర్షక ఉచిత పథకాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు చేరువయ్యేందుకు పోటీపడుతున్నాయని, ఇలాగైతే భవిష్యత్తులో రాజకీయ పార్టీలకు ఇచ్చేందుకు హామీలే మిగలవని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య అన్నారు. ఆదివారం హస్తినాపురంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. రోశయ్య మాట్లాడుతూ... రాజకీయాలంటే ప్రజలకు దిశ, దశ నిర్దేశించేవిగా ఉండాలని, కానీ ప్రస్తుతం ఉచిత హామీలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వైశ్యులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఐకమత్యంగా నిరంతర సామాజిక స్పృహతో ముందుకు సాగాలన్నారు. వేదికలపై తీర్మానాలు చేసి ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఎవరూ చైతన్యవంతులు కారన్నారు. సమాజంలో ఆర్యవైశ్యులపై మంచి అభిప్రాయం, గుర్తింపు ఉన్నాయని, దానిని నిలుపుకోవాలన్నారు. ఆర్యవైశ్యుల్లో వెనుకబడిన వారి పిల్లల చదువుకు ఉపకార వేతనాలు ఇచ్చేలా సంఘం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా మాట్లాడుతూ... రాష్ట్ర జనాభాలో 8 శాతం ఉన్న వైశ్యులు ఆ ప్రాతిపదికన రాజకీయంగా ఎదగాలన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్కుమార్సంఘీ, మాజీ ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, మహిళా అధ్యక్షురాలు ఉప్పల శారద పాల్గొన్నారు. -
నేడు సీఎంగా జయలలిత ప్రమాణస్వీకారం
-
జయ ప్రమాణం నేడే
ఐదోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన పురుచ్చితలైవి సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా.. గవర్నర్ ఆమోదం అభిమానుల జయజయధ్వానాల మధ్య రాజ్‌భవన్‌కు పయనం గవర్నర్ రోశయ్యతో భేటీ.. 28 మందితో కూడిన మంత్రుల జాబితా అందజేత చెన్నై: అన్నాడీఎంకే అధినేత జయలలిత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించేందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11 గంటలకు మద్రాస్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఐదోసారి తమిళనాడు సీఎంగా ఆమె ప్రమాణం చేయనున్నారు. 28 మంది మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు. శుక్రవారం తమిళనాట కీలక పరిణామాలు చకచక చోటుచేసుకున్నాయి. ఉదయం ఏడు గంటలకే పార్టీ ప్రధాన కార్యాలయంలో 148 మంది ఎమ్మెల్యేలు సమావేశమై జయను శాసనసభా పక్ష నేత(ఎల్పీ)గా ఎన్నుకున్నారు. అదే సమావేశంలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఒ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ దోషిగా తేలడం, ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకోవడంతో కిందటేడాది సెప్టెంబర్ 29న ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో జయ పేరును పన్నీర్ సెల్వమే ప్రతిపాదించగా.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ భేటీకి విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు చెందిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలు కూడా హాజరై జయకు మద్దతు పలకడం గమనార్హం. ఈ భేటీ తర్వాత పన్నీర్ సెల్వం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మధ్యాహ్నం 2.15 గంటలకు జయలలిత రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ కె.రోశయ్యకు కొత్త మంత్రుల జాబితాను అందజేశారు. తర్వాత రాజ్‌భవన్ నుంచి నేరుగా మౌంట్‌రోడ్డుకు వెళ్లి ఎంజీఆర్, అన్నాదురై, పెరియార్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. పన్నీర్ సెల్వం రాజీనామాతోపాటు కొత్త మంత్రుల జాబితాను ఆమోదించినట్లు రాజ్‌భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా బయటపడి ఎనిమిది నెలల తర్వాత జనంలోకి వచ్చిన జయకు జనం బ్రహ్మరథం పట్టారు. రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గం అభిమానులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది జయకు జేజేలు పలికారు. ఆమెపై పూలవర్షం కురిపించి తమ అభిమానం చాటుకున్నారు. నగరంలో ఎక్కడ చూసినా అన్నాడీఎంకే ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలే కనిపించాయి. జయ నివాసం వద్ద కూడా సంబరాలు మిన్నంటాయి. భారీ సంఖ్యలో చేరుకున్న మహిళా కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. వారందరికి అభివాదం చేస్తూ జయ తన కారులో ముందుకు సాగారు. మంత్రివర్గంలో పాత ముఖాలే! జయ సారథ్యంలో కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో ముగ్గురు మినహా పాత మంత్రులే కొనసాగనున్నారు. 2011-14 మధ్య తాను సీఎంగా ఉన్న సమయంలో మంత్రులుగా ఉన్నవారిని అలాగే కొనసాగించేందుకు ఆమె మొగ్గుచూపారు. ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేయనున్నారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు. ఈనెల 11న ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్ణయం తీసుకోవాల్సి ఉంది: కర్ణాటక సీఎం బెంగళూరు: జయ కేసులో అప్పీలుకు వెళ్లే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ‘ఈ అంశాన్ని న్యాయశాఖ పరిశీలిస్తోంది. తీర్పును వారు అధ్యయనం చేస్తున్నారు. న్యాయశాఖ, ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, అడ్వొకేట్ జనరల్ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటాం’అ ని విలేకరులకు చెప్పారు. కాగా, అప్పీలుకు వెళ్లాల్సిందిగా తాను ఇప్పటికే సలహా ఇచ్చినట్లు అడ్వొకేట్ జనరల్ రవివర్మ కుమార్ తెలిపారు. -
తెలంగాణ వ్యతిరేకిని కాను
సాక్షి ప్రతినిధి సంగారెడ్డి: గుబురు గడ్డం.. కురుల జుట్టు.. కలుపుగోలుతత్వం.. అంతకు మించిన ఆవేశం.. అన్నీ కలిస్తే తూర్పు జగ్గారెడ్డి. ఒక ప్రత్యేక సామాజిక వర్గానికి వ్యతిరేకిగా ముద్రపడ్డ ఆయన ఆదివారం వాళ్లతోనే గడుపుతూ కనిపించారు. వారిని బుజ్జగిస్తున్నారు.. బాస చేస్తున్నారు.. మొత్తానికి ఓట్ల కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ‘సాక్షి ప్రతి నిధి’ని చూడగానే నవ్వుతూ పేపరోళ్లకు ఇక్కడేం పనండీ అంటూ దగ్గరకొచ్చారు. ఈ మాజీ ప్రభుత్వ విప్ తన మనసులోని భావాలను ఠమొదటిపేజీ తరువాయి ‘సాక్షి’తో పంచుకున్నారు. తాను తెలంగాణ వ్యతిరేకిని కాదు అంటూనే సమైక్యంలోనే అభివృద్ధి జరుగుతుందని భావించినట్లు చెప్పారు. కేసీఆర్ ప్రభావం కనీసం మెదక్ పార్లమెంటుపై కూడా ఉండదని, ఆయనకు ఓటమి తప్పదని కుండబద్దలు కొట్టారు. జగ్గారెడ్డితో సాక్షి ప్రతినిధి ఇంటర్వ్యూ ఇలా సాగింది. సాక్షి : సంగారెడ్డి అసెంబ్లీపై కేసీఆర్ ప్రభావం ఉంటుంది కదా? గెలుపు కోసం మీరు ఎలాంటి వ్యూహాలు చేస్తున్నారు? జగ్గారెడ్డి: కేసీఆర్ ప్రభావం సంగారెడ్డి అసెంబ్లీ స్థానం మీదనే కాదు, అసలు మెదక్ పార్లమెంటు మీదనే ఉండదు. మీరు రాసుకోండి.. కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం. మా పార్టీ అభ్యర్థి శ్రవణ్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారు. తెలంగాణ వచ్చాక కూడా కేసీఆర్ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు కావాల్సింది తెలంగాణ వికాసం. ఇప్పటికీ దాన్ని అడ్డుకోవటం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రజలకు దూరంగా ఉంటారు, అభివృద్ధికి ఇంకా దూరంగా ఉంటారు. అందుకే నేను కేసీఆర్‌తో విభేదించాను. ఇక నేను గెలవటం కోసం ప్రత్యేక వ్యూహాలు అవసరం లేదు. నేను చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయి. సాక్షి: అభివృద్ధి పనులు గెలిపిస్తాయని అనుకున్నప్పుడు కార్యకర్తలను రాక్ గార్డెన్‌కు పిలిచి ఎందుకు సెల్ఫోన్లు, కుక్కర్లు పంచారు? జగ్గారెడ్డి: సికింద్రాబాద్ రాక్ గార్డెన్లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఆ సమావేశానికి నేను వెళ్లాను, అది చాలా పెద్ద గార్డెన్, పక్కనే వేరే వాళ్ల ఫంక్షన్ ఏదో జరుగుతోంది. టీఆర్ఎస్, ఆ పార్టీ టీ ఛానల్ కుట్రలు చేసి లేనివాటిని నాకు ఆపాదించే ప్రయత్నం చేసింది. ఫంక్షన్ హాల్లో ఉన్న కుక్కర్లు, మద్యం బాటిల్స్ తెచ్చి నాకు ఆపాదించారు. సెల్‌ఫ్లోన్లు ఎలా వచ్చాయో విచారణలో తేలుతుంది. ఇలాంటి కుట్రలతో జగ్గారెడ్డి మెజార్టీని తగ్గించలేరు. సాక్షి: అవసరం అయితే పోలింగ్ బూత్ క్యాప్చర్ చేయాలని గతంలో మీరు కార్యకర్తలకు నూరిపోశారు కదా? జగ్గారెడ్డి: మనిషి ముందు ఒక మాట, మనిషి వెనుక ఒక మాట మాట్లాడే తత్వం కాదు నాది. బరాబర్ ‘బూత్ క్యాప్చర్’ అనే పదం అన్న. అది ఏ సందర్భంలో అన్నానో చెప్తా. ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోకి రానప్పుడు కార్యకర్తల మీటింగ్ పెట్టాను. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికునిగా పని చేయాలని చెప్పిన. లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరా. రాజకీయ విశ్లేషకులు చూసినప్పుడు కార్యకర్తలు బూత్ క్యాప్చర్ చేశారా...! అనే అనుకునేంతమెజార్టీతో గెలిపించాలని చెప్పిన. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం కోసం అన్న మాటలు. ఇందులో తప్పుందా? సాక్షి: మీరు సమైక్యవాది కదా? ఎన్నికలకు ఎలా వెళ్తారు? జగ్గారెడ్డి: నేను తెలంగాణ వ్యతిరేకిని కాదు, కాని సమైక్యంగా ఉంటేనే రాష్ర్టం అభివృద్ధి చెందుతుందని నమ్మాను. ఇక నేను ఏ నిర్ణయం తీసుకున్నా సంగారెడ్డి ప్రజల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నా నియోజకవర్గం అభివృద్ధికి సహకరించారు. రూ. కోట్లు పట్టుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. సాక్షి: వైఎస్సార్ సహాయం చేశారని చెప్తున్నారు, మరి ఆయన పేరును ఎఫ్ఐఆర్లో పెడుతున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా? జగ్గారెడ్డి: ముఖ్యంగా వైఎస్సార్ మరణం నన్ను చాలా బాధపెట్టింది. ఎందుకు అలా జరిగిందిరా దేవుడా..! అని చాలాసార్లు బాధపడ్డాను. సంగారెడ్డి అభివృద్ధిలో వైఎస్సార్ నాకు సహకరించారు. ఆ తర్వాత ఆయన పేరు దోషిగా ఎఫ్ఐఆర్లో చేర్చినప్పుడు కూడా బాధనిపించింది. సాక్షి: ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకమని మీ మీద ముద్ర ఉంది కాదా, వాళ్లు మీకు ఓట్లు ఎలా వేస్తారు? జగ్గారెడ్డి: నేను ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకమని టీఆర్ఎస్ విషప్రచారం చేస్తోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు. రేపు నాకు రాబోయే మెజార్టీలో సర్వ మతాల ప్రజల భాగస్వామ్యం ఉంటుంది. నన్ను ఆశీర్వాదించాలని ముస్లింలను చేతులు జోడించి అడుగుతున్నా. సాక్షి: మీకు ఫైర్‌బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది కదా? మీరు మొదటి నుంచి అంతేనా? జగ్గారెడ్డి: నిజమే.. మీరు అన్నట్టు నన్ను ఫైర్ బ్రాండ్ అంటారు. ఎదుటి వాళ్లు అన్యాయంగా అసత్యాలు, అర్థ సత్యాలు మాట్లాడినప్పుడు నేను చూస్తూ ఊరుకోలేను. కొంత ఆవేశానికి లోనవుతాను, కాని నేను ఎంత ఆవేశంతో మాట్లాడినా అనాలోచితంగా, అర్థరహితంగా, పూట గడుపుకోవడానికో మాత్రం మాట్లాడను. సాక్షి: ఫైర్‌బ్రాండ్ ఎన్నికల ముందు ఎందుకు మౌనముద్రలోకి వెళ్లింది? టికెట్ కోసమేనా? జగ్గారెడ్డి: నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఆ తర్వాతే నాయకుణ్ణి. ఎన్నికల ముందు నేను మౌనంగా ఉన్న మాట నిజమే. దానికి కారణం టికెట్ నాకే వస్తుందనే విశ్వాసం, నమ్మకం నా కుంది. అందుకే మౌనంగా ఉండి పార్టీ క్యాడర్ గందరగోళానికి గురికాకుండా జాగ్రత్త పడ్డాను. సాక్షి:జైలుకు వెళ్లడం మీకు బాధ అనిపించిందా? జగ్గారెడ్డి: పోలీసులు, జైలు నాకు కొత్తకాదు, ప్రజల మధ్యకొచ్చి నిలబడ్డప్పుడు పోలీసు కేసులు సర్వసాధారణం. నేను మొన్న జైలుకు వెళ్లింది కూడా ప్రజల కోసమే. ఇందులో బాధపడాల్సింది ఏముంది? చాలా గర్వపడ్డాను. -
8% వృద్ధే లక్ష్యం: రాష్ట్రపతి ప్రణబ్
చెన్నై, సాక్షి ప్రతినిధి : దేశంలో కొనసాగుతున్న ఆర్థిక పతనానికి అడ్డుకట్ట వేసేలా ఇంజనీరింగ్ విద్యాబోధన సాగాలని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉద్బోధించా రు. చెన్నైలో శుక్రవారం జరిగిన ఇంజనీరింగ్ కళాశాలల సమా ఖ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, రెండేళ్లలో దేశ ఆర్థికాభివృద్ధి క్షీణించిందని తెలిపారు. 2012-13లో వృద్ధి రేటు 5 శాతవునీ, గత పదేళ్లలో ఇదే కనిష్ట వృద్ధి రేటనీ చెప్పారు. దీన్ని 8 శాతానికి మించిన స్థారుుకి పెంచడమే వున వుుందున్న తక్షణ సవాలని అన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా దేశం ఆర్థిక పరిపుష్టి పొందుతుందని, దీనిని సాధించాలంటే మెరుగైన ఇంజనీరింగ్ విద్య అవసరమని పేర్కొన్నారు. మానవ అవసరాలకు, దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను మెరుగుపర్చుకోవాలని సూచించారు. జపాన్, సింగపూర్లు ఆధునిక టెక్నాలజీ సాయుంతోనే అభివృద్ధి సాధించాయుని గుర్తుచేశారు. మెరుగైన విధానంతో నాణ్యమైన బోధనతో చురుకైన ఇంజనీర్లను దేశానికి అందించాల్సిన బాధ్యతను యూనివర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలలు గుర్తెరగాలని పేర్కొన్నారు. దేశం గత 20 ఏళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నదని, భవిష్యత్తులో ఎదురయ్యే మరెన్నో సవాళ్లను అధిగమించేలా విద్యావంతులను తీర్చిదిద్దాలని చెప్పారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్ర మంత్రి జీకే వాసన్ పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు ప్రాధాన్యం
టీ.నగర్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత పేర్కొన్నారు. మద్రాసు విశ్వ విద్యాలయం సెంటినరీ హాలులో శుక్రవారం అన్నా వర్సిటీ 34వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రోశయ్య, ముఖ్యమంత్రి జయలలిత, ఉన్నత విద్యాశాఖ మంత్రి పి.పళనియప్పన్, అన్నావర్సిటీ వైస్ చాన్సలర్ ఎం.రాజారాం, సిటీ సిండికేట్ - సెనేట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నాణ్యమైన విద్యను అందించడంలో అన్నా విశ్వ విద్యాలయం తలమానికంగా నిలిచిందన్నారు. ఇక్కడ విద్యను అభ్యసించి పట్టాలను అందుకోవడం విద్యార్థులు అదృష్టంగా భావించాలన్నారు. భారతదేశంలో విజ్ఞాన సముపార్జనలో తమిళనాడు ముందంజలో ఉందన్నారు. తమ ప్రభుత్వం ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులకు ఆర్థిక సాయంతో పాటు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తోందన్నారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ల్యాప్‌టాప్‌లను ఉచితంగా ఇస్తున్నామని వివరించారు. గ్రామీణ విద్యార్థుల విద్యావసరాల కోసం కొత్తగా నాలుగు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలను ఈ ఏడాదిలో ఏర్పాటుచేశామని చెప్పారు. మానవ వనరుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థానాలు సాధించి తల్లిదండ్రులు, కళాశాలలకు పేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా నూతన ఆలోచనలతో సరికొత్త అన్వేషణలు సాగించాలని పిలుపునిచ్చారు. తర్వాత 690 మంది పీహెచ్డీ పట్టభద్రులు, మొదటి ర్యాంకులు పొందిన 114 ఇంజినీరింగ్ పట్టభద్రులకు గవర్నర్ పట్టాలను, పుస్తకాలను అందచేశారు.