‘విలనిజంలో జేపీ కొత్త ఓరవడి సృష్టించారు’ | Kilari Rosaiah And Other MLAs Pay Visits Actor Jayaprakash Dead Body In Guntur | Sakshi
Sakshi News home page

‘జయప్రకాష్‌రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు’

Published Tue, Sep 8 2020 12:47 PM | Last Updated on Tue, Sep 8 2020 1:26 PM

Kilari Rosaiah And Other MLAs Pay Visits Actor Jayaprakash Dead Body In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: సినీ నటుడు జయప్రకాష్‌ రెడ్డి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణరెడ్డిలు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ..  జయప్రకాష్‌ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, నాటక రంగాల్లో ఆయనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారని పేర్కొన్నారు.

మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని, తన స్వంత ఖర్చుతో గుంటూరులో నాటకాలను ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు‌ జయప్రకాష్‌రెడ్డి భౌతకికాయాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విలనిజంలో జయప్రకాష్‌ కొత్త ఒరవడిని సృష్టించారని, వ్యక్తిగతంగా ఆయన చాలా సౌమ్యుడన్నారు. ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి జయప్రకాష్‌ అని నాటక రంగం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేవమని గిరిధర్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement