Maddali Giridhar Rao
-
ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్
-
సీఎం జగన్‌కు ఘనస్వాగతం
-
ఎమ్మెల్యే గిరిధర్‌ను పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కాగా, ఎమ్మెల్యే గిరిధర్ తల్లి శివపార్వతి(68) గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ మాతృమూర్తి శివపార్వతి సోమవారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె భౌతికకాయానికి మంత్రులు మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: నేడు గుంటూరు నగరానికి సీఎం వైఎస్ జగన్ రాక.. ట్రాఫిక్ మళ్లింపులు ఇవే.. -
గుంటూరు బ్రాడీపేటలో జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం
-
టీడీపీ నేతలు ఫోన్ చేశారు.. సాక్ష్యమిదే: మద్దాలి గిరిధర్
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పచ్చ పార్టీ నేతలు తనను సంప్రదించారని తెలిపారు. చివరి రోజు వరకు టీడీపీ నేతలు ఓటు కోసం తనతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. తన కాల్ డేటాను చూస్తే ఏ నాయకుడు ఫోన్ చేశారో తెలుస్తుందన్నారు. 'కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు. గౌరవం ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడాం. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతోనే వైఎస్సార్సీపీలో చేరాం. టీడీపీ పతనం కావడానికి లోకేషే కారణం. నేను నా వాళ్లు మాత్రమే అనే నైజం చంద్రబాబుది. అమరావతి ఉద్యమం కోసం శ్రీదేవి పోరాడతాననడం హాస్యాస్పదం. పూటకొక మాట మారిస్తే ప్రజల విశ్వాసం కోల్పోతారు.' అని గిరిధర్ ఫైర్ అయ్యారు. చదవండి: కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యం: పేర్ని నాని -
‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్’
-
‘అది గుడిని, గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్’
సాక్షి, గుంటూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘గుడిని, గుడిలో లింగాన్ని మింగేవాళ్లు. చంద్రబాబుకు దేవుడంటే అసలు నమ్మకం లేదు. ఆయన రాష్ట్రంలో కుల, మతాలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ హయాంలో విజయవాడలో 41 ఆలయాలను కూల్చారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా? గోదావరి పుష్కరాల్లో 30 మందిని చంద్రబాబు బలి తీసుకున్నారు. ఎక్కడో చిన్న తప్పిదం జరిగితే దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద జల్లుతున్నారు. బుద్ధా వెంకన్న సైకిల్ బెల్లను దొంగతనాలు చేసేవాడు. ఆయనో బుద్ధిలేని వ్యక్తి. మంత్రి వెలంపల్లి నివాసంలో వెండి సింహాలు ఉన్నాయనటం దారుణం. మంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వెండి రథానికి నాలుగు అడుగుల దూరంలో బుద్ధా వెంకన్న ఇల్లు ఉంది. ఈ కేసులో బుద్ధా వెంకన్నను విచారణ చేయాలి.’ అని ఎమ్మెల్యే గిరిధర్ డిమాండ్ చేశారు. (చదవండి: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి) (చదవండి: చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం) -
‘విలనిజంలో జేపీ కొత్త ఓరవడి సృష్టించారు’
సాక్షి, గుంటూరు: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి భౌతికకాయాన్ని ఎమ్మెల్యే కిలారి రోశయ్య, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణరెడ్డిలు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రోశయ్య మీడియాతో మాట్లాడుతూ.. జయప్రకాష్ రెడ్డి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటని, నాటక రంగాల్లో ఆయనకంటూ పత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ.. నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని, తన స్వంత ఖర్చుతో గుంటూరులో నాటకాలను ప్రదర్శించారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకురాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు జయప్రకాష్‌రెడ్డి భౌతకికాయాన్ని సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విలనిజంలో జయప్రకాష్ కొత్త ఒరవడిని సృష్టించారని, వ్యక్తిగతంగా ఆయన చాలా సౌమ్యుడన్నారు. ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి జయప్రకాష్ అని నాటక రంగం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికి మరువలేవమని గిరిధర్ పేర్కొన్నారు. -
చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం
సాక్షి, గుంటూరు: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి రాజధాని నాటకానికి తెరతీశారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని కోసం రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. 13 జిల్లాల అభివృద్ధి గురించి చంద్రబాబు ఆలోచించలేదని విమర్శించారు. కేవలం ఒక్క మండలంలో రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా బాబు ఆలోచనలు మారకపోతే కాలగర్భంలో కలిసి పోతారని హెచ్చరించారు. వ్యాపార లబ్ది కోసం ఆడుతున్న కపట నాటకాన్ని కట్టిపెట్టాలని హితవు పలికారు. అన్ని ప్రాంతాలతో పాటు అమరావతి అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. (చదవండి: సొమ్ములిస్తే మార్కులేస్తాం.. ) -
‘టీడీపీ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, గుంటూరు : శాసనమండలిలో టీడీపీ నేతలు తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ విమర్శించారు. ద్రవ్యబిల్లును పెట్టనీయకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పేదల కోసం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను టీడీపీ అడ్డుకుంటోందని మండిపడ్డారు. మంత్రి వెల్లంపల్లిపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. (చదవండి : మండలిలో మరోసారి దుష్ట సంప్రదాయం!) మంత్రి వెల్లంపల్లికి టీడీపీ సభ్యులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు ద్రవ్యబిల్లు ప్రాధాన్యత తెలియదా అని ప్రశ్నించారు. సభ్యులు ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో రౌడీయిజానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చాంబర్లో కూర్చొని సభ్యులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు మారకుంటే టీడీపీ భూస్థాపితం కాకతప్పదని ఎమ్మెల్యే గిరిధర్ వ్యాఖ్యానించారు. -
సీఎం జగన్ ఓకే అంటే అంతా వస్తారు
-
టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు : నగర పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ శనివారమిక్కడ మాట్లాడుతూ పార్టీలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు తెలుసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో భారీ ఓటమికి కారణమేంటో బాబు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్) కరోనా ప్రభావం ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందరూ మెచ్చుకునే పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ప్రశంసించారు. అవినీతిని అరికట్టే విధంగా ముఖ్యమంత్రి పాలన ఉందని అభినందించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబేనని ఆయన మండిపడ్డారు. తన హయాంలోని అవినీతిపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే గిరిధర్ డిమాండ్ చేశారు. (పేదలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు) -
బాబుకు ఇంకా బుద్ది రాలేదు: టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, గుంటూరు : ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా చంద్రబాబు నాయుడుకి ఇంకా బుద్ధి రాలేదని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నారని, ప్రతి పనిలోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. గురువారం స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాబు, బాబాయ్‌పై సంచయిత విమర్శలు) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఎన్నో బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు. ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై చంద్రబాబు అనవసర ఆరోపణలు మానుకోవాలని లేకుంటే రాజకీయంగా కనుమరుగవటం ఖాయమని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పేర్కొన్నారు. (పతనం దిశగా టీడీపీ: అంబటి) -
నీతి, నిజాయితీకి మారుపేరన్నారుగా?
-
‘చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరం’
సాక్షి, అమరావతి : ‘అమ్మఒడి’ ఒక గొప్ప సంస్కరణ పథకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల భవిష్యత్ మార్చేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలు, రైతులు కూలీలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని, అలాంటి వారికి ‘అమ్మఒడి’ భరోసా ఇచ్చిందన్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అమ్మఒడి పథకంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చి ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. పేద పిల్లల భవిష్యత్‌ను మార్చే పథకానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్‌ను అభినందించాలన్నారు. ఇటువంటి పథకాలను మరిన్ని తీసుకురావాలని సీఎం జగన్‌ను కోరారు. అమ్మఒడి పథకం పవిత్రమైంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన ‘ అమ్మఒడి’ పథకం పవిత్రమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. ఈ పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఇటువంటి గొప్ప పథకాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించడం బాధాకరం అన్నారు. ‘అమ్మ ఒడి’ లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినందకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు కొమ్ము కాస్తున్నారు
-
చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు
సాక్షి, గుంటూరు : టీడీపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కలిశానని, సీఎంను కలవడంలో తప్పేంటని ప్రశ్నించారు. టీడీపీ నాయకత్వం దీనికి కూడా తప్పుబట్టడం సరికాదని, సీఎం కలిసినందుకు తన అనుమతి లేకుండా నియోజకవర్గానికి మరో ఇంచార్జ్‌ని నియమించారని విమర్శించారు. గత నాలుగు రోజులుగా తనకు వ్యతిరేకంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి గురువారం బహిరంగ లేఖ రాశారు. (సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే) ‘టీడీపీ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశాను. స్థానిక సమస్యలు వివరించాను. సీఎం వెంటనే స్పందించి రూ. 25 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి దగ్గరకి ఎందుకు వెళ్లారని ఒక్కమాట కూడా అడగకుండా.. ఇంచార్జ్‌గా మరో వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏంటి?. ప్రజల కోసం సీఎం ని కలిస్తే తప్పేంటి? నా వివరణ కోరకుండా ఇంచార్జ్‌ని నిమించాల్సిన అవసరం ఏంటి?. వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎందుకు నియమించలేదు?. కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలో ఇంచార్జ్‌ని ఎందుకు నియమించలేదు?. ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నారు. జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 9 సీట్లు ఒక సామాజిక వర్గానికే కేటాయించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అట్టిపెట్టుకుని ఉంటే ఇదేనా మీ ప్రవర్తన. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన నలుగురు విశాఖ ఎమ్మెల్యేలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీ పార్టీలో నాయకులు బయటకు వెళితే వారి ఇళ్ళపైన దాడులు చేస్తారా.? ’అని లేఖలో పేర్కొన్నారు. -
రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు
సాక్షి, అమరావతి: రాజధాని రైతులను కొందరు రెచ్చగొడుతున్నారని, వారి మాటలు నమ్మొద్దని కోరుతున్నానని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు చెప్పారు. ఐదేళ్లలో రాజధాని అమరావతిని చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్నారు. సోమవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌తో కలిసి మద్దాలి గిరి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐదేళ్లలో రాజధాని అమరావతిని ఎంత అభివృద్ధి చేశామన్న విషయంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఆయన హయాంలో రాజధానికి కేవలం రూ.5 వేల కోట్లే ఖర్చు చేశారన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లుపైనే కావాలని చెప్పారు. రైతులకు ఏం చేశామా అన్న విషయం గురించి బాబు ఆలోచన చేసుకోవాలని సూచించారు. రాజధానిపై సీఎంకు స్పష్టమైన వైఖరి ఉందన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయన్నారు. రాజధానులపై ప్రభుత్వం హై పవర్ కమిటీ వేసిందని, కమిటీ నివేదిక అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఆంగ్ల మాధ్యమంపై చంద్రబాబు ద్వంద్వ వైఖరి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటుపై ప్రజల్లో అనుకూలత ఉందని, ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం దీనిపై ద్వంద్వ వైఖరితో ఉన్నారని మద్దాలి గిరి చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసమే సీఎం జగన్‌ను కలిశానని చెప్పారు. స్పందించిన సీఎం అక్కడికక్కడే రూ.25 కోట్లు నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
-
అందుకే సీఎం జగన్‌ను కలిశా: టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: తన నియోజకవర్గ సమస్యల పరిష్కారానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసినట్టు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు తెలిపారు. గుంటూరు పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల గురించి అడగ్గా సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. తన నియోజకవర్గ పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించగా, రూ. 25 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం అమలుపై చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరితో ఉన్నారని అన్నారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే నాడు-నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ కార్యదీక్షత, పట్టుదల చూసి చాలా సంతోషం వేసిందన్నారు. ఉగాది నాటికి పేదలు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి హయాంలో రాష్ట్రం ఇండస్ట్రియల్ హబ్ అయిందని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో మళ్లీ అదే విప్లవం రాబోతోందన్నారు. బొల్లాపల్లి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు రాజధాని గురించి మాట్లాడే పెద్దవాడిని కాదని, రాజధానిపై సీఎంకి స్పష్టత ఉందన్నారు. గత ఐదేళ్లలో అమరావతిలో అభివృద్ధి జరగలేదని, రాజధాని రైతుల ఆందోళనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు. అమరావతి లెజిస్లేటివ్ రాజధానిగా ఉంటుందని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని, అప్పటివరకు వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఐదేళ్లలో రైతుల్ని ఇబ్బంది పెట్టింది ఎవరో అందరికి తెలుసునని అన్నారు. పార్టీ మారడం గురించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. తాను చంద్రబాబును విమర్శించడం లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలని మాత్రమే చెబుతున్నానని ఎమ్మెల్యే గిరిధర్ అన్నారు. -
సీఎం జగన్‌ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, అమరావతి: గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు. భేటీ వివరాలు వెల్లడి కాలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీడీపీ ఎమ్మెల్యే గిరిధర్ రావు కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి దూరంగా ఉంటున్నారు. శాసనసభలో తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి, సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇటీవల విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎం జగన్‌ను కలవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. (ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వల్లభనేని వంశీ)