
సాక్షి, గుంటూరు: ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై టీడీపీ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి రాజధాని నాటకానికి తెరతీశారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజధాని కోసం రూ.5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. 13 జిల్లాల అభివృద్ధి గురించి చంద్రబాబు ఆలోచించలేదని విమర్శించారు. కేవలం ఒక్క మండలంలో రియల్ ఎస్టేట్ కోసమే చంద్రబాబు మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా బాబు ఆలోచనలు మారకపోతే కాలగర్భంలో కలిసి పోతారని హెచ్చరించారు. వ్యాపార లబ్ది కోసం ఆడుతున్న కపట నాటకాన్ని కట్టిపెట్టాలని హితవు పలికారు. అన్ని ప్రాంతాలతో పాటు అమరావతి అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. (చదవండి: సొమ్ములిస్తే మార్కులేస్తాం.. )
Comments
Please login to add a commentAdd a comment