
సాక్షి, గుంటూరు : నగర పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ శనివారమిక్కడ మాట్లాడుతూ పార్టీలో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు తెలుసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో భారీ ఓటమికి కారణమేంటో బాబు ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. (బెస్ట్ సీఎం వైఎస్ జగన్)
కరోనా ప్రభావం ఉన్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందరూ మెచ్చుకునే పాలన చేస్తున్నారని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ప్రశంసించారు. అవినీతిని అరికట్టే విధంగా ముఖ్యమంత్రి పాలన ఉందని అభినందించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు చేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబేనని ఆయన మండిపడ్డారు. తన హయాంలోని అవినీతిపై చంద్రబాబు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే గిరిధర్ డిమాండ్ చేశారు. (పేదలకు ఏపీ ప్రభుత్వం మరో తీపి కబురు)
Comments
Please login to add a commentAdd a comment