
సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పచ్చ పార్టీ నేతలు తనను సంప్రదించారని తెలిపారు. చివరి రోజు వరకు టీడీపీ నేతలు ఓటు కోసం తనతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. తన కాల్ డేటాను చూస్తే ఏ నాయకుడు ఫోన్ చేశారో తెలుస్తుందన్నారు.
'కుట్రలు, వెన్నుపోటు రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు. గౌరవం ఇవ్వకపోవడంతోనే పార్టీని వీడాం. గతంలో చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. సీఎం జగన్‌పై ఉన్న అభిమానంతోనే వైఎస్సార్‌సీపీలో చేరాం. టీడీపీ పతనం కావడానికి లోకేషే కారణం. నేను నా వాళ్లు మాత్రమే అనే నైజం చంద్రబాబుది. అమరావతి ఉద్యమం కోసం శ్రీదేవి పోరాడతాననడం హాస్యాస్పదం. పూటకొక మాట మారిస్తే ప్రజల విశ్వాసం కోల్పోతారు.' అని గిరిధర్ ఫైర్ అయ్యారు.
చదవండి: కొనటం, అమ్మడమే చంద్రబాబు విజయ రహస్యం: పేర్ని నాని
Comments
Please login to add a commentAdd a comment