
సాక్షి, గుంటూరు : ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా చంద్రబాబు నాయుడుకి ఇంకా బుద్ధి రాలేదని గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌రావు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నారని, ప్రతి పనిలోనూ కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. గురువారం స్థానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాబు, బాబాయ్‌పై సంచయిత విమర్శలు)
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే ఎన్నో బృహత్తరమైన పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేశారన్నారు. ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై చంద్రబాబు అనవసర ఆరోపణలు మానుకోవాలని లేకుంటే రాజకీయంగా కనుమరుగవటం ఖాయమని ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పేర్కొన్నారు. (పతనం దిశగా టీడీపీ: అంబటి)
Comments
Please login to add a commentAdd a comment