సాక్షి, అమరావతి : ‘అమ్మఒడి’ ఒక గొప్ప సంస్కరణ పథకమని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘అమ్మఒడి’ పథకాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ.. పేదల భవిష్యత్ మార్చేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతుందన్నారు. పేద ప్రజలు, రైతులు కూలీలు మాత్రమే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారని, అలాంటి వారికి ‘అమ్మఒడి’ భరోసా ఇచ్చిందన్నారు. ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.
అమ్మఒడి పథకంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చి ఇతర రాష్ట్రాలకు సీఎం జగన్ ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు లేకపోవడం దురదృష్టకరం అన్నారు. పేద పిల్లల భవిష్యత్‌ను మార్చే పథకానికి టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించకపోవడం దారుణమన్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నానని, ఇలాంటి గొప్ప పథకాన్ని తెచ్చిన సీఎం జగన్‌ను అభినందిస్తున్నానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్‌ను అభినందించాలన్నారు. ఇటువంటి పథకాలను మరిన్ని తీసుకురావాలని సీఎం జగన్‌ను కోరారు.
అమ్మఒడి పథకం పవిత్రమైంది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన ‘ అమ్మఒడి’ పథకం పవిత్రమైందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. ఈ పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు అనందం వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ఇటువంటి గొప్ప పథకాన్ని వ్యతిరేకించాలని టీడీపీ నిర్ణయించడం బాధాకరం అన్నారు. ‘అమ్మ ఒడి’ లాంటి పథకాన్ని ప్రవేశపెట్టినందకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment