'రాజ్యాంగ రక్షకులను గవర్నర్గా నియమించాలి'
చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా రాజ్యాంగ రక్షకులను నియమించాలని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రెసిడెంట్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడులో ప్రస్తుతం భాష అల్ప సంఖ్యాక ప్రజలపై రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. చెన్నైలోని భాష అల్ప సంఖ్యాక వర్గాల హక్కులను కాపాడే వారిని గవర్నర్‌గా నియమించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి.. రోశయ్యతో తన ప్రయాణం, పరిచయం వంటి విషయాలను గుర్తు చేసుకున్నారు. చీరాల ఉప ఎన్నికలకు రోశయ్య, ఇప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంచార్జ్‌లుగా ఉన్నారన్నారు.
అప్పట్లో వారితో కలిసి కేతిరెడ్డి.. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినట్టు తెలిపారు. చెన్నైలోని తెలుగు సంఘాలకు సంబంధించి తన ప్రకటనలు ఆయన దృష్టికి వెళ్లినప్పుడు కేతిరెడ్డి చాలా స్పీడ్ అంటూ సంబోధించేవారని చెప్పారు. తెలుగు కోసం తాను చేపట్టిన ఉద్యమం వివరాలను తొలుత రోశయ్యకు చెప్పి చేయడం జరిగిందని తెలిపారు. రోశయ్య ప్రత్యక్షంగా తెలుగు ఉద్యమానికి సంఘీభావం తెలుపక పోయినా పరోక్షంగా చాలా మేలు చేశారంటూ కేతిరెడ్డి కొనియాడారు.