రోశయ్యకు ఆత్మీయ సత్కారం
అనంతపురం కల్చరల్ : అనంతలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు వైఎస్సార్‌సీపీ నేతలు సత్కరించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్తియార్ తదితరులు శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో కలిసి పలుకరించారు. అనంతరం శాలువ కప్పి, పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోని విషయాలను గుర్తు చేసుకున్నారు.