
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లును తమ పార్టీ సమర్థిస్తుందని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి తెలిపారు. లోక్‌సభలో మంగళవారం రిజర్వేషన్ల రాజ్యంగ సవరణ బిల్లు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలస్యమైనా అగ్రవర్ణ పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింలకు 12 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ అమలవుతున్న తీరుగా.. తెలంగాణలో కూడా రిజర్వేషన్ల పెంపునకు అనుమతించాలన్నారు. విభజన జరిగాక తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment