సాక్షి, న్యూఢిల్లీ : అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈబీసీ బిల్లును సవాల్ చేస్తూ గురువారం భారత అత్యున్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రిజర్వేషన్లకు ఆర్థిక ప్రమాణాలే ఏకైక ఆధారం కాదని, పార్లమెంట్ ఆమోదించిన బిల్లును కొట్టివేయాలంటూ యూత్ ఫర్ ఈక్వాలిటీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైన అడ్డంకులు తప్పవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ పిల్ దాఖలవడం విశేషం. (రాజ్యసభ ముందుకు ఈబీసీ బిల్లు.. విపక్షాల ఆందోళన)
ఇక దశాబ్దాలుగా ఉన్న డిమాండ్‌కు తలొగ్గుతూ అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఈనెల 7న ఆమోదం తెలిపగా.. 8న లోక్‌సభ, 9న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈబీసీ బిల్లుపై ఉభయ సభల్లో వాడివేడి చర్చ జరిగిన విషయం తెలిసిందే. (అగ్రవర్ణ పేదలకు 10% కోటా)
చదవండి: పేదల కోటాకు ‘పెద్దల’ ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment