reservation classification
-
ఓబీసీల వర్గీకరణతో సమన్యాయం
ఓబీసీ కులాల వర్గీ కరణ ఆవశ్యకతను గుర్తించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2017 అక్టో బర్ 2న ముగ్గురు సభ్యులతో జస్టిస్ రోహిణి అధ్యక్షతన ఒక జాతీయ కమిషన్‌ను (justice rohini commission) ఏర్పాటు చేసింది. దానికి దేశంలో ఓబీసీ కోటాలో విద్యా–ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2,640 కులాలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయడంలోని సాధ్యా సాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి 12 వారాల గడువు ఇచ్చింది. నాటి నుండి కేంద్ర ప్రభుత్వం కమిషన్ పదవీ కాలాన్ని ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి పెంచింది. ఎట్టకేలకు కమిషన్ తన నివేదికను జూలై 2023లో సమర్పించింది. కానీ దాని అమలుకు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాల వారు(OBCs) వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వైనం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో రాజకీయంగా నష్టం కలుగుతుందనే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఓబీసీలను వర్గీకరించక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. 2023 ఆగస్టులో సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. ‘స్టేట్ అఫ్ పంజాబ్ వర్సెస్ దావీందర్ సింగ్’ కేసు తీర్పులో ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1,600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలూ పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అధిక జనసంఖ్య కలిగి సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కులాల వారే అధిక ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ఓబీసీ జాబితాలోని బీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏ మేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జనసంఖ్యను పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీలను 4 గ్రూపులుగా వర్గీకరించి గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్–బీలో 534 కులా లకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. నిజమేమిటో తెలియదు. చదవండి: రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు? మండల్ కమిషన్‌లోని సభ్యులు ఎల్ఆర్ నాయక్ ఆనాడే (1978–80) ఓబీసీ కులాల మధ్య అసమానతలను గమనించి ఆ కులాలను రెండు గ్రూపులుగా వర్గీకరించి 27 శాతం కోటాను అమలు పరచాలని డిసెంట్ నివేదికను కేంద్రానికి సమర్పించారు. అందులో అణిచివేయబడిన బీసీ కులాలకు 15%, మధ్యస్థ బీసీ కులాలకు 12% రిజర్వే షన్లు కేటాయించారు. కానీ, నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన కులా లకు న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్‌కు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం... బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులాల మధ్య సమ న్యాయం కోసం వెంటనే జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు పరచాలి.- కోడెపాక కుమార స్వామిబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు -
ఇక రిజర్వేషన్ల కుస్తీ..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పల్లె పోరుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా అధికార యంత్రాం గం అంతా బిజీ బిజీగా ఉంది. ఓటర్ల జాబితా మొదలుకొని కులగణన ప్రకియ వరకు వివిధ దశల్లో నిర్వహించాల్సి న కార్యక్రమాలను పూర్తి చేసింది. ఇక రిజర్వేషన్ల ప్రక్రియపై కుస్తీ ప్రారంభించింది. గురువారం దీనిపై ప్రకటన విడుదలజేయనుంది. మరో వైపు అధికారులు పోలింగ్ స్టేషన్ల ఎంపిక ప్రకియపై దృష్టి సారించారు. అన్ని వసతులున్న కేంద్రాలను ఎంపిక చేయాలని కలెక్టర్ నుంచి అధికారులకు అదేశాలు అందడంతో గుర్తింపు ప్రకియ ప్రారంభమైంది. జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పంచాయతీల్లో 8910 వార్డులున్నాయి. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే అధికారులు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని షెడ్యూల్ ప్రకటించారు. ఈ మేరకు రెండు నెలల కిత్రం జరిగిన సార్వత్రిక ఎన్నికలఓటర్ల జాబితా ప్రామాణికంగా గ్రామ పంచాయతీని ఒక యూనిట్‌గా తీసుకొని ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. నిబంధనల మేరకు గ్రామ పంచాయతీలు, రద్దీ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచి అభ్యంతరాలను స్వీకరించి తుది జాబితాను జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జిల్లాలోని 940 గ్రామ పంచాయతీల్లో 16,45,439 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి మే 20 వరకు గ్రామంలో నివసిస్తున్న ఓటర్ల ఆధారంగా తుది జాబితాను ప్రకటించారు. ఆత్మకూరు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట డివిజన్ల వారీగా ఉన్న పంచాయతీల్లోని వార్డుల్లో గల ఓటర్ల జాబితాలను ప్రకటించారు. ఈ ప్రకియ ముగిశాక కులగణనపై కసరత్తును నిర్వహించారు. ఇందులో భాగంగా అన్ని పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి కులగణన ప్రకియను చేపట్టారు. ముఖ్యంగా గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపే కీలకంగా దీన్ని నిర్వహించారు. ఈ నెల మొదటి వారం వరకు దీన్ని నిర్వహించి తుది జాబితాతో ఈ నెల 11 నుంచి 17 వరకు ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో జిల్లాలో కులగణనపై కొన్ని చోట్ల నిర్వహించిన గ్రామసభల్లో అభ్యంతరాలు రావడంతో మళ్లీ కసరత్తు చేశారు. అందిన డ్రాఫ్ట్ కాపీలు ఇందులో భాగంగా అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి డ్రాఫ్ట్ కాపీలు మంగళవారం అందాయి. బుధవారం పూర్తిస్థాయి పరిశీలన అనంతరం కులగణన అధారంగా పంచాయతీల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గురువారం గ్రామాల వారీగా రిజర్వేషన్ల జాబితాను ప్రకటించనున్నారు. దీనికి అనుగుణంగా ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రకియపైనా అధికార గణం దృష్టి సారించింది. ప్రాథమికంగా ఒక్కో వార్డులో ఒక్కో బూత్ చొప్పున 8910 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గ్రీన్ సిగ్నల్ వస్తే మూడు దశల్లో ఎన్నికలు కులగణన పూర్తి చేసిన అనంతరం ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే ఎన్నికల సంఘం రంగంలోకి దిగుతుంది. దీనికి అనుగుణంగా మండలం లేదా రెవెన్యూ డివిజన్‌ను ఒక యూనిట్‌గా తీసుకొని సిద్ధం చేసే అవకాశం ఉంది. జిల్లా పంచాయతీ అధికారులు జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వ పరిశీలనకు పంపారు. ఇలా జరిగేందుకు అవకాశం.. మొదటగా కావలి, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లలోని 19 మండలాల్లో గల 360 పంచాయతీల పరిధిలో 3406 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 12 మండలాల్లో గల 234 గ్రామ పంచాయతీల పరిధిలోని 2346 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. మూడో దశలో గూడూరు, నాయుడుపేట డివిజన్లలోని 15 మండలాల్లో 346 గ్రామ పంచాయతీల్లో 3158 వార్డుల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. -
‘చట్టసభల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కావాలి’
సాక్షి, న్యూఢిల్లీ : అన్ని రంగాల్లో జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం శనివారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... ‘అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి.చట్టసభల్లో 14%, ఉద్యోగాల్లో 9%, వ్యాపార వాణిజ్య రంగాల్లో ఒక్క శాతం మాత్రమే బీసీలకు ప్రాతినిథ్యం ఉంది. బీసీలకు చట్టసభల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినా బీసీలకు తమ వాటా దక్కలేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. -
రిజర్వేషన్ల వర్గీకరణతో సమన్యాయం
క్రీమీలేయర్‌ను తొలగించాలి: ఆర్.కృష్ణయ్య సాక్షి, హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై టీ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంతో ఓబీసీ జాబితాలో ఉన్న 2,600 కులాలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ కులాల్లో కూడా హెచ్చుతగ్గుల వ్యత్యాసాలు ఉన్నాయని, ఇప్పుడు వర్గీకరణ చేయడంతో అన్ని కులాలకు సమన్యాయం జరుగుతుందని వివరించారు. జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించినందుకు, ఓబీసీ రిజర్వేషన్లను వర్గీకరించినందుకు అక్టోబర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీని సన్మానించాలని నిర్ణయించామని తెలిపారు. గురువారం సచివాలయం మీడియా పాయింట్లో కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రం 2011 జనాభా లెక్కలు తీసుకున్నా ఇంతవరకు కులాలవారీ లెక్కలు ప్రకటించలేదని, లెక్కలు ప్రకటిస్తేనే వర్గీకరణ పూర్తిగా జరుగుతుందన్నారు. గ్రూప్‌లలో చేర్చే కులాల జనాభా తెలిస్తే దాని ప్రకారం గ్రూపుల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి అవకాశం ఉంటుందని, అప్పుడే వర్గీకరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా జరుగుతుందని తేల్చి చెప్పారు. క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంచడం కాదని, పూర్తిగా తొలగించాలన్నారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయా లన్నారు. గుజ్జ కృష్ణ, గుజ్జ రమేశ్, నీల వెంకట్, కె.నరసింహగౌడ్, రాజేందర్, చీపురు మల్లేష్ యాదవ్, జి.కృష్ణయాదవ్ పాల్గొన్నారు. -
'బాబుకు సిగ్గుంటే ...మాట నిలబెట్టుకోవాలి'
విజయవాడ : సీఎం చంద్రబాబుకు సిగ్గున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వమున్నా.. వర్గీకరణ చేపట్టి పెద్దమాదిగనవుతానన్న మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉరుసుపాటి బ్రహ్మయ్య సవాల్ విసిరారు. విజయవాడలోని స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబు తన నాయకత్వంలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే టీడీపీ వర్గీకరణకు కట్టుబడి వుందని మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రకటనలు చేశారని గుర్తుచేశారు. రావెల, చంద్రబాబుకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వర్గీకరణను చేసి చూపించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాదిగలను మోసం చేసే పద్ధతిలో వ్యవహరిస్తోందన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబును తిట్టిన జూపూడి, కారెం శివాజీలకు ఉన్నత పదవులు కట్టబెట్టడం సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు. దీనిపై మాదిగ జాతికి మంత్రి రావెల సమాధానం చెప్పాలన్నారు. వర్గీకరణ కోరుతూ ఆదివారం ఢిల్లీలో కృష్ణమాదిగ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నారన్నారు. ఆయనకు మద్దతుగా ఈనెల 9 నుంచి 13 వరకు విజయవాడలోరిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. వర్గీకరణకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు, లేని పక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కోట డానియేల్, అధికార ప్రతినిధి మానికొండ శ్రీధర్, నగర అధ్యక్షుడు లింగాల నర్సింహులు, రోజ్‌కుమార్, ఎలిషా తదితరులు పాల్గొన్నారు.