వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్ జంగా కృష్ణమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలంతా ఈ గర్జనకు తరలిరావాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అనంతరం పలు కీలక విషయాలు మీడియాకు వెల్లడించారు. బీసీ కులాల స్థితిగతులను, జీవన ప్రమాణాలను తెలుసుకునే ఉద్దేశంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాదిన్నర క్రితం బీసీ అధ్యయన కమిటీ నియమించారని తెలిపారు.