హిందూపురం అర్బన్ : సౌత్ వెస్ట్రన్ రైల్వే హిందూపురం బ్రాంచ్ సెక్షన్ ఆఫీసులో శుక్రవారం సీబీఐ పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే ఉద్యోగుల పిల్లలకు అందించే హాస్టల్ ఫీజు నిధులను రెండేళ్లుగా అక్రమంగా కాజేస్తూ సుమారు రూ.కోటి స్వాహా చేసిన కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు వ్యవహారాన్ని సీబీఐకు అప్పగించారు. ఆర్నెల్లుగా రెండు డివిజన్ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు విచారణలు చేపడుతూ వచ్చారు.
ఇందులో భాగంగా శుక్రవారం సీబీఐ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్, మరో ముగ్గురు అధికారులు, పెనుకొండ, హిందూపురం సెక్షన్ ఇంజనీరు కార్యాలయాల్లో రైల్వే ఉద్యోగులను విచారణ చేశారు. వారి వద్ద డ్యూటీ కార్డులు, ఆధార్ కార్డులు, ఇతర పత్రాలను తీసుకున్నారు. సీబీఐ కోర్టుకు హాజరై ఈ కేసులో సాక్షులుగా వివరాలు వెల్లడించాలని చెప్పారు.
రైల్వేసెక్షన్ ఆఫీసులో సీబీఐ విచారణ
Published Fri, Sep 23 2016 11:57 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
Advertisement