న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ)లో నరీందర్ బత్రా నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రాథమిక విచారణ చేపట్టింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడైన నరీందర్ బత్రా.. హెచ్‌ఐకి చెందిన రూ. 35 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీనిపై సీబీఐకి హెచ్‌ఐ ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ నిమిత్తం కేసు రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నరీందర్ బత్రాకు హాకీ ఇండియాకు మధ్య విబేధాలు పొడసూపాయి. భారత పురుషుల హాకీ జట్టు ప్రదర్శనపై పదేపదే బత్రా విమర్శించడం, ప్రశ్నించడం మింగుడుపడని హెచ్‌ఐ తమ నిధులు, విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 1975 ప్రపంచకప్ హాకీ విజేత జట్టు సభ్యుడైన అస్లామ్ షేర్‌ఖాన్... బత్రా మితిమీరిన జోక్యంపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.
చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్!
Comments
Please login to add a commentAdd a comment