Narinder Batra
-
భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా సుమారివాలా
Adille Sumariwalla Appointed As Interim President Of Indian Olympic Association: భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్ఐ) అధ్యక్షుడు, మాజీ ఒలింపియన్ ఆదిల్ సుమారివాలా ఎన్నికయ్యారు. వ్యక్తిగత కారణాల చేత మాజీ అధ్యక్షుడు నరిందర్ బత్రా రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని సుమారివాలా భర్తీ చేయనున్నారు. ఎన్నికలు జరిగే వరకు సుమారివాలా ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఐవోఏ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యులు సుమారివాలా అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఈ నియామకం జరిగినట్లు ఐవోఏ వెల్లడించింది. కాగా, భారత ఒలింపిక్ సంఘం చరిత్రలో ఓ ఒలింపియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆదిల్ సుమారివాలా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున అథ్లెటిక్స్‌లో (100 మీటర్ల రన్నింగ్) ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత -
Narinder Batra: మూడు పదవుల నుంచి అవుట్
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత ఒలింపిక్ క్రీడల పరిపాలనా వ్యవహారాల్లో కీలక ముద్ర వేయడంతో పాటు ప్రపంచ హాకీ నిర్వహణలో కూడా ప్రధాన పాత్ర పోషించిన సీనియర్ అడ్మినిస్ట్రేటర్ నరీందర్ బత్రా కథ ముగిసింది. ఇటీవల తనపై వచ్చిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఆయన అన్ని పదవుల నుంచి తప్పుకున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు. దీంతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యత్వానికి, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. మూడు వేర్వేరు రాజీనామా లేఖల్లో ‘వ్యక్తిగత కారణాలతో’ తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా 2016లో తొలిసారి ఎంపికైన బత్రా... గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచి 2024 వరకు పదవిలో సాగేలా అవకాశం దక్కించుకున్నారు. ‘హాకీ ఇండియా’ అధ్యక్షుడిగా రూ. 35 లక్షలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో బత్రాపై సీబీఐ విచారణ జరుగుతోంది. సోమవారం కూడా బత్రా ఇళ్లపై సీబీఐ దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటలకే ఆయన రాజీనామాలు వచ్చాయి. నిజానికి ఐఓఏ అధ్యక్ష పదవి నుంచి గత మే నెలలోనే ఢిల్లీ కోర్టు తొలగించినా... కోర్టులో సవాల్ చేసిన ఆయన అధికారికంగా రాజీనామా చేయలేదు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యేందుకు బత్రా తప్పుడు పద్ధతిని అనుసరించారు. తనను తాను హాకీ ఇండియా జీవితకాల సభ్యుడిగా నియమించుకొని ఐఓఏ ఎన్నికల్లో గెలిచారు. దాంతో కోర్టు జోక్యం చేసుకుంది. మరోవైపు ఐఓఏ అధ్యక్షుడైన కారణంగానే లభించిన ఐఓసీ సభ్యత్వ పదవికి సహజంగానే రాజీనామా ఇవ్వాల్సి వచ్చింది. -
బత్రాపై సీబీఐ దర్యాప్తు.. కారణమేంటి?
న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్ఐ)లో నరీందర్ బత్రా నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రాథమిక విచారణ చేపట్టింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడైన నరీందర్ బత్రా.. హెచ్‌ఐకి చెందిన రూ. 35 లక్షలను వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐకి హెచ్ఐ ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణ నిమిత్తం కేసు రిజిస్టర్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల నరీందర్ బత్రాకు హాకీ ఇండియాకు మధ్య విబేధాలు పొడసూపాయి. భారత పురుషుల హాకీ జట్టు ప్రదర్శనపై పదేపదే బత్రా విమర్శించడం, ప్రశ్నించడం మింగుడుపడని హెచ్ఐ తమ నిధులు, విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. 1975 ప్రపంచకప్ హాకీ విజేత జట్టు సభ్యుడైన అస్లామ్ షేర్‌ఖాన్... బత్రా మితిమీరిన జోక్యంపై ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. చదవండి: IPL 2022: కమిన్స్ కమాల్.. ముంబై ఢమాల్.. తిలక్ కొట్టిన సిక్సర్ మాత్రం హైలైట్! -
ప్రేక్షకులు లేకపోవడం లోటే: సింధు
హైదరాబాద్: కోవిడ్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంటే... బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ పూసర్ల వెంకట సింధు మాత్రం తనకు మహమ్మారితో కీడు కంటే మేలే జరిగిందని చెప్పుకొచ్చింది. గురువారం ఇక్కడ వర్చువల్ మీడియా కార్యక్రమంలో పా ల్గొన్న ఆమె మాట్లాడుతూ ‘కరోనా వల్ల వచ్చిన విరామం నాకైతే బాగా దోహద పడింది. ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు సాంకేతిక నైపుణ్యం సాధించేందుకు విరామం అక్కరకొచ్చింది. దీని వల్ల ఎక్కువ సమ యం ఆటపైనే దృష్టి పెట్టేలా చేసింది. ఇవన్నీ నా ఆటకు, టోక్యోలో ముం దంజ వేసేందుకు తప్పకుండా ఉపయోగపడతాయనే గట్టి నమ్మకంతో ఉన్నాను. సాధారణంగా అయి తే విదేశాల్లో జరిగే టోర్నీలు ఆడేందుకు వెళ్లడం, తిరిగొచ్చి శిక్షణలో గడపటం పరిపాటి అయ్యేది. ప్రయాణ బడలిక, బిజీ షెడ్యూల్ వల్ల సమయం పూర్తి స్థాయి శిక్షణకు అంతగా సహకరించేది కాదు. ఇప్పుడైతే విరామంతో వీలైనంత ప్రాక్టీస్ చేసేందుకు మరెంతో సమయం లభిం చింది’ అ ని వివరించింది. ప్రేక్షకుల్లేకపోవడాన్ని మాత్రం లోటుగా భావిస్తున్నట్లు సింధు చెప్పింది. 1000 మంది వీఐపీలతోనే... టోక్యో: విశ్వక్రీడలు ఎక్కడ జరిగినా... ఏ దేశం ఆతిథ్యమిచ్చినా... ప్రారంభోత్సవ వేడుకలైతే అంబరాన్ని అంటుతాయి. అయితే కరోనా కార ణంగా ఈ నెల 23న నేషనల్ స్టేడియంలో జరిగే ప్రతిష్టాత్మక వేడుకకు కేవలం వందల సంఖ్యలోనే అది కూడా వీఐపీ ప్రేక్షకులను మాత్రమే అనుమతించనున్నారు. 68 వేల సామర్థ్యమున్న స్టేడియంలో కేవలం 1000 లోపు ప్రముఖులే ఈ వేడుకల్ని ప్రత్యక్షంగా తిలకిస్తారు. టోక్యో గవర్నర్‌తో ఐఓసీ చీఫ్ భేటీ ఇంకో వారంలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా జపాన్ అధ్యక్షుడు సీకో హషిమొటో, ప్రధాని యోషిహిదే సుగాలతో సమావేశమైన ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ గురువారం కూడా టోక్యో గవర్నర్ యూయికొ కొయికేతో మీటింగ్‌లో పాల్గొన్నారు. తుది ఏర్పాట్లు, అత్యవసర పరిస్థితి (టోక్యోలో ఎమర్జెన్సీ)లో అ నుసరిస్తున్న వ్యూహాలపై చర్చించారు. కేసుల హైరానా కోవిడ్ కేసులు జపాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా టోక్యోలో అత్యవసర పరిస్థి తి విధించారు. అయినా సరే టోక్యో నగరంలో కరోనా బాధితులు పెరిగిపోతున్నా రు. బుధవారం 1485 మంది, గురువారం మరో 1308 మందికి వైరస్ సోకింది. ఈ రెండు రోజులు కూడా గడిచిన ఆరు నెలల్లో ఒక రోజు నమోదైన కేసుల సంఖ్యను (జనవరి 21న 1149 కేసులు) అధిగమించాయి. ఏర్పాట్లన్నీ బాగున్నాయి: ఐఓఏ న్యూఢిల్లీ: టోక్యోలో ఆటగాళ్లకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతులు, ఇతరత్రా సదుపాయాలన్నీ బాగున్నాయని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా చెప్పారు. భారత చెఫ్ డి మిషన్ బి.పి.బైశ్యా నేతృత్వంలోని బృందం ఈ నెల 14నే టోక్యో చేరుకొని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిందని బాత్రా తెలిపారు. కొన్ని చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కరిస్తామని నిర్వాహకులు చెప్పినట్లు ఆయన వివరించారు. విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్న పలువురు భారత అథ్లెట్లు నేరుగా జపాన్ వెళ్లనుండగా... భారత్ నుంచి మాత్రం 90 మందితో కూడిన తొలి బృందం రేపు అక్కడికి పయనమవుతుంది. -
ముందస్తు హెచ్చరిక.. కనీసం ఏడు గంటలు ఆలస్యం కావొచ్చు
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత అథ్లెట్లకు టోక్యో విమానాశ్రయం నుంచి సమస్యలు ఎదురు కావచ్చని, అన్నింటికీ సిద్ధపడి జపాన్ అధికారులకు సహకరించాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. కరోనా నేపథ్యంలో విమానాశ్రయంలోనే ఆహారం, నీళ్లు లేకుం డా కనీసం ఏడు గంటల పాటు వేచి చూడాల్సి రావచ్చని, దీనిని సమస్యగా భావించరాదని ఆయన అన్నారు. టోక్యోలో ఇప్పటికే అడుగు పెట్టిన వివిధ దేశాల ఆటగాళ్లకు ఎదురైన అనుభవాన్ని, అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఈ విషయం చెబుతున్నట్లు బాత్రా స్పష్టం చేశారు. ‘చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు విమానాశ్రయంలోకి అడుగు పెట్టాక నాలుగు గంటల తర్వాతగానీ ఇమిగ్రేషన్ ప్రక్రియ మొదలు కాలేదు. ఆ తర్వాత తమ టీమ్ బస్సులోకి ఎక్కేందుకు వారికి మరో మూడు గంటలు పట్టింది. ఈ సమయంలో ఎలాంటి ఆహారం, నీళ్లు కూడా ఇవ్వలేదు. అసలు అక్కడ వలంటీర్లు అనేవాళ్లే లేరని జర్మనీ బృందం వెల్లడించింది. కాబట్టి గేమ్స్ విలేజ్ చేరుకునే వరకు మీరంతా ఇలాంటి సమస్యలకు మానసికంగా సిద్ధం కావాలనే ముందుగా చెబుతున్నాం. అసాధారణ పరిస్థితుల్లో ఈ క్రీడలు జరుగుతున్నందున చిరునవ్వుతోనే స్థానిక అధికారులకు సహకరించాలి. విమానాశ్రయంలోకి అడుగు పెట్టగానే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ఎవరూ టీమ్ బస్సు ఎక్కడానికి వీల్లేదు. దీనంతటికీ చాలా సమయం పట్టవచ్చు’ అని బాత్రా భారత క్రీడాకారులకు సూచించారు. -
‘ఐఓఏ ఆఫీసు తెరిచేందుకు అనుమతివ్వండి’
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు ఢిల్లీలోని తమ కార్యాలయాన్ని ఈనెల 7 నుంచి తెరిచేందుకు అనుమితి ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా లేఖ రాశారు. ‘టోక్యో’తో సంబంధమున్న దాదాపు 240 మంది వివరాలను నమోదు చేయాల్సి ఉందని... లాక్‌డౌన్‌తో ఇంటివద్ద నుంచే ఈ పని చేస్తున్నా సవ్యంగా జరగడం లేదని బాత్రా అన్నారు. ఒలింపిక్స్ కోసం భారత బృందం సర్వ సన్నద్ధంగా ఉందని నరీందర్ బాత్రా రెండురోజుల క్రితం వెల్లడించారు. ఇప్పటివరకైతే వంద మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇందులో 56 మంది పురుషులు, 44 మంది మహిళలు కాగా... క్వాలిఫికేషన్స్ కటాఫ్ తేదీ వరకల్లా ఈ జాబితాలో మరో 25 నుంచి 35 మంది చేరతారని ఐఓఏ ఆశిస్తోంది. కోచ్, సహాయ సిబ్బంది కలుపుకొని సుమారు 190 మందితో భారత జట్టు టోక్యోకు వెళుతుందని బా త్రా చెప్పారు. -
190 మందితో భారత బృందం
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం భారత బృందం సర్వ సన్నద్ధంగా ఉందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ఇప్పటివరకైతే వంద మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇందులో 56 మంది పురుషులు, 44 మంది మహిళలు కాగా... క్వాలిఫికేషన్స్ కటాఫ్ తేదీ వరకల్లా ఈ జాబితాలో మరో 25 నుంచి 35 మంది చేరతారని ఐఓఏ ఆశిస్తోంది. కోచ్, సహాయ సిబ్బంది కలుపుకొని సుమారు 190 మందితో భారత జట్టు టోక్యోకు వెళుతుందని బా త్రా చెప్పారు. క్రీడా శాఖ ఆదేశాల ప్రకారం కోచ్, అధికారులు ఎవరైనా క్రీడాకారుల మొత్తంలో మూడో వంతుకు మించడానికి వీల్లేదని ఆయన తెలిపారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ధరించబోయే కిట్ ను క్రీడా మంత్రి కిరిణ్ రిజిజు ఆవిష్కరించారు. -
నరీందర్ బత్రా పదవీకాలం పొడిగింపు
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్ నరీందర్ బత్రా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. కరోనా కారణంగా న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 28న జరగాల్సిన ఎఫ్ఐహెచ్ వార్షిక సమావేశం వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు ఎఫ్ఐహెచ్ శనివారం ప్రకటించింది. ‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అధికారుల పదవులను కూడా మరో ఏడాది పాటు పొడిగిస్తున్నాం’ అని ఎఫ్ఐహెచ్ తన ప్రకటనలో వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సింది. బత్రా 2016 నవంబర్‌లో ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా బత్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో కూడా సభ్యత్వం ఉంది. -
అనుకున్న తేదీల్లోనే ఒలింపిక్స్
న్యూఢిల్లీ: రీషెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ కచ్చితంగా జరుగుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా స్పష్టం చేశారు. శనివారం ఆన్లైన్లో నిర్వహించిన భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. కరోనాకు వ్యాక్సిన్ అమల్లోకి వచ్చాకే విశ్వ క్రీడలు నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలతో నెలకొన్న సందిగ్ధతను ఆయన సమావేశంలో దూరం చేశారు. ‘టోక్యో క్రీడలపై రోజుకో రకంగా వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఏది ఏమైనా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగుతాయి. విశ్వ క్రీడలకు సంబంధించిన ముఖ్య వ్యక్తులతో నేను తరచుగా మాట్లాడుతున్నా. వదంతులకు ప్రాధాన్యతనివ్వకండి. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లలో కరోనా చికిత్స భారత్‌లో అందుబాటులోకి రావొచ్చు. కాబట్టి ఒలింపిక్స్ జరుగుతాయనే మానసిక సన్నద్ధతతో ఉండండి’ అని ఆయన పేర్కొన్నారు. -
‘కామన్వెల్త్’ను పక్కనపెట్టాలి: బాత్రా
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా కామన్వెల్త్ గేమ్స్‌పై చేసిన వ్యాఖ్యలు క్రీడావర్గాల్లో కలకలం రేపాయి. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో బాత్రా మాట్లాడుతూ కామన్వెల్త్ గేమ్స్‌ను శాశ్వతంగా బాయ్‌కాట్ చేయాలని అన్నారు. ‘ఆ క్రీడల్లో పోటీ స్థాయి తక్కువ. చెప్పాలంటే అక్కడి ఈవెంట్లలో పోటీ ఏమంత గొప్పగా ఉండదు. కాబట్టి ఆ క్రీడలను పట్టించుకోకుండా శాశ్వతంగా పక్కనబెట్టాలి’ అని బాత్రా పేర్కొన్నారు. బర్మింగ్‌హామ్ గేమ్స్‌లో షూటింగ్‌ను తప్పించడంపై లోగడ ఈయన ఇదేవిధమైన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు పతకాలను తెచ్చిపెట్టే షూటింగ్‌ను మెగా ఈవెంట్ నుంచి తప్పించడంతో భారత్ కామన్వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ)లో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేయాలని సూచించారు. అయితే తాజాగా శాశ్వతంగా బాయ్‌కాట్ చేయాలనడంపై క్రీడావర్గాలు తీవ్రంగా మండిపడ్డాయి. కేంద్ర క్రీడాశాఖ, సీడబ్ల్యూజీ వర్గాలు మాత్రం దీనిపై ఇప్పటికి ఇప్పుడే∙స్పందించేందుకు నిరాకరించాయి. టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సత్యన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు సరికాదని, దీన్ని అంగీకరించలేమని అన్నాడు. బాక్సింగ్ స్టార్ విజేందర్ స్పందిస్తూ ఇది అథ్లెట్ల కఠోర శ్రమను నీరుగారుస్తుందని చెప్పాడు. షట్లర్ పారుపల్లి కశ్యప్ మాట్లాడుతూ బాయ్‌కాట్ హాస్యాస్పదమన్నాడు. అథ్లెటిక్స్ పరంగా చూస్తే ఆసియా క్రీడల కంటే కామన్వెల్త్ గేమ్స్‌లోనే పోటీ స్థాయి ఎక్కువుంటుందని సీడబ్ల్యూజీ (2010) స్వర్ణ విజేత, అథ్లెట్ కృష్ణ పూనియా తెలిపింది. రెండుసార్లు స్వర్ణం గెలిచిన వెయిట్‌లిఫ్టర్ సతీశ్ శివలింగం బాయ్‌కాట్‌కు తాను వ్యతిరేకమన్నాడు. హాకీ ఆటగాళ్లు, పలు జాతీయ క్రీడా సమాఖ్యలు కూడా బాత్రా వ్యాఖ్యలు సరికాదని ప్రకటించాయి. -
ఐఓఏ కొత్త అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. నామమాత్రమైన ఎన్నికల ప్రహసనంలో ఆయనకు 142 ఓట్లు పడగా... అనిల్ ఖన్నాకు 13 ఓట్లు వచ్చాయి. నిజానికి ఖన్నా అధ్యక్ష పదవికి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. గడువు ముగిశాక ఈ పని చేయడంతో ఆయన అయిష్టంగా బరిలో ఉండాల్సి వచ్చింది. గురువారం ఇక్కడ జరిగిన ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్ అయిన 60 ఏళ్ల బాత్రా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. కార్యదర్శిగా రాజీవ్ మెహతా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికవగా, కోశాధికారి ఆనందీశ్వర్ పాండే గెలిచారు. నూతన కార్యవర్గం నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటుంది. ఐఓఏ కొత్త అధ్యక్షుడు బాత్రా మాట్లాడుతూ... 2026 కామన్వెల్త్ గేమ్స్, 2030 ఆసియా క్రీడలు, 2032 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల పోటీలో ఉండేందుకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. -
నరీందర్ బాత్రా అరుదైన ఘనత
• అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నిక • ఈ ఘనత సాధించిన తొలి యూరోపేతర వ్యక్తి దుబాయ్: హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రాకు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడిగా ఆయన భారీ ఆధిక్యంతో ఎన్నికయ్యారు. 45వ ఎఫ్ఐహెచ్ కాంగ్రెస్‌లో శనివారం ఈ పదవి కోసం ఓటింగ్ జరిగింది. ఇందులో బాత్రాకు మద్దతుగా 68 ఓట్లు దక్కారుు. ఆయన ప్రత్యర్థులు డేవిడ్ బల్బిర్నీ (ఐర్లాండ్)కి 29, కెన్ రీడ్ (ఆస్ట్రేలియా)కు 13 ఓట్లు మాత్రమే వచ్చారుు. దీంతో 12వ ఎఫ్ఐహెచ్ చీఫ్‌గా ఎన్నికై న బాత్రా ఈ పదవి చేపట్టిన తొలి ఆసియా వ్యక్తిగానే కాకుండా తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. యూరోపేతర దేశాల నుంచి ఎఫ్‌ఐహెచ్‌కు అధ్యక్షుడు ఎన్నికవడం ఇదే తొలిసారి. మొత్తం 118 ఓట్లలో 110 మాత్రమే నమోదుకాగా ఎనిమిది మంది గైర్హాజరయ్యారు. ఆసియా హాకీ సమాఖ్య అధికారిక అభ్యర్థిగా నామినేట్ అరుున 59 ఏళ్ల బాత్రాకు ఆసియా, ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా దేశాల నుంచి అధిక మద్దతు లభించింది. 2008 నుంచి అధ్యక్షుడిగా కొనసాగుతున్న లియాండ్రో నెగ్రే (స్పెరుున్) నుంచి బాత్రా వెంటనే బాధ్యతలు తీసుకుంటారు. నాలుగేళ్లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈనేపథ్యంలో ఆయన హాకీ ఇండియా అధ్యక్ష పదవిని త్యజించాల్సి ఉంటుంది. మరోవైపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతిన సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నిక జరిగింది. ప్రతీ జాతీయ సంఘానికి చెందిన ప్రతినిధికి ట్యాబ్లెట్‌తో పాటు పాస్వర్డ్ కేటారుుంచగా తమకు ఇష్టమైన అభ్యర్థిని వారు ఎన్నుకున్నారు. ఈ ఫలితాలను అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న లియాండ్రో నెగ్రే వెల్లడించారు. బాత్రా విజయంతో ప్రపంచ హాకీపై గుత్తాధిపత్యం యూరప్ నుంచి ఆసియాకు మారినట్టరుు్యంది. 2014 అక్టోబర్‌లో హాకీ ఇండియా అధ్యక్షుడిగా ఎన్నికై న బాత్రా.. ఎఫ్ఐహెచ్ అత్యున్నత పదవి కోసం గత కొన్ని వారాలుగా అనుబంధ దేశాలకు చెందిన సంఘాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అంతేకాకుండా వారికి సంబంధించిన హాకీ ఈవెంట్స్‌కు పూర్తి మద్దతు తెలుపుతూ చురుగ్గా ఉండేవారు. దీంతో సహజంగానే అందరి మొగ్గు బాత్రా వైపు నెలకొంది. హాకీ అభివృద్ధికి విశేష కృషి 1957, ఏప్రిల్ 18న జన్మించిన నరీందర్ బాత్రా ప్రముఖ పారిశ్రామిక వేత్త. 2009లో తొలిసారిగా ఆయన హెచ్‌ఐలో కోశాధికారిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి చురుకై న ఆఫీస్ బేరర్‌గా అందరి దృష్టిలో పడ్డారు. దీంతో ఏడాది అనంతరం ప్రధాన కార్యదర్శి హోదాకు ఎదిగారు. అనంతరం దేశంలో హాకీకి పూర్వ వైభవం తెచ్చేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు. హాకీ అభివృద్ధిపై అంకితభావంతో ముందుకెళ్లి గత ఆరేళ్లలో హాకీ ఆదాయాన్ని 5 లక్షల డాలర్ల నుంచి కోటీ 41 వేల డాలర్లకు పెంచారు. ఐపీఎల్ తరహాలోనే హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)కు రూపకల్పన చేసి ఆటగాళ్లతో పాటు హెచ్ఐ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు. అలాగే 2014 నుంచి హెచ్ఐ అధ్యక్షుడిగా ఉన్న బాత్రా పలు అంతర్జాతీయ ఈవెంట్స్‌ను భారత్‌కు రప్పించారు. ‘హాకీని విశ్వవ్యాప్తం చేస్తా’ ‘ఎఫ్ఐహెచ్ అధ్యక్ష పదవి నాకు దక్కిన గొప్ప గౌరవం. హాకీని అమితంగా ఇష్టపడే నేను ఈ క్రీడను విశ్వవ్యాప్తం చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తాను. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతిదీ ఎంత వరకు చేరింది.. ఎంత ఆర్జించింది అనే లెక్కలపైనే నడుస్తోంది. హాకీకున్న హద్దులను చెరిపేసి మరింత విస్తరించడంపైనే నేను దృష్టి పెడతా. అప్పుడు ఈ ఆటను 10, 12 దేశాలకే పరిమితం కాకుండా విస్తరించవచ్చు. అమెరికా, చైనా, భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్నారుు. అలాగే ఈ క్రీడకు కూడా ఈ మూడు దేశాలు మంచి మార్కెట్‌గా ఉంటాయనడంలో సందేహం లేదు. అందుకే ఇక్కడ హాకీని పాపులర్ చేస్తే ఎంతో అభివృద్ధి చెందవచ్చు’ - అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బాత్రా -
ఎఫ్ఐహెచ్ అధ్యక్ష రేసులో బాత్రా
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవి రేసులో హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు లీండ్రో నెగ్రె పదవీకాలం నవంబరులో ముగియనుంది. నవంబరు 12న దుబాయ్‌లో జరిగే ఎఫ్ఐహెచ్ సమావేశంలో కొత్త అధ్యక్షుడితోపాటు మిగతా కార్యవర్గాన్ని ఎనుకుంటారు. అధ్యక్ష పదవి కోసం నరీందర్ బాత్రా (భారత్), కెన్ రీడ్ (ఆస్ట్రేలియా), డేవిడ్ బాల్బిర్నీ (ఐర్లాండ్)లను ఆయా దేశాల సమాఖ్యలు నామినేట్ చేశారుు. -
టెర్రీ వాల్ష్ సేవలు ఇక చాలు: హెచ్ ఐ
న్యూఢిల్లీ: టెర్రీ వాల్ష్ సేవలు ఇక అవసరం లేదని హాకీ ఇండియా(హెచ్ ఐ) స్పష్టం చేసింది. వాల్ష్ మనసు మార్చుకుని భారత హాకీ జట్టుకు మళ్లీ కోచ్ పనిచేసేందుకు సిద్ధపడినా తాము అంగీకరించబోమని హెచ్ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. ఈ మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ జిజి థామ్సన్ కు ఆయన లేఖ రాశారు. టెర్రీ వాల్ష్ సేవలు అవసరం లేదని, సాయ్ అనుమతితో కొత్త కోచ్ ను నియమించుకుంటామని బాత్రా పేర్కొన్నారు. హాకీ ఇండియా ఒప్పుకుంటే భారత హాకీ జట్టు కోచ్‌గా మరో సారి టెర్రీ వాల్ష్‌ను నియమించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సాయ్ ప్రకటించిన నేపథ్యంలో బాత్రా ఈ లేఖ రాశారు. -
భారత హాకీ అధ్యక్షుడికి పుత్రశోకం
న్యూఢిల్లీ: భారత హాకీ అధ్యక్షుడు నరేందర్ బాత్రాకు పుత్రశోకం కల్గింది. బత్రా తనయుడు ధృవ్(27) అనారోగ్యంతో మృతి చెందాడు. గత నాలుగు రోజుల క్రితం మొరాకో వెళ్లిన ధృవ్ ఉదర సంబంధిత వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని శుక్రవారం భారత్ కు తరలించనున్నారు. ఈ సందర్భంగా నరేందర్ బాత్రాకు ఢిల్లీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రగాఢ సానుభూతిని తెలిపింది. 'యుక్త వయసులోని ధృవ్ కుటుంబానికి దూరం కావడం నిజంగా బాధాకరం. ఆ కుటుంబానికి తట్టుకునే శక్తిని దేవుడు ఇవ్వాలి' అని భారత క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు ఎస్పీ బన్సాల్ సంతాపం తెలిపారు. కాగా శుక్రవారం ధృవ్ అంత్యక్రియల కార్యక్రమానికి ఢిల్లీ క్రికెట్ సభ్యులు హాజరవుతారని డీడీసీఏ జాయింట్ సెక్రటరీ రవి జైన్ తెలిపారు.