నరీందర్‌ బత్రా పదవీకాలం పొడిగింపు | Narinder Batra to remain FIH President till May 2021 | Sakshi
Sakshi News home page

నరీందర్‌ బత్రా పదవీకాలం పొడిగింపు

Published Sun, May 10 2020 2:46 AM | Last Updated on Mon, May 11 2020 9:20 AM

Narinder Batra to remain FIH President till May 2021 - Sakshi

లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్‌ నరీందర్‌ బత్రా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. కరోనా కారణంగా న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 28న జరగాల్సిన ఎఫ్‌ఐహెచ్‌ వార్షిక సమావేశం వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు ఎఫ్‌ఐహెచ్‌ శనివారం ప్రకటించింది. ‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అధికారుల పదవులను కూడా మరో ఏడాది పాటు పొడిగిస్తున్నాం’ అని ఎఫ్‌ఐహెచ్‌ తన ప్రకటనలో వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సింది. బత్రా 2016 నవంబర్‌లో ఎఫ్‌ఐహెచ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా బత్రాకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)లో కూడా సభ్యత్వం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement