Presidency
-
గత వారం దేశం కోసం ఏం చేశారు?
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక దాదాపు అనధికార అధ్యక్షుడిగా చలామణి అవుతున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) విభాగం నుంచి వివాదాస్పద నిర్ణయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా వేర్వేరు ప్రభుత్వ విభాగాలైన ఫెడరల్ ఏజెన్సీల్లోని సిబ్బంది పనితీరును క్రోడీకరించే పేరుతో వారి ఉద్యోగాలకు కోత పెట్టే పనిని మొదలెట్టారు. ఈ మేరకు ఫెడరల్ ఏజెన్సీలోని ఉద్యోగులకు తాజాగా ఒక మెయిల్ వచ్చింది. అందులో ‘‘దయచేసి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ఈ–మెయిల్‌కు మీ స్పందన తెలియజేయండి. గత వారం మీరంతా విధినిర్వహణలో భాగంగా దేశం కోసం ఏమేం పనులు చేశారు?. ఒక ఐదు కీలకమైన అంశాలను విడివిడిగా కుప్లంగా పేర్కొంటూ ప్రతిస్పందన మెయిల్ పంపించండి. సోమవారం రాత్రి 11.59 గంటలకల్లా మెయిల్‌ను పంపించండి. మీరు గనక ఈ–మెయిల్ పంపించకపోతే మీరు ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణిస్తాం’’అని మెయిల్లో ఉంది. ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు గత వారం మొత్తంలో దేశం కోసం ఏమేం చేశారని సంజాయిషీ అడగడమేంటని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్(ఓపీఎం) విభాగం నుంచి వచ్చిన ఈ మెయిల్‌ను స్పందనగా మెయిల్‌ను పంపొద్దని తమ సిబ్బందికి అమెరికా జాతీయ వాతావరణ సేవల కేంద్రం తదితర ఏజెన్సీలు సూచించాయి. ‘‘ప్రజల కోసం పనిచేస్తున్న ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులను చట్టవ్యతిరేకంగా తొలగిస్తే ఊరుకోం. కోర్టుల్లో సవాల్ చేస్తాం. అసలు కనీసం ఒక్క గంట సమయం నిజాయతీగా ప్రజాసేవ చేయని, ఎన్నికల్లో పోటీచేయని ప్రపంచకుబేరుడు మస్క్‌తో ఉద్యోగులకు విధినిర్వహణపై హితబోధ చేయించడాన్ని మించిన అవమానం మరోటి లేదు’’అని అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఎవిరెట్ కెల్లీ అన్నారు. ఇప్పటికే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడమో లేదంటే కొన్ని నెలల జీతం ముందస్తుగా ఇచ్చి స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు లేఖలు రాయించుకోవడమే డోస్ చేసింది. మాజీ ఉద్యోగుల వ్యవహరాల విభాగం, రక్షణ, ఆరోగ్యం, మానవీయ సేవలు, అంతర్గత రెవిన్యూ సేవు, జాతీయవనాల విభాగం తదితర ఏజెన్సీల్లోని చాలా మంది తాత్కాలిక, శాశ్వత ఉద్యోగులపై వేటువేసిన సంగతి విదితమే. ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించడమే లక్ష్యంగా డోజ్ వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. -
బీజేపీకి కొత్త సారథి ఎవరో?
న్యూఢిల్లీ: అధికార బీజేపీ తదుపరి అధ్యక్షుడెవరనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం ప్రమాణం చేసిన ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్లో ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఉండటం తెల్సిందే. నడ్డాతోపాటు బీజేపీ సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో, తాజా ఎన్నికల్లో నెగ్గిన మాజీ మంత్రులు కొందరిని పార్టీ పదవుల్లోకి తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. వీరిలో అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందనే విషయం చర్చనీయాంశమైంది. బీజేపీ చీఫ్‌గా నడ్డా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈయన 2020లో అమిత్ షా నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మంత్రుల్లో నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. -
ట్రంప్‌పై మరో తీవ్రమైన అభియోగం
వాషింగ్టన్: రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి జార్జియా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించారని డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాలు నమోదుచేసింది. మరోసారి అధ్యక్షపీఠంపై కూర్చుకునేందుకు తహతహలాడుతున్న ట్రంప్‌పై అభియోగాలు నమోదవడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఫుల్టన్ కౌంటీ గ్రాండ్ జ్యూరీ సోమవారం తన 41–చార్జ్ అభియోగాల పత్రంలో సంబంధిత వివరాలను పొందుపరిచింది. ట్రంప్‌తోపాటు మరో 18 మందిపై అభియోగాలు నమోదయ్యాయి. ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా వచ్చేలా చేసేందుకు తోటి వ్యక్తులు కుట్ర పన్నారని జ్యూరీ పేర్కొంది. ఆగస్ట్ 25వ తేదీలోపు ఈ 19 మంది స్వచ్ఛందంగా సరెండర్ కావాలని ఫుల్టన్ కౌంటీ జిల్లా మహిళా అటార్నీ ఫ్యానీ విల్లీస్ సోమవారం ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ట్రంప్ మాజీ న్యాయవాది రూడీ గిలియానీ, శ్వేతసౌధం మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మిడోస్, అధ్యక్షభవనం మాజీ న్యాయవాది జాన్ ఈస్ట్‌మన్, న్యాయశాఖ మాజీ ఉన్నతాధికారి జెఫ్రీ క్లార్క్ ఉన్నారు. రాజకీయ దురుద్దేశం: ట్రంప్ ‘ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణ’ అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అభియోగాలను అధికార డెమొక్రటిక్ పార్టీ నేతలు సమర్థించారు. ‘ఎన్నికల ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ట్రంప్ పన్నిన కుట్రను ఈ అభియోగాలు బట్టబయలుచేస్తున్నాయి’ అని సెనేట్ మెజారిటీ లీడర్ షూమర్, హౌజ్ మైనారిటీ లీడర్ హకీమ్ అన్నారు. -
భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్‌లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్‌లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్‌కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్ కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్‌లో పర్యటిస్తున్నారు. -
India's G20 Presidency: భారత్‌కు అందివచ్చిన గొప్ప అవకాశం
ఈ డిసెంబర్ 1 నుంచి జీ20 దేశాల కూటమికి నాయకత్వం వహించే బాధ్యత భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ భుజ స్కంధాలపై పడింది. ప్రపంచం లోని 20 అగ్రదేశాల కూటమికి భారత్ నేతృత్వం వహించే అవకాశం లభించడం గౌరవమే కాదు.. ఓ గొప్ప అవకాశం కూడా! 1999లో జీ20 దేశాల కూటమి ఏర్పాటయింది. బలమైన ఆర్థిక వ్యవస్థల్ని అనుసంధానించి పరస్పర సహకారం, ప్రోత్సాహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది కూటమి ప్రధాన లక్ష్యం. జీ20 కూటమిలో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ భాగ స్వామిగా ఉంది. కూటమి ఏర్పడింది 1999లో అయినా తొలి శిఖరాగ్ర సదస్సు జరిగింది మాత్రం 2008లో వాషింగ్టన్ డీసీలో. ఆ సమయంలోనే చోటుచేసుకొన్న ‘ఆసియా ఆర్థిక సంక్షోభం’ నుంచి బయటపడడానికి జీ20 దేశాల కూటమి కృషి చేసింది. అప్పటి నుంచి అంత ర్జాతీయ స్థాయిలో శక్తిమంతమైన సంస్థలలో ఒకటిగా జీ20 అవతరించింది. 2016లో చైనాలో జరిగిన జీ20 కూటమి శిఖరాగ్ర సభలలో ‘సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ కోసం కృషి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జీ20 కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో కూడా వర్తక, వాణిజ్య సంబంధాలు ముమ్మరం అయ్యాయి. గత ఏడెనిమిది సంవత్సరాలలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ డంలో జీ20 కూటమి దేశాలతో భారత్ నెరపిన దౌత్య, వర్తక, వాణిజ్య సంబంధాలు కీలకంగా దోహదం చేశాయి. ఇటీవల, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడంలో అగ్రరాజ్యాలు విఫలం అయ్యాయి. రష్యాపై పలు ఆంక్షలు విధించినా భారత్ తన చమురు అవసరాల కోసం ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతూ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిణా మాల దృష్ట్యా జీ20 కూటమికి భారత్ నేతృత్వం వహిం చడంవల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్నలు అనివార్యంగా ఎదురవుతున్నాయి. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన 2022 జీ20 శిఖరాగ్ర సదస్సులో, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా వైదొలగాలన్న పిలుపును కొన్ని దేశాలు గట్టిగానే విన్పించాయి. అంతకుముందే రష్యా అధినేత పుతిన్‌కు ‘నేటి యుగం యుద్ధాలది కాదు’ అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి శషబిషలు లేకుండా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడంతో భారత్ తన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రష్యాతో సంబంధాలు నెరపుతున్నదే తప్ప, ఆ దేశం ప్రదర్శిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఏమాత్రం ఉపేక్షించడం లేదన్న సంకేతం బలంగానే వెళ్లింది. అంతేకాదు... అంతర్జాతీయ సదస్సులలో చేసిన తీర్మానాలకు కట్టుబడటంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవ హరిస్తోందన్న వాస్తవం కూడా తేటతెల్లం అయింది. ఉదాహరణకు క్యోటో ప్రోటోకాల్, పారిస్ కాప్ 21, అంతకుముందు రియో, కోపెన్ హెగన్ సదస్సులలో చేసిన తీర్మానాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంతో పర్యావరణ పరిరక్షణ, భూతాప నియంత్రణలలో 63 దేశాల పనితీరుపై వెలువడ్డ నివేదికలో భారత్‌కు 8వ స్థానం లభించగా... చైనాకు 51, అమెరికాకు 52వ స్థానాలు లభించాయి. భారతదేశం తను అనాదిగా నమ్మే ‘వసుధైక కుటుంబం’ (ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం) అనే భావనను ముందుకు తెచ్చి పరస్పర సహకారం, భాగస్వామ్యం అత్యంత అవశ్యం అని చాటి చెబుతోంది. కలిసికట్టుగా సమస్య లను ఎదుర్కోనట్లయితే... కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతుందనేది భారత్ చెప్పే మాట. కానీ, చైనా వంటి కొన్ని దేశాలు ‘నేను నా దేశం’ (గ్రూప్ జీరో) ముఖ్యం అనే ధోరణిలోనే సొంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే విధం గానూ, అంతిమంగా ప్రపంచ మానవాళికి ముప్పు కలి గించే విధంగానూ ముందుకు సాగుతున్నాయి. జీ20 కూటమికి నేతృత్వం వహించడం వల్ల భారత్‌కు సమీప భవిష్యత్తులో కొన్ని సానుకూలతలు అందివస్తాయి. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయించగలగడం లేదా తగ్గించగలగడం. అలాగే దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా నుంచి అక్రమ చొరబాట్లు, ఆక్రమణలను నివారించడం; హిందూ మహా సముద్రంలో చైనా సైనిక పాటవ వ్యాప్తిని తగ్గించగలగడం, ముడిచమురు చౌకగా లభించే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం. డిజిటల్ రంగంలో తను సాధించిన ప్రగతినీ, సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఇతర దేశాలకు అందించడం; ఆహార భద్రత, పోషకాహార పంపిణీలకు సంబంధించి పేద దేశాలకు బాసటగా నిలవడం... తదితర రంగాలలో భారత్ కీలకమైన పాత్ర పోషించబోతోంది. కోవిడ్ టీకాతో సహా వివిధ రకాల టీకాలను విస్తృతంగా అభివృద్ధి పరుస్తున్న భారత్ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్న దేశాల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో తాను సాధించిన ప్రగతిని ఆసియాలోని ఇతర దేశాలతోపాటు ఆఫ్రికా దేశా లతో పంచుకోవడంతో అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రతిష్ఠలు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ నివారణలో భారత్ పోషించిన పాత్ర, ఆ దేశానికి అందించిన ఆర్థిక సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలకు నోచుకొంది. సాధిస్తున్న అభివృద్ధికి సమాంతరంగా పాత, కొత్త సవాళ్లు ఉమ్మడిగా భారత్‌కు ఎదురవుతున్నాయి. ‘ఇది యుద్ధాల శకం’ కాదని నరేంద్ర మోదీ రష్యా–ఉక్రెయిన్ ల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని వాఖ్యానించినప్పటికీ... యుద్ధం అన్నది అనేక రూపాలలో భారత్‌ను అస్థిరపరుస్తూనే ఉంది. తూర్పున అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులలో చైనా దురాక్రమణ నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. కశ్మీర్ బోర్డర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం చేస్తున్న యుద్ధం ఆగలేదు. ఇంకా, కంటికి కనిపించని సైబర్‌వార్, ఇన్ఫ ర్మేషన్ వార్ వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి. వీటికితోడు వాతా వరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తులు, మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్న కొత్తకొత్త వైరస్ల విజృంభణ తదితర సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన మార్గదర్శనం చేయా ల్సిన అవసరం భారత్‌పై ఉంది. నూతన పదబంధాలను సృష్టించడంలో మన ప్రధాని నరేంద్ర మోదీని మించిన వారెవరున్నారు? ఆయన సృష్టిం చిన పదబంధమే ‘ఎకానమీ విజన్’. జీ20 కూటమి దేశాల మధ్య పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్య విధానమే ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఎకానమీ విజన్ విధానం. ‘నేను నా దేశం’ (గ్రౌండ్ జీరో) అనే విధానానికి పూర్తిగా విరుద్ధమైనదే ఇది. ప్రపంచం అంతా ఒకే భూమి. ప్రపంచ జనాభా అంతా ఒకటే కుటుంబం. ఒకప్పుడు దీనిని ‘యుటోపియన్ థియరీ’గా అభివర్ణించేవారు. ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే భారత ప్రాచీన ధర్మం ఇమిడి ఉన్న విధానాలతో నరేంద్ర మోదీ జీ20 దేశాల కూటమికి దిశానిర్దేశం చేయనున్నారు. శిలా జాల ఇంధనాల వాడకాన్ని నిరోధించి హరిత ఇంధనాలను పెద్దఎత్తున వినియోగంలోకి తీసుకురావడం, సూర్య రశ్మి (సోలార్ ఎనర్జీ)ని విరివిగా ఉపయోగించుకోవడం; పవన విద్యుత్ వినియోగం పెంచడం వంటి చర్యల ద్వారా పటిష్ట కార్యాచరణకు ప్రధాని సమాయత్తం అవుతున్నారు. నరేంద్ర మోదీ తన నాయకత్వ పటిమను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ఓ మహత్తర అవకాశం నేడు లభించింది. గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు ఏవిధంగానైతే వారి విశిష్ట నాయ కత్వానికి వివిధ సందర్భాలలో అంతర్జాతీయ ఖ్యాతి లభించిందో... అలాగే నేడు ప్రధాని నరేంద్ర మోదీకి మరింత ఖ్యాతి దక్కడానికి జీ20 దేశాల నాయకత్వం అందివచ్చిన ఓ చక్కటి అవకాశం. దానిని ఆయన ఫల ప్రదం చేసి దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తారని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఏపీ -
‘భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు సువర్ణావకాశం’
న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం రావటం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15కు ముందు సమావేశమయ్యామని, 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొన్న తర్వాత తొలిసారి భేటీ అవుతున్నామని గుర్తు చేశారు. ‘శీతాకాల సమావేశాల తొలి రోజు ఇది. మనం ఆగస్టు 15కు ముందు సమావేశమైనందున చాలా ముఖ్యమైనది. ఆగస్టు 15న 75వ స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహించుకున్నాం. జీ20 దేశాలకు నాయకత్వం వహించే అవకాశం వచ్చిన తరుణంలో సమావేశమవుతున్నాం. గ్లోబల్ కమ్యూనిటీలో భారతదేశం చోటు సంపాదించిన తీరు, భారత్‌తో అంచనాలు పెరిగిన తీరు, గ్లోబల్ ప్లాట్ఫామ్లో భారతదేశం తన భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్న విధానం ఎంతో గొప్పగా ఉంది. ఇలాంటి సమయంలో భారతదేశం G20 ప్రెసిడెన్సీని అందుకోవడం చాలా గొప్ప అవకాశం. జీ20 సమ్మిట్ అనేది దౌత్యపరమైన కార్యక్రమం కాదు. ప్రపంచం ముందు భారత సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు వచ్చిన సువర్ణావకాశం. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో దేశాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయ తీసుకునేందుకు కృషి చేయాలి. అన్ని పార్టీలు చర్చకు విలువ ఇస్తాయని విశ్వసిస్తున్నాను.’ అని పేర్కొన్నారు ప్రధాని మోదీ. ఇదీ చదవండి: లఖీంపూర్ కేసులో 13 మందిపై అభియోగాలు -
G20 Summit: నిర్ణయాత్మకంగా జీ20 ఎజెండా
న్యూఢిల్లీ/వాషింగ్టన్: ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్–20) అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం లాంఛనంగా చేపట్టింది. ఏడాది పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది. జీ–20 అధినేతగా భారతదేశ లక్ష్యాలను వివరిస్తూ ప్రధాని మోదీ తాజాగా పత్రికలు, వెబ్సైట్లో ఒక ఆర్టికల్(వ్యాసం) విడుదల చేశారు. పలు ట్వీట్లు చేశారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి వంటివి నేడు మానవళికి అతిపెద్ద సవాళ్లుగా మారాయని, అందరం కలిసికట్టుగా వాటిని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రపంచంలో కొన్ని దేశాల కంఠశోషను ఎవరూ వినిపించుకోవడం లేదని ఆక్షేపించారు. జీ–20 దేశాలతోపాటు.. నిర్లక్ష్యానికి గురైన దేశాలను కూడా కలుపుకొని ముందుకెళ్తామని, అందరితో చర్చించి, తమ జీ–20 ప్రాధాన్యతలను నిర్ణయించుకుంటామని వివరించారు. పాత ఆలోచనా ధోరణికి స్వస్తి ‘మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ’కు సంబంధించిన ఒక కొత్త నమూనా కోసం ప్రపంచ దేశాల ప్రజలంతా చేతులు కలిపి, ఉమ్మడిగా కృషి చేయాలని సూచించారు. ప్రపంచ దేశాల నడుమ ఆహారం, ఎరువులు, ఔషధ ఉత్పత్తుల సరఫరాను రాజకీయ కోణంలో చూడొద్దని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో మొత్తం మానవళికి మేలు కలిగేలా మన ఆలోచనా విధానం(మైండ్‌సైట్) మార్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. కొరతకు, సంఘర్షణలకు కారణమయ్యే పాత ఆలోచనా ధోరణికి స్వస్తి పలకాలని చెప్పారు. కలిసికట్టుగా ఉంటూ, సవాళ్లను ఎదిరించడానికి గాను మన ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి స్ఫూర్తిని పొందడానికి ఇదే సరైన సమయమని వివరించారు. మనకు యుద్ధం అక్కర్లేదు మొత్తం మానవ జాతికి కనీస అవసరాలను తీర్చగలిగే ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురాగల మార్గాలు ప్రపంచంలో ఉన్నాయని, మనుగడ కోసం ఒకరిపై ఒకరు పోరాటం చేయాల్సిన అవసరం లేదని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రస్తుతం మనకు యుద్ధం ఎంతమాత్రం అవసరం లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల భద్రమైన జీవితాల కోసం సామూహిక జనన హనన ఆయుధాల నిర్మూలన దిశగా శక్తివంతమైన దేశాల నడుమ చర్చలకు చొరవ చూపుతామని వెల్లడించారు. ప్రపంచ శాంతి, రక్షణ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామన్నారు. భారత్‌తో కలిసి నడుస్తాం: అమెరికా జీ–20 కూటమి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్‌కు మద్దతు ఇవ్వడానికి, కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఆహారం, ఇంధన భద్రత వంటి పెనుసవాళ్లను పరిష్కరించే విషయంలో భారత్‌తో కలిసి నడవాలని అమెరికా నిర్ణయించకున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కెరైన్ జీన్–పియర్రీ చెప్పారు. జీ–20 దేశాల అధినేత శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ 9, 10న ఇండియా రాజధాని ఢిల్లీలో జరుగనుంది. -
జర్మనీ అధ్యక్షునిగా మళ్లీ స్టెయిన్‌మెయర్
బెర్లిన్: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్‌మెయర్ (66) మరో ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై ఆయన్ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకుంది. అధికార పక్షంతో పాటు అత్యధిక విపక్షాలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ హయాంలో స్టెయిన్‌మెయర్ రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పని చేశారు. జర్మనీలో అధ్యక్ష పదవి లాంఛనప్రాయమైనది. -
భద్రతామండలి అధ్యక్ష హోదాలో భారత్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతామండలి అధ్యక్ష హోదా భారత్ దక్కింది. నేటి నుంచి నెల రోజులపాటు పాటు ఈ హోదాలో కొనసాగనుంది. ఈ సమయంలో సముద్రప్రాంత రక్షణ, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి ప్రధాన అంశాలపై జరిగే కీలక చర్చలకు నేతృత్వం వహించనుందని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టుతోపాటు వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ అవకాశం భారత్‌కు దక్కుతుంది. ఈ ఆగస్టులో భారత్.. సముద్ర ప్రాంత భద్రత, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అంశాలపై మండలిలో జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్ష వహించనుంది. ‘సముద్ర ప్రాంత రక్షణ భారత్‌కు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. దీనిపై మండలి సమగ్రమైన విధానాన్ని తీసుకురావడం చాలా ముఖ్యం’ అని తిరుమూర్తి పేర్కొన్నారు. ‘అదేవిధంగా, శాంతిపరిరక్షణ దళాలను పంపడంలో ఆదినుంచి భారత్ ముందుంంది. వివిధ దేశాలకు పంపే శాంతిపరిరక్షక దళాల భద్రతకు మెరుగైన సాంకేతికతను వినియోగించడం, దళాలపై దాడులకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టే విషయమై భారత్ దృష్టి సారిస్తుంది’ అని వివరించారు. -
నరీందర్ బత్రా పదవీకాలం పొడిగింపు
లుసానే: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) అధ్యక్ష పదవిలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) చీఫ్ నరీందర్ బత్రా మరో ఏడాది పాటు కొనసాగనున్నారు. కరోనా కారణంగా న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 28న జరగాల్సిన ఎఫ్ఐహెచ్ వార్షిక సమావేశం వచ్చే ఏడాది మే నెలకు వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసకున్నట్లు ఎఫ్ఐహెచ్ శనివారం ప్రకటించింది. ‘ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అధికారుల పదవులను కూడా మరో ఏడాది పాటు పొడిగిస్తున్నాం’ అని ఎఫ్ఐహెచ్ తన ప్రకటనలో వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఉన్న కార్యవర్గం పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్‌తో ముగియాల్సింది. బత్రా 2016 నవంబర్‌లో ఎఫ్ఐహెచ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా బత్రాకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లో కూడా సభ్యత్వం ఉంది. -
జైలు నుంచి జస్టిస్ కర్ణన్ విడుదల
కోల్‌కతా : కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ను బుధవారం జైలు నుంచి విడుదల అయ్యారు. ఆరు నెలల పాటు శిక్షను అనుభవించిన ఆయన కోల్‌కత్తాలోని ప్రెసిడెన్సీ జైలు నుంచి ఇవాళ విడుదలపై బయటకు వచ్చారు. కోర్టు ధిక్కార నేరం కేసులో కర్ణన్ ఈ ఏడాది జూన్ 20న కోయంబత్తూరులో పశ్చిమబెంగాల్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున సుప్రీంకోర్టు ఆయనకు శిక్ష విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. -
ట్రంప్ తెంపరితనం
కొత్తగా అధికార పీఠాన్ని అధిరోహించిన వారిపై ప్రజానీకంలో భ్రమలో, ఆశలో ఉంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలకూ, ప్రభుత్వాధినేతగా చేసే పనులకూ మధ్య పొంతన లేనిపక్షంలో వాటి స్థానంలో సందేహాలు బయల్దేరతాయి. అదే ధోరణి కొనసాగుతుంటే ఆ సందేహాలు బలపడి ప్రభుత్వ వ్యతిరేకతగా మారతాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఆ వ్యతిరేకత విస్తరిస్తుంది. పాలకులను నిలువునా ముంచేస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ తీరే వేరు. ఆయనను విజేతగా ప్రకటించిన నాటినుంచే దేశంలో నిరసనలు బయల్దేరాయి. అవి నానాటికీ విస్తరిస్తున్నాయి. ఆయన ప్రమాణ స్వీకా రోత్సవంలో పాల్గొన్నవారికన్నా ఆరోజు దేశంలో నిరసన ప్రదర్శనల్లో పాలుపంచుకున్నవారి సంఖ్యే అధికం. మహిళలు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు నిర్వహించారు. మరొకరైతే ఇవన్నీ గమనించి కాస్తయినా పునరాలోచనలో పడేవారేమో. తీరు మార్చుకునేవారేమో. ట్రంప్ మొండి ఘటం. ప్రమాణస్వీకారం చేయగానే అల్పాదాయ వర్గాలకు తక్కువ ప్రీమియంతో ప్రాణావసరమైన వైద్య చికిత్సలను అందిస్తున్న ‘ఒబామా కేర్’ను నిలుపుదల చేసే కార్యనిర్వాహక ఉత్తర్వులపై తొలి సంతకం చేసి తనది విధ్వంసక మార్గమేనని తేల్చిచెప్పారు. ఈ ఒక్క సంతకంతో కోటి 80 లక్షలమంది అమెరికా పౌరుల ఆరోగ్య బీమాను ఆయన అనిశ్చితిలో పడేశారు. ముందూ మునుపూ ఇది సెనేట్‌లో ఆమోదం పొందితే ‘ఒబామా కేర్’ శాశ్వ తంగా రద్దవుతుంది. శరణార్ధులకూ, వలసవచ్చినవారికి కూడా కష్టాలు మొదలయ్యాయి. సిరియా నుంచి వచ్చేవారిపై నిరవధిక నిషేధం విధించారు. శరణార్ధుల పునరావాస కార్య క్రమం రెండు నెలలు ఆపేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులకు మూడు నెలలపాటు వీసాల జారీని నిలిపేశారు. ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే దేశంలోని విమానాశ్రయాల్లో దిగినవారి తనిఖీలు మొదల య్యాయి. గ్రీన్‌కార్డులున్నా, వీసాలున్నా ఆ దేశాలకు చెందినవారికి నిర్బంధం తప్పలేదు. 18 నెలల పసిగుడ్డు మొదలుకొని 80 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ వరకూ అందరి కందరూ నానా ఇబ్బందులకూ లోనయ్యారు. వీసాలుంటే అడ్డుకోవద్దని అమెరికా జడ్జి ఆదేశాలిచ్చిన సమయానికే విమానాశ్రయాల్లో ప్రభుత్వ అరాచకం మొదలైపో యింది. విమానాశ్రయాల్లోనే కాదు.. అధ్యక్ష భవనంలో కూడా ఆ మాదిరి అరా చకం కొలువుదీరింది. తొలుత ఈ ఉత్తర్వులు గ్రీన్కార్డున్నవారికి వర్తించబోవని ఆంతరంగిక భద్రతా విభాగం ప్రతినిధి ప్రకటించారు. అనంతరం మరో ప్రతినిధి అలాంటివారిపైనా తనిఖీలుంటాయని చెప్పారు. ఇప్పటికే వందమందిని ఆపేశా మని ఇంకొక ప్రతినిధి వెల్లడించారు. దీనిపై అమెరికాలోని 30 నగరాలు నిరసన ప్రదర్శనలతో అట్టుడుకుతుండగా తన నిషేధంలోని ఆంతర్యం పర్యాటక ఆంక్షలే తప్ప ముస్లింలను ఉద్దేశించింది కాదంటూ ట్రంప్ గొంతు సవరించుకున్నారు. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్నట్టు ట్రంప్ ఇలా తొలి వారంలోనే నానా రకాల ఉత్తర్వులూ వెలువరించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధ్యక్షుడు కార్య నిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం అమెరికాలో రివాజు. కానీ ట్రంప్ వచ్చాక అదంతా అటకెక్కింది. తోచిందే తడవుగా అనాలోచిత ఉత్తర్వులు బయటికొస్తు న్నాయి. ఆ ఏడు దేశాల పౌరులకూ వీసాల జారీలో క్షుణ్ణంగా తనిఖీలుంటాయని ప్రకటిస్తే ఎవరూ అభ్యంతర పెట్టరు. అలాంటి హక్కు, అధికారం ప్రపంచంలో ఏ దేశానికైనా ఉంటుంది. కానీ గంపగుత్తగా నిలిపేస్తామంటే, నిషేధం విధిస్తామంటే చెల్లదు. అలా చేయడానికి ముందు దేశంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు ఆ దేశాల నుంచి వచ్చినవారు కారకులని ప్రభుత్వం నిరూపించాల్సి ఉంటుంది. చిత్రమే మంటే అమెరికాలో గత కొన్నేళ్లుగా నమోదైన ఉగ్రవాద కేసుల్లో ఈ దేశాల పౌరులు ఒక్కరూ లేరు. కేసులున్నవారిలో ఎక్కువమంది సౌదీ అరేబియాకు చెందినవారు కాగా ఆంక్షలున్న దేశాల జాబితాలో అది లేనేలేదు! ట్రంప్ కపటత్వానికి, అవగాహ నలేమికి ఇంతకన్నా నిదర్శనం ఏం ఉంటుంది? ఆయనకున్న ‘ఇస్లామ్ ఫోబియా’ ప్రపంచానికంతకూ తెలుసు. ఎన్నికల ప్రచార పర్వంలోనే దాన్ని అనేకానేకసార్లు బయటపెట్టుకున్నారు. ఇప్పుడు అధికారంలోకొచ్చాక అలాంటి అనాలోచిత, నిరా ధార భయాలన్నిటిపైనా కార్యాచరణ మొదలెట్టారు. భవిష్యత్తులో ట్రంప్‌లాంటి పాలకులు దాపురిస్తారని చాన్నాళ్లక్రితమే జార్జి ఆర్వెల్ (1984), ఆల్డస్ హక్స్లీ (బ్రేవ్ న్యూవరల్డ్), సింక్లెయిర్ లెవిస్ (ఇట్ కాంట్ హ్యాపెన్ హియర్) వంటి కాల్పనిక రచయితలు కొందరు ఊహించారు. మేధావి నోమ్ చోమ్స్కీ అయితే అయిదు దశాబ్దాలుగా తన రచనల ద్వారా, ప్రసంగాల ద్వారా హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇది మేడిపండు ప్రజాస్వామ్యమని చెబుతూ వచ్చారు. పరాయి దేశాల్లో పరమ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాలను కూల్చే... ప్రజాదరణ గల అధినేతలను హతమార్చే అమెరికన్ పాలకులు ఏదో ఒకరోజున ఇక్కడ కూడా అలాంటి నిరంకుశ ధోరణులనే ప్రతిష్టిస్తారని చెప్పారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ట్రంప్ రూపంలో అదంతా వాస్తవ రూపం దాల్చినట్టు కనబడుతోంది. ఈ దుస్థితికి ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన రిపబ్లికన్ పార్టీ మాత్రమే కాదు... దాని ప్రత్యర్థి పక్షం డెమొక్రటిక్ పార్టీ బాధ్యత కూడా ఉంది. అలాంటి ధోరణులకు ఉద్దేశపూర్వకంగానో, ఉదాసీనం గానో ఆ రెండు పార్టీలూ కారణమయ్యాయి. ఇప్పుడు తమ దేశానికేర్పడిన ముప్పుపై అమెరికా పౌరులు రోడ్లపైకి వచ్చారు. ఇలాంటి పోకడలను తాము సహించబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, గూగుల్ వంటి సాఫ్ట్వేర్ దిగ్గజాల అధిపతులు సైతం అభ్యంతరం చెబుతున్నారు. వీటన్నిటి పర్యవసానంగా ట్రంప్ మానసిక స్థితి మెరుగుపడవచ్చునని ఎవరైనా భావిస్తే అది దురాశే. కనీసం ఆయన్ను అందలం ఎక్కించిన రిపబ్లికన్లకైనా జ్ఞానోదయం అవుతుందో, లేదో చెప్పలేం. నిరంతర జాగురూకత కొరవడితే ఏమవుతుందో అందరూ తెలుసు కోవడానికి మాత్రం ఇది పనికొస్తుంది. -
ఆ ఏడు దేశాల్లో ట్రంప్ గుబులు!
అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపడుతుండటం.. నిన్నటివరకూ ప్రత్యర్థిగా ఉన్న రష్యా వంటి కొన్ని దేశాలకు సంతోషాన్నిస్తోంటే.. అమెరికాతో కలిసి నాటో రక్షణ కూటమిలో ఉన్న పలు బాల్టిక్ దేశాలను కలవరపాటుకు గురిచేస్తోంది. పొరుగు దేశమైన మెక్సికో, ఆర్థిక భాగస్వామి జపాన్‌వంటి దేశాలూ ఆందోళన చెందుతున్నాయి. మెక్సికో: ఎన్నికల ప్రచారం నుంచే మెక్సికో మీద ట్రంప్గురిపెట్టారు. వలసలను నిరోధించేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టేస్తానని, దానికయ్యే ఖర్చునూ ఆ దేశం నుంచి వసూలు చేస్తానని, అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న కొన్ని లక్షల మంది మెక్సికన్లను తిప్పి పంపించేస్తానని ట్రంప్ పదే పదే ఉద్ఘాటించడం ఇందుకు ప్రధాన కారణం. అంతేకాదు.. మెక్సికో చేసే ఎగుమతుల్లో 80 శాతం వాటా అమెరికాదే. దీంతో ట్రంప్ ప్రభావం దేశంపై ఎలా ఉంటుందన్నఆందోళన మెక్సికోలో నెలకొంది. జపాన్: చైనాపై ట్రంప్ ప్రకటిస్తున్న వ్యతిరేక వైఖరి.. చైనాకు సమీపంలో ఉన్న తనను ఇరుకున పెడుతుందన్న ఆందోళన జపాన్‌లో నెలకొంది. అమెరికా, చైనా రెండు దేశాలతోనూ జపాన్‌కు కీలకమైన ఆర్థిక సంబంధాలున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడును ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించే పక్షంలో.. ఈ రెండు ఆర్థిక శక్తుల పోరులో తాను చిక్కుకుపోయే పరిస్థితి వస్తుందని కలవరపడుతోంది. జర్మనీ: యూరప్‌లో అతి ముఖ్యమైన దేశమైన జర్మనీని కూడా ట్రంప్ కలవరపాటుకు గురిచేస్తున్నారు. వాస్తవానికి ఉక్రెయిన్‌లో జోక్యం చేసుకున్నందుకు రష్యా మీద యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించేలా యూరప్ దేశాలను ప్రభావితం చేసింది జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్. ఇప్పుడు రష్యాతో ట్రంప్ సహితం.. యూరప్ జర్మనీ ప్రాబల్యాన్ని తగ్గించడంతో పాటు, మెర్కెల్ వ్యతిరేకులను బలోపేతం చేస్తుందన్న ఆందోళన ఆ దేశంలో కనిపిస్తోంది. ఫ్రాన్స్: అమెరికాలో ట్రంప్ గెలుపు ఫ్రాన్స్‌లో రాజకీయ ఆందోళనకు దారితీసింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ కూడా మితవాద నేషనల్ ప్రంట్ గెలిచే అవకాశం ఉందన్నది ఆ ఆందోళన. ఆ పార్టీ నేత మరైన్లె పెన్కు ట్రంప్ బాహాటంగా మద్దతు ప్రకటిస్తే.. ఆమె గెలుపు అవకాశాలు ఊపందుకుంటాయని ప్రత్యర్థులు కలవరపడుతున్నారు. లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియా: బాల్టిక్ దేశాలైన ఈ మూడు దేశాలకూ ఇప్పుడు ఆందోళన తీవ్రమైంది. రష్యా జాతీయుల ప్రయోజనం పేరుతో ఉక్రెయిన్ సంక్షోభంలో జోక్యం చేసుకున్న రష్యా.. రష్యా జాతీయులు గణనీయంగా ఉన్న తమ దేశాల్లో కూడా రేపు వేలు పెడుతుందన్న కలవరం లాత్వియా, ఎస్టోనియా, లిథువేనియాలది. సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా సారథ్యంలో గల నాటో సైనిక కూటమిలో ఉన్నందున ఇంతకాలం కాస్త ధైర్యంగా ఉన్నాయి. ఇప్పుడు రష్యాతో స్నేహం పెంపొందించుకోవాలని ఒకవైపు, నాటో కూటమికి కాలం చెల్లిందని మరొకవైపు వ్యాఖ్యానిస్తున్న ట్రంప్ తీరు ఈ దేశాల్లో గుబులు రేకెత్తిస్తోంది. దీంతో రష్యా సరిహద్దు వెంట గోడలు కట్టేయాలని లాత్వియా, ఎస్టోనియాలు, కనీసం కంచె అన్నా వేయాలని లిథువేనియా యోచిస్తున్నాయి. ఇండియాలో అయోమయం! భారత్ అమెరికాల మధ్య సంబంధాలు గత రెండు దశాబ్దాలుగా బలపడుతూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్వల్ల ఈ సంబంధాలు ఇంకా బలపడతాయా? భారత్‌కు లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుందా? అన్న డైలమా భారత్ నెలకొంది. ముఖ్యంగా.. హెచ్1బి వీసా నిబంధనలు కఠినతరం చేసే ప్రయత్నాలు భారత ఐటీ నిపుణులు, సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్న ఆందోళన చాలా కాలంగా పెరుగుతోంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో చూస్తే.. చైనా విషయంలో కఠినంగా మాట్లాడుతున్న ట్రంప్, తొలుత పాకిస్తాన్ విషయంలోనూ అదే స్వరం వినిపించారు. ఆ దేశానికి అందిస్తున్న సాయాన్ని పనితీరు ఆధారంగా సమీక్షించి కోత వేయాలని ఉద్ఘాటించారు. దీంతో.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని కట్టడి చేసేందుకు ట్రంప్ సాయపడగలరన్న ఆశలు భారత్‌లో కలిగాయి. కానీ.. ట్రంప్ ఇటీవల పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీష్‌తో మాట్లాడటం అందుకు విరుద్ధమైన సంకేతాలనిచ్చింది. పాక్ విషయంలో ట్రంప్ కూడా పాత బాటనే పయనిస్తారా లేదా తాను అన్నట్లుగా సమీక్షిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. అలాగే.. ఐక్యరాజ్యసమితిలో, భద్రతామండలిలో సమూల సంస్కరణల అమలును డిమాండ్ చేస్తున్న భారతదేశానికి.. అమెరికా రాష్ట్రం దక్షిణ కరొలినా గవర్నర్, భారత సంతతి మహిళ నిక్కీ హేలీని ఐరాసలో అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించడం కాస్త ఊరటనిస్తున్న అంశం. సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చెరగని సంతకం
-
చేయాల్సింది ఎంతో ఉంది
రాష్ట్రపతి భవన్‌పై ప్రణబ్ న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో ఇంకా తాను చేయాల్సింది ఎంతో ఉందని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. రాష్ట్రపతిగా ఆయన మూడేళ్ల పదవీకాలాన్ని శనివారంతో పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎస్టేట్లోపల ‘ఆయుష్ వెల్నెస్ సెంటర్’ను ప్రణబ్ శనివారం ప్రారంభించారు. ప్రజలకవసరమైన ప్రాథమిక అంశాల విషయంలో ఏదో ఒకటి చేయాలన్నది తన ఆలోచనగా పేర్కొన్నారు. అందుకే రాష్ట్రపతి ఎస్టేట్‌లో స్వచ్ఛ భారత్, భేటీ బచాబో, భేటీ పడావో వంటి ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలని భావించినట్టు తెలిపారు. ‘నామినేషన్ పత్రాలు(రాష్ట్రపతి పదవికోసం) దాఖలు చేసేటప్పుడు ఓ సహచరుడు మాట్లాడుతూ సుదీర్ఘకాలంపాటు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగిన నేను అక్కడ(రాష్ట్రపతి భవన్లో) ఏం చేయగలనని అన్నారు. క్రియాశీలకమైన జీవితం నుంచి నిస్సారమైన జీవితంతో కూడిన ప్రదేశంలోకి అడుగుపెడుతున్నారని నన్ను ఉద్దేశించి అన్నారు. కానీ ఆయన చెప్పిన రీతిలో పరిస్థితి లేదని నేను తెలుసుకున్నా. ఇక్కడ ఎంతో చేయవచ్చు. ఇక్కడ(రాష్ట్రపతి ఎస్టేట్) ఏడువేల మంది, వారి కుటుంబాలు ఉంటున్నాయి. వారికోసం ఎన్నో వసతులు ఏర్పాటు చేయాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. అందువల్లే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వెనువెంటనే దానిని రాష్ట్రపతి భవన్లో అమలు చేయాలని నిర్ణయించానని తెలిపారు. ప్రణబ్‌కు మోదీ అభినందనలు.. రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రణబ్ ముఖర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ప్రణబ్ అపార అనుభవం, తెలివితేటలు దేశానికి ఎంతో లబ్ధి చేకూర్చాయని ట్విట్టర్లో ఆయన ప్రశంసలు కురిపించారు. -
... ఆ పదవికి నేనూ అర్హుడినే
రాష్ట్ర ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అధ్యక్ష స్థానాన్ని చేపట్టడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయని రాష్ట్ర ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ పేర్కొన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. పార్టీ హై కమాండ్ ఆదేశిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి కేపీసీసీ అధ్యక్ష పదవిని చేపడతానన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన లింగాయత్ వర్గం వారికి కేపీసీసీ పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. ఈ నేపథ్యంలోనే తనతోపాటు అప్పాజీ నాడగౌడ, ఎం.బీ పాటిల్, ప్రకాశ్ హుక్కేరి తదితర పేర్లు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో కర్ణాటకకు కేటాయించిన ఐఐటీ స్థాపనకు అన్ని జిల్లాల నుంచి డిమాండ్ ఉందన్నారు. అయితే ఐఐటీ స్థాపనకు కనిష్టంగా 400 ఎకరాలు అవసరమవుతాయని తెలిపారు. అందువల్ల అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయమై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐటీ రంగంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మాత్రమే కర్ణాటకకు పోటీ అన్నారు. పొరుగు రాష్ట్రాలు ఈ విషయంలో కర్ణాటక దరిదాపుల్లో కూడా లేవని తెలిపారు. అందువల్ల కర్ణాటక నుంచి ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెలుతున్నాయన్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్లో బాగల్‌కోటే జిల్లాకు మాత్రమే నూతన ఐటీ పార్కు కేటాయించే అవకాశం ఉందన్నారు. బెంగళూరు తప్ప రాష్ట్రంలో మిగిలిన ఏ ప్రాంతంలోనైనా కంపెనీ స్థాపించడానికి ముందుకు వచ్చే ఔత్సాహిక పెట్టుబడుదారులకు ఉచితంగా భూమిని మంజూరు చేయనున్నామన్నారు. రానున్న ఐదేళ్లలో కర్ణాటక నుంచి ఐటీ ఉత్పత్తుల ఎగుమతులను నాలుగులక్షల కోట్ల రుపాయలకు చేర్చే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.1.80 లక్షల కోట్లుగా ఉందని మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు.