న్యూఢిల్లీ: అధికార బీజేపీ తదుపరి అధ్యక్షుడెవరనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం ప్రమాణం చేసిన ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్‌లో ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఉండటం తెల్సిందే. నడ్డాతోపాటు బీజేపీ సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు.
దీంతో, తాజా ఎన్నికల్లో నెగ్గిన మాజీ మంత్రులు కొందరిని పార్టీ పదవుల్లోకి తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. వీరిలో అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందనే విషయం చర్చనీయాంశమైంది. బీజేపీ చీఫ్‌గా నడ్డా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈయన 2020లో అమిత్ షా నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మంత్రుల్లో నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment