President position
-
బీజేపీకి కొత్త సారథి ఎవరో?
న్యూఢిల్లీ: అధికార బీజేపీ తదుపరి అధ్యక్షుడెవరనేది హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం ప్రమాణం చేసిన ప్రధాని మోదీ సారథ్యంలోని కేబినెట్లో ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా ఉండటం తెల్సిందే. నడ్డాతోపాటు బీజేపీ సీనియర్ నేతలు భూపేందర్ యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, ధర్మేంద్ర ప్రధాన్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో, తాజా ఎన్నికల్లో నెగ్గిన మాజీ మంత్రులు కొందరిని పార్టీ పదవుల్లోకి తీసుకోవచ్చనే చర్చ జరుగుతోంది. వీరిలో అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందనే విషయం చర్చనీయాంశమైంది. బీజేపీ చీఫ్‌గా నడ్డా పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈయన 2020లో అమిత్ షా నుంచి పార్టీ పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మంత్రుల్లో నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. -
Presidential Polls: ఎన్నిక పద్ధతి, అధికార విధులు ఇవే!
భారత రాజ్యాంగం 5వ భాగంలో 52 నుంచి 78 వరకు ఉన్న ప్రకరణలు కేంద్ర కార్యనిర్వాహక శాఖకు సంబంధించిన విషయాలను తెలుపుతాయి. కేంద్ర కార్య నిర్వాహకశాఖలో.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్‌లు సభ్యులుగా ఉంటారు. దీనికి అధిపతి రాష్ట్రపతి. ప్రకరణ 52 ప్రకారం– భారత దేశానికి రాష్ట్రపతి ఉంటారు. ప్రకరణ 53 ప్రకారం– కేంద్ర కార్య నిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతికి దక్కుతాయి. ఈ అధికారాలను రాష్ట్రపతి స్వయంగా కానీ, తన కింది అధికారుల సహాయంతోగాని నిర్వర్తిస్తారు. కింది అధికారులు అంటే.. మంత్రి మండలిగా పరిగణించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారతదేశంలో బ్రిటిష్ తరహా పార్లమెంటు ప్రభుత్వాన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ఏర్పాటు చేశారు. రాజ్యాంగపరంగా అన్ని అధికారాలు రాష్ట్రపతికి, సంక్రమించినప్పటికీ, వాటిని చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉన్న మంత్రిమండలి మాత్రమే. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ► ప్రకరణ 324 ప్రకారం–కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి రాజ్యాంగంలో సమగ్రమైన వివరణ లేదు. అందుకోసం 1952లో పార్లమెంటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించింది. 1974లో రాష్ట్రపతి ఎన్నిక నియమావళిని రూపొందించారు. రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడడానికి ముందు 60 రోజులు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ►రాష్ట్రపతి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రొటేషన్ పద్ధతిలో లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు.15వ రాష్ట్రపతి (రామనాథ్ కోవింద్) ఎన్నికలో రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వ్యవహరించారు. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోడీ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ప్రకరణ 54 ప్రకారం– రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి ఒక ప్రత్యేక ఎన్నికల గణం ఉంటుంది(ఎలక్టోరల్ కాలేజ్). ఇందులో పార్లమెంటుకు ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర విధానసభకు ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్ఛేరి శాసనసభ సభ్యులు కూడా పాల్గొంటారు. ఢిల్లీ, పుదుచ్ఛేరి సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా పొందుపరిచారు. ఇది 1995 జూ¯Œ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. జమ్మూ, కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని కూడా చేర్చాలంటే.. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ►ప్రకరణ 55(3)లో రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని ప్రక్రియను పేర్కొన్నారు. నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఒక ఓటు బదలాయింపు పద్ధతి(రహస్య ఓటు) ద్వారా ఎన్నికవుతారు. అయితే ఈ పద్ధతిని రాజ్యాంగ పరిషత్‌లో అంబేడ్కర్, జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించారు. ఈ పద్ధతిని అమెరికాకు చెందిన థామస్ హేర్ అనే రాజనీతి శాస్త్రవేత్త ఆవిష్కరించారు. ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లయిన ఎమ్మెల్యే, ఎంపీల ఓటు విలువలను ఒక ప్రత్యేక సూత్రం ద్వారా లెక్కిస్తారు. ఎమ్మెల్యే ఓటు విలువ = (రాష్ట్రం మొత్తం జనాభా/ఎన్నికైన విధానసభ సభ్యుల సంఖ్య)(1/1000) ►లోక్‌సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543 ►రాజ్యాసభలో మొత్తం సభ్యుల సంఖ్య 233 ►1971లో సేకరించిన జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు. జనాభా నియంత్రణ సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు ఓటు విలువలో నష్టపోకుండా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని అమలులోకి తెచ్చారు. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని 2026వరకు పొడిగించారు. ►ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఓటు విలువ 159, తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132గా ఉంది. అత్యధిక ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: ఉత్తర ప్రదేశ్–208, తమిళనాడు–176, జార్ఖండ్–176, మహారాష్ట్ర–175, బీహార్–173. ►అలాగే అతి తక్కువ ఓటు విలువ కలిగిన రాష్ట్రాలు: సిక్కిం–7, మిజోరాం–8, అరుణాచల్‌ప్రదేశ్–8, నాగాలాండ్–9. ఎంపీల ఓటు విలువను గణించే పద్ధతి ఎంపీల ఓటు విలువ = మొత్తం రాష్ట్రాల శాసన సభ్యుల ఓటు విలువ/ఎన్నికైన పార్లమెంటు సభ్యుల సంఖ్య ►ఎంపీల ఓటు విలువ దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. n 2022లో 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 700. n రాష్ట్రపతి ఎన్నిక కావడానికి అభ్యర్ధికి కోటా ఓట్లు రావాలి. కోటా అంటే.. మొత్తం పోలై చెల్లిన ఓట్లలో సగం కంటె ఎక్కువ. రాష్ట్రపతి ఎన్నిక–రెండు ప్రధాన సూత్రాలు 1. ఏకరూపతా సూత్రం (Principle of Uniformity, Equality) 2. సామ్యతా సూత్రం (Principle of Uniformity, Equality) మొదటి సూత్రం ప్రకారం–రాష్ట్ర విధానసభ్యుని ఓటు విలువ ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి ఓటు విలువ మారుతుంది. రెండో సూత్రం ప్రకారం– దేశంలోని ఎంపీల ఓటు విలువ ఒకే విధంగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా తేడాలుండవు. ఉదాహరణకు దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 4033 (జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీ రద్దయి, కేంద్రపాలిత ప్రాంతంగా మార్చినందున జమ్మూ–కశ్మీర్‌కు చెందిన 87 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలో పాల్గొనరు.) ►దేశంలోని మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ –5,43,231 ►దేశంలోని మొత్తం ఎన్నికైన ఎంపీల సంఖ్య–776 ► దేశంలోని మొత్తం ఎంపీల ఓటు విలువ –5,43,200 ►మొత్తం ఎమ్మెల్యేల + ఎంపీల ఓటు విలువ = 10,86,431 ► నియోజక గణంలో మొత్తం ఓటర్ల సంఖ్య = 4033 + 776 = 4809 అంటే మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ, మొత్తం ఎంపీల ఓటు విలువతో దాదాపు సమానం. దీనినే ప్రిన్సిçపల్ ఆఫ్ పారిటీ అంటారు. రాష్ట్రాలకు, కేంద్రానికి రాష్ట్రపతి ఎన్నికలో సమాన ప్రాతినిధ్యం కల్పించడమే ఈ సూత్రాలను పాటించడానికి కారణం. అందుకే భారత రాష్ట్రపతి యావత్ జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. రాష్ట్రపతి – అర్హతలు ►ప్రకరణ 58లో రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలను పేర్కొన్నారు. ►భారతదేశ పౌరుడై ఉండాలి (సహజ లేదా సహజీకృత పౌరసత్వం) ►35 సంవత్సరాలు నిండి ఉండాలి. లాభదాయక ప్రభుత్వ పదవుల్లో ఉండరాదు. ►శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి. ►నేరారోపణ రుజువై ఉండరాదు. దివాళా తీసి ఉండరాదు. ► లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావల్సిన ఇతర అర్హతలు ఉండాలి. ►పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు కలిగి ఉండాలి. ► రాష్ట్రపతి అర్హతలకు సంబంధించి చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కనీస విద్యార్హత అనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు. ►లాభాదాయక పదవులు(Office of Profit) అనే పదానికి రాజ్యాంగంలో నిర్వచనం లేదు. 1959 లో పార్లమెంట్ సభ్యుల అనర్హతలు,నియంత్రణ చట్టం రూపొందించి ఈ పదానికి నిర్వచనం తెలిపి.. కొన్ని పదవులను లాభాదాయక పదవులను మినహాయించింది. వీటికి కాలానుగుణంగా మార్పులు, చేర్పులు చేస్తారు. లాభదాయక పదవుల్లో ఉండరాదు అనే అర్హతకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులు, ఎంఎల్ఏ, ఎంíపీలకు జీతభత్యాలుంటాయి. వారు ఆ పదవులలో కొనసాగుతూనే మరొక పదవికి కూడా పోటీ చేయవచ్చు. పోటీ చేయడానికి ముందే రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. అయితే, వారు రాష్ట్రపతిగా ఎన్నికైతే వారి సభలో సభ్యత్వాన్ని కోల్పోతారు. షరతులు ►రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థి కొన్ని షరతులను పూర్తి చేయాల్సి ఉంటుంది. 1952లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టాన్ని రూపొందించారు. 1997లో దీనిని సవరించారు. ఈ సవరణ ప్రకారం ఈ కింది షరతులు నిర్దేశించారు. ► అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకగణ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపరచాలి. ►ఒక సభ్యుడు, ఒక అభ్యర్ధిని మాత్రమే ప్రతిపాదించాలి లేదా సమర్ధించాలి. ►అభ్యర్ధి నామినేషన్ పత్రంతోపాటు రూ.15,000లు ధరావత్తుగా రిజర్వు బ్యాంకులో లేదా ప్రభుత్వ ట్రెజరీలో డిపాజిట్ చేయాలి. రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు ►మనోహర హోల్కర్ (1967) ►మహారాణి గురుచరణ్ కౌర్ (1969) ► లక్ష్మీ సెహగల్ (2002) ► ప్రతిభా పాటిల్ (2007) ►మీరా కుమార్ (2017) ►1967లో రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధికంగా 17 మంది పోటీ చేశారు. ►అతి పెద్ద వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–కె.ఆర్.నారాయణన్ . ►అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి అయిన వారు–నీలం సంజీవరెడ్డి ►ముఖ్యమంత్రులుగా పనిచేసి రాష్ట్రపతులు అయినవారు– నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ. ►అత్యధిక రాష్ట్రపతులను అందించిన రాష్ట్రం–తమిళనాడు (సర్వేపల్లి రాధాక్రిష్ణన్ , ఆర్.వెంకట్రామన్ , ఎ.పి.జె అబ్దుల్ కలామ్) ►స్వతంత్ర అభ్యర్థి, ట్రేడ్ యూనియన్ ఉద్యమ నేపథ్యంతో రాష్ట్రపతి అయినవారు– వి.వి.గిరి ► రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన వారు–ఎ.పి.జె.అబ్దుల్ కలామ్. ►రాష్ట్రపతిగా వ్యవహరించిన ఏకైక సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి– యం.హిదయతుల్లా 16వ రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ ►నోటిఫికేషన్ విడుదల: జూన్ 15, 2022 ►నామినేషన్ దాఖలుకు చివరి తేదీ:జూన్ 29, 2022 ► ఉపసంహరణ తేదీ: జూలై 2, 2022 ►ఎన్నిక తేదీ: జూలై 18, 2022 ► ఓట్ల లెక్కింపు: జూలై 21, 2022 ►రిటర్నింగ్ అధికారి: ప్రమోద్ చంద్ర మోడీ (రాజ్యసభ సెక్రటరీ జనరల్) ►ఆంధ్రప్రదేశ్‌లో సహాయ రిటర్నింగ్ అధికారి: రాజ్‌కుమార్ (ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శి) ►తెలంగాణాలో సహాయ రిటర్నింగ్ అధికారి: ఉపేందర్ రెడ్డి (తెలంగాణ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి –బి.కృష్ణారెడ్డి, సబ్జెక్ట్ నిపుణులు -
శరద్ పవార్‌కు దేశ అత్యున్నత పదవి కోసం పీకే లాబీయింగ్..?
ముంబై: ఎన్సీపీ అధినేత, మరాఠా యోధుడు శరద్ పవార్‌ను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రయత్నాలు చేస్తున్నారా..? భారత దేశపు అత్యున్నత పదవి కోసం పీకే లాబీయింగ్ ప్రారంభించారా..? గత కొద్ది రోజులుగా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో స్వయానా ఎన్సీపీ అధినేతనే ఈ విషయంపై స్పందించారు. తనను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడానికి పీకే లాబీయింగ్ చేస్తున్నారన్న వార్తలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇవన్నీ అసత్యపు ప్రచారాలని, అసలు అలాంటి ప్రస్తావనే లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రస్తావన ఉత్పన్నం కాదని కుండబద్దలు కొట్టారు. ఏ ప్రాతిపదికన తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుకు తేవాలని పీకే అనుకున్నారో తనకు తెలియదని, తమ భేటీ సందర్భంగా రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకే రాలేదని వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల అంశం కూడా తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. కాగా, గత నెలలో(జూన్) పీకే, శరద్ పవార్లు రెండుసార్లు భేటీ అయ్యారు. చివరిసారిగా వారు జూన్ 11న ముంబైలో సమావేశమయ్యారు. ఈ భేటీ మూడు గంటలకుపైగా కొనసాగింది. మరోవైపు పీకే నిన్న(జులై 13, మంగళవారం) కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీ, అతని సోదరి ప్రియాంక గాంధీలను ఢిల్లీలోని రాహుల్ నివాసంలో కలిశారు. -
ప్రధాని మారినా వీడని చిక్కుముళ్లు
ఒకవైపు తీవ్రమైన హింసాత్మక ఘర్షణలు, మరోవైపున కాల్పుల విరమణ నేపథ్యంలో ఇజ్రాయెల్ నూతన ప్రధానిగా నఫ్టాలి బెన్నెట్ ఎంపిక ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, దాని మిత్రదేశాలు తీసుకొచ్చిన రెండు దేశాల పరిష్కారం ప్రతిపాదన సఫలం కావడానికి ఎన్నో చిక్కుముళ్లు అడ్డుపడుతున్నాయి. ఒకరి ఉనికిని మరొకరు గుర్తించడానికి ఇష్టపడని వాతావరణంలో సామరస్యపూర్వకంగా ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యను పరిష్కరించడం బైడెన్ యంత్రాంగానికి చాలా కష్టమైన పనే. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత సమతుల్యతతో వ్యవహరించాల్సి ఉంది. దాదాపు 11 రోజుల హింసాత్మక ఘర్షణల తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ మధ్య కాల్పుల విరమణ జరిగిన నెలరోజుల లోపు ఇజ్రాయెల్ నూతన ప్రధానమంత్రిగా నప్టాలి బెన్నెట్ ఎంపిక ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాల్పుల విరమణ కోసం చర్చలకు ప్రోత్సహించిన అమెరికా దాని మిత్రదేశాలు ‘రెండు దేశాల పరిష్కారం’ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చాయి. పర్యవసానంగా ఈ అంశంపై ఈజిప్ట్, జోర్డాన్, ఇజ్రాయెల్ నేతలతో మరింతగా చర్చించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన తరపున విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ని పంపించారు. ఈ అంశంపై ఇజ్రాయెల్ నూతన ప్రధాని బెన్నెట్ కూడా కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో, ప్రతిపాదించిన పరిష్కారం వైపు ముందుకు నడవడం బైడెన్ యంత్రాంగానికి ఏమంత సులువైన పని కాదు. ఈ విషయంలో అనేక సంక్లిష్టతలు ఏర్పడి ఉన్నాయి. ఒకటి, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల ఏర్పాటు కోసం 1947 నవంబర్ 29న ఐక్యరాజ్య సమితి చేపట్టిన ప్లాన్ తీర్మానం 181 (ఐఐ) ప్రకారం, రెండు దేశాలమధ్య పరస్పరం విభజించుకున్న భూఖండాలను కలిగి ఉన్నాయి. అంటే ఇలా తమతమ భూఖండాలను దాటడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని దీని అర్థం. ఈ రెండు దేశాలు ఎంత మంచి సంబంధాలు కలిగి ఉంటున్నాయన్నదాన్ని బట్టి ఇలాంటి ఏర్పాట్లు విజయవంతమవుతుంటాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించకపోతే మళ్లీ ఘర్షణ ఏర్పడుతుందన్నది స్పష్టమవుతుంది. రెండు, పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్ఓ), ఇజ్రాయెల్ మధ్య 1993లో కుదిరిన ఓస్లో ఒడంబడిక ఈ రెండు దేశాల ఉనికిని లాంఛనప్రాయంగా గుర్తించింది, పాలస్తీనా అథారిటీ స్థాపనకు మార్గం కల్పించింది. జెరూసలేం పాలనాధికార సంస్థకు సంబంధిం చిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కానీ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలూ జెరూసలేంని తమ రాజధానిగా ప్రకటించడమే కాకుండా ఆ నగరంతో ప్రత్యేకించి అక్కడి పవిత్ర స్థలాలపై చారిత్రక అనుబంధం తమకే ఉందని చెప్పుకున్నాయి. జెరూసలేంని తన నియంత్రణలో ఉంచాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం 181 ప్రతిపాదించినప్పటికీ పాలస్తీనా, ఇజ్రాయెల్ నేతలు ఇద్దరూ తిరస్కరించారు. 1949లో నాటి ఇజ్రాయెల్ ప్రధాని బెన్ గురియన్ మరికాస్త ముందుకెళ్లి పశ్చిమ జెరూసలేం ఇజ్రాయెల్‌లో అంతర్భాగం అని ప్రకటించేశారు. జెరూసలేంని రెండు దేశాల ఉమ్మడి రాజధానిగా వ్యవహరించాలని అంతర్జాతీయ సమాజం ప్రతిపాదించినప్పటికీ ఇజ్రాయెల్ దానికి అంగీకరించలేదు. మూడు, దాదాపు 45 కిలోమీటర్ల వరకు భౌతికంగా వేరుపడి ఉన్న గాజా, వెస్ట్ బ్యాంక్ వంటి పాలస్తీనా భూభాగాలు కూడా రెండు ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల నియంత్రణలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ మితవాద రాజకీయ పార్టీ ఫతాహ్ అదుపులో ఉంది. రాడికల్ ఉగ్రవాద సంస్థ హమాస్ గాజాను అదుపులో పెట్టుకుని ఉంది. పాలస్తీనా అథారిటీకి నేతృత్వం వహిస్తున్న మితవాద పార్టీలు ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిస్తుండగా, హమాస్ దాన్ని వ్యతిరేకించి ఇజ్రాయెల్‌తోపాటు ఇంతవరకు ఉన్న భూభాగాలన్నీ గ్రేటర్ పాలస్తీనాలో భాగమని ప్రకటిస్తూ ఆ లక్ష్య సాధనకోసం పోరాడుతోంది. హమాస్ 1988 చార్టర్ ఇజ్రాయెల్‌తో సహా మొత్తం పాలస్తీనాను వక్ఫ్ లాండ్ (తరతరాల ముస్లింలకు ధర్మనిధి) ప్రకటించింది. కాబట్టి దాని విభజనను హమాస్ ఒప్పుకోవడం లేదు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న శాంతి, రాజీ ప్రయత్నాలు హమాస్ కఠిన వైఖరి కారణంగా పలుచబడిపోయాయి. ఇప్పుడు రెండు దేశాల పరిష్కారాన్ని ఆమోదించవలసి వచ్చినప్పుడు హమాస్ నిజమైన ఉద్దేశాలు ఏమై ఉంటాయనేది ఇప్పటికైతే తెలీటం లేదు. నాలుగు, మరో సంక్లిష్టమైన సమస్య ఏమిటంటే వలసలు, శరణార్థులకు సంబంధించినది. వెస్ట్ బ్యాంక్, జెరూసలేంలలో ఇజ్రాయెల్ నిర్మించిన ఆవాస ప్రాంతాల్లో 5 లక్షలమంది కంటే ఎక్కువమంది యూదులు నివసిస్తున్నారు. అదే సమయంలో 50 లక్షలమంది పాలస్తీనీయులు తమ మాతృభూమికి దూరమై ఇరుగుపొరుగు దేశాల్లోని ఐక్యరాజ్యసమితి శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారు. వీరిని తిరిగి వారి స్వస్థలాలకు తరలించడం, లేదా వారికి కొత్త ప్రదేశాల్లో ఆశ్రయం చూపించడం ద్వారా హేతుపూర్వకమైన పరిష్కారం కనుగొనడం చాలా కష్టమైన పని. పైగా ఈ క్రమంలో భారీ స్థాయి హింస ప్రజ్వరిల్లే అవకాశం కూడా ఉంది. అరబ్ సంఘీభావం.. అతిపెద్ద అభాస క్షేత్రస్థాయిలో ఈ సంక్లిష్టతలు ఉన్న నేపథ్యంలో రెండు దేశాల పరిష్కారం ప్రతిపాదనను ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రత్యేకించి హమాస్ ఆమోదించేలా ఒప్పించడం అతి పెద్ద సవాలు అవుతుంది. 1967 నాటి సరిహద్దుల ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పర్చడాన్ని హమాస్ 2017 డాక్యుమెంట్ ఆమోదిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఉనికిని గుర్తిం చకుండా, జెరూసలేం రాజధానిగా, అందరు శరణార్థులను తమ తమ స్వస్థలాలకు అంటే ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చే నిబంధన కింద పాలస్తీనా వాసులందరినీ విముక్తి చేయడం అనే తన చిరకాల లక్ష్యాన్ని హమాస్ ప్రకటించడం గమనార్హం. మరోవైపున ఇజ్రాయెల్ ప్రధానిగా నూతనంగా ఎంపికైన నఫ్టాలి బెన్నెట్ ఈ రెండు దేశాల పరి ష్కారం అనే భావాన్నే తిరస్కరిస్తున్నారు. ఇరుపక్షాలు అవలంబిస్తున్న ఈ తరహా వైఖరి మరింత ప్రతిష్టంభననే తీసుకొస్తుంది. రెండు దేశాల పరిష్కారాన్ని ముందుకు తీసుకొచ్చి సమస్యను పరిష్కరించడానికి జరిగే ఏ ప్రయత్నానికైనా విస్తృతస్థాయి ప్రాతినిధ్యం, సంప్రదింపులు అవసరం అవుతాయి. అంతర్జాతీయ సమాజం ఈ భావాన్ని బలపరుస్తున్నప్పటికీ, దీనికి కీలకమైన మద్దతు పొరుగునే ఉన్న అరబ్ కమ్యూనిటీ నుంచి రావాల్సి ఉంది. ఇది ఇప్పుడు రాజకీయంగా, మతపరంగా వేరుపడి ఉంది. ఇరాన్, టర్కీ నుంచి గణనీయంగా హమాస్ మద్దతు పొందుతోంది. హమాస్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సౌదీ అరేబియా నాయకత్వాన్ని ఇరాన్, టర్కీలు సవాలు చేస్తున్నాయి. హమాస్‌కి ఇప్పటికీ బలమైన ఆర్థిక, సైనిక మద్దతు ఇరాన్ నుంచి వస్తోంది. దీంతో హమాస్ సంస్థతో ప్రత్యక్ష సంబంధాలు లేని అమెరికా దానితో చర్చించడానికి ప్రధానంగా జోర్డాన్, ఈజిప్టు దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సంక్లిష్ట వైరుధ్యాల గుండా ముందుకెళ్లి సామరస్యపూర్వకంగా ఇజ్రాయెల్–పాలస్తీనా సమస్యను పరిష్కరించడం బైడెన్ యంత్రాం గానికి చాలా కష్టమైన పనే. పరిష్కారం కుదరకపోతే.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ తాత్కాలికమైనదిగా మాత్రమే కనిపిస్తుంది. 2008, 2012, 2014 సంవత్సరాల్లో కుదిరిన కాల్పుల విరమణలు తాత్కాలిక శాంతిని మాత్రమే కొనితెచ్చినట్లుగా ఈ ప్రాంతం మళ్లీ విస్తృత స్థాయి హింసాత్కక ఘర్షణలకు తావిస్తుందని భావించాల్సి ఉంటుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న భారత్ ప్రస్తుత పరిస్థితుల్లో సమతుల్యంగా వ్యవహరించాల్సి ఉంది. తలపడుతున్న రెండు వర్గాలకు మద్దతు ప్రకటిస్తూనే జాగ్రత్తగా అడుగు వేయాలి. ఇజ్రాయెల్ పూర్వ ప్రధాని నెతన్యాహూతో సమానస్థాయి సంబంధాలను ప్రధాని మోదీ కలిగి ఉండనప్పటికీ, కొత్త ప్రభుత్వంతో వ్యవహరించేటప్పుడు ఇజ్రాయెల్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్మరించకూడదు. అదేసమయంలో పాలస్తీనీయుల పట్ల భారత్ సానుభూతిని కూడా తోసిపుచ్చలేం. ఎందుకంటే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ముస్లింల మద్దతును పాలస్తీనా ఉద్వేగభరితమైన మద్దతును పొందుతోంది మరి. డా. గద్దే ఓంప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సిక్కిం, మొబైల్:79089 33741 -
ఈ మూడూ ప్రశ్నించుకుని ముందుకు కదలండి
అబ్దుల్ కలాం విద్యార్థులచేత చేయించిన రెండో ప్రతిజ్ఞ – సమగ్రతతో పనిచేసి సమగ్రతతో విజయాన్ని సాధిస్తాను–అని. ఆయన మాట వెనుక గంభీరమైన ఉద్దేశం ఏమిటంటే... నేను ఈ పని చేస్తే మా అమ్మగారు సంతోషిస్తారా ? నేను ఈ పని చేస్తే వృద్ధిలోకి వస్తానా? నేను ఈ పని చేస్తే నేనొక్కడినే కాకుండా నా చుట్టూ ఉన్న సమాజం సంతోషిస్తుందా? అని నిష్పక్షపాతంగా మీరు వేసుకునే ప్రశ్నలకు ఔననేదే సమాధానం అయితే మీరు నిరభ్యంతరంగా ముందడుగు వేయాలని మీకు స్పష్టత ఇవ్వడం. మీ సంకల్పం ఎంత పవిత్రమయితే మీ వెంట నడిచే వాళ్ళ సంఖ్య అంత బలంగా ఉంటుంది. దానికి మీరు ప్రయత్న పూర్వకంగా ఎవరినీ కూడగట్టుకోనక్కరలేదు. స్వార్థంతో ఉన్నవాళ్ళు కూడా దాన్ని వదిలి మీతో కలిసి అడుగులేస్తారు. అన్నివేళలా మీ అధికారబలం చూసో లేక మీ స్థాయి చూసో మీ వెంట రారు, మంచి బుద్ది, మంచిసంకల్పం ఉంటే మీ వెనుక అశేషంగా జనం తరలి వస్తారు. దానికి ఒక ఉదాహరణ... అబ్దుల్ కలాం నిర్వహించినది భారత రాష్ట్రపతి పదవి. తరువాత ఆయన మరేపదవీ అధిష్టించలేదు. దానికి ముందు ఆయన ఒక శాస్త్రవేత్త. జీవిత పర్యంతం ఆయన శాస్త్రవేత్తే. అంతే. ఆయన శరీరం విడిచి పెట్టేసిన రోజున ఆశ్చర్యం.. చిన్నచిన్నపిల్లలు దీపాలు చేతిలో పెట్టుకుని కాగితాలమీద అబ్దుల్ కలాంగురించిన కొన్ని మాటలేవో రాసుకుని, దీనవదనాలతో నడిచి వెళ్ళారు. యావద్భారతం, ప్రపంచం అంతా ఒక మహాపురుషుడు వెళ్ళిపోయాడని చెప్పి ఎంత బాధపడిందో...!! దానికి కారణం... జీవితకాలంలో ఆయన సంకల్పాలు, ఆయన నడవడిక.. పదిమంది మంచికోరి ఆయన పడిన తపన, దేశంలోని విద్యార్థులందరి అభ్యున్నతి కోరి ఆయన పడిన ఆవేదన. అందుకే ఆయన శరీరం విడిచిపెట్టినా కీర్తి శరీరంతో నిలబడ్డాడు. ఒక మనిషి జీవితంలో ఉండాల్సిన లక్షణం అది.దేనివల్ల మీరు ప్రేరణ పొందుతున్నారన్న విషయంలో మీకు స్పష్టత, ఒక అవగాహన ఉండాలి. అది లేకపోతే చేయకూడని పనివైపుకి, చేయకూడని ఆలోచన వైపుకి మీ మనసు మళ్ళిందనుకోండి. అక్కరలేని వ్యసనాలకు మనిషి అలవాటుపడతాడు. జీవితాలు భ్రష్టత్వం పడతాయి. మీరు చేసే పని ఇతరులను బాధపెట్టేది కాకూడదు. అది జీవితంలో అలవాటయిందా అంతకన్నా మంచిపని మరొకటి ఉండదు. అలాకాక ఇతరులు బాధపడినా, ఏడ్చినా, నాశనమయిపోయినా నా కేమీ సంబంధంలేదు, నేను ఒక్కడినీ సంతోషపడితే చాలు, నా మనసులో కోరిక తీరితే చాలు..అన్న సంకల్పం మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది. నేనెంత కష్టపడినా ఫరవాలేదు, పదిమంది సంతోషిస్తారు, కష్టపడడం అంటే తప్పుమార్గంలోకాదు, సంకల్పం పవిత్రమై, చాలామందికి మేలు కలుగుతుందంటే తప్పకుండా మీరు కష్టపడి అటువంటి పనిచేయండి. దీపం తాను హరించుకుపోతూ వెలుగును వెదజల్లినట్లుగా మహాత్ములయిన వాళ్ళందరూ వాళ్ళ జీవితకాలంలో పదిమంది సుఖం ఆశించి నానా బాధలు పడినవారే. బతికున్నంతకాలం కేవలం తన గురించే కాకుండా తన చుట్టూ ఉన్న వారి గురించి కూడా ఆలోచించిన వాడెవడో అటువంటి వాడిని సమాజం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుని ఆయన చెప్పిన మాటలు స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడిచి వెడుతుంది. ఆయన శరీరంలో ఉన్నాడా లేడా అన్న దానితో సంబంధంలేదు. ఆయన కీర్తి శరీరుడౌతాడు. సమగ్రత అన్నది మనిషికి ప్రాణంతో సమానం. అంత జాగ్రత్తగా ప్రవర్తించాలి. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హుడు: గడ్కారీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అద్వానీకి రాష్ట్రపతి పదవి చేపట్టే అర్హత ఉందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. అందరూ గౌరవించే అద్వానీ స్థాయికి అదే తగిన పదవి అని ఆయన చెప్పారు. ఇండియా టీవీ చానల్ నిర్వహించే ఆప్ కి అదాలత్ కార్యక్రమంలో మంత్రి ఈ అభిప్రాయాలను వెల్లడించారు. ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీకి స్పీకర్ పదవి తగినది కాదన్నారు. ఇక 75 ఏళ్లు దాటిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం అనేది.. ప్రధాని మోడీ విజ్ఞతతో తీసుకున్న నిర్ణయమన్నారు. దానివల్లే అద్వానీ, జోషీ లాంటి సీనియర్లలకు కేబినెట్లో చోటు దక్కలేదన్నారు. ప్రస్తుత తరంలో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ లాంటి పరిస్థితే తమ పార్టీలోని సీనియర్లదని.. మరో పదేళ్లలో తాను కూడా కొత్తవారికి చోటిస్తూ పదవులనుంచి తప్పుకుంటానని గడ్కారీ చెప్పారు.