
రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హుడు: గడ్కారీ
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అద్వానీకి రాష్ట్రపతి పదవి చేపట్టే అర్హత ఉందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అద్వానీకి రాష్ట్రపతి పదవి చేపట్టే అర్హత ఉందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ అభిప్రాయపడ్డారు. అందరూ గౌరవించే అద్వానీ స్థాయికి అదే తగిన పదవి అని ఆయన చెప్పారు. ఇండియా టీవీ చానల్ నిర్వహించే ఆప్ కి అదాలత్ కార్యక్రమంలో మంత్రి ఈ అభిప్రాయాలను వెల్లడించారు. ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీకి స్పీకర్ పదవి తగినది కాదన్నారు.
ఇక 75 ఏళ్లు దాటిన నేతలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం అనేది.. ప్రధాని మోడీ విజ్ఞతతో తీసుకున్న నిర్ణయమన్నారు. దానివల్లే అద్వానీ, జోషీ లాంటి సీనియర్లలకు కేబినెట్‌లో చోటు దక్కలేదన్నారు. ప్రస్తుత తరంలో బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ లాంటి పరిస్థితే తమ పార్టీలోని సీనియర్లదని.. మరో పదేళ్లలో తాను కూడా కొత్తవారికి చోటిస్తూ పదవులనుంచి తప్పుకుంటానని గడ్కారీ చెప్పారు.