సాక్షి, ముంబై : భారతీయ జనతాపార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. వీరిలో నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి జాతీయ బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, బీడ్ లోకసభ నియోజకవర్గం నుంచి సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండేలున్నారు. అదే విధంగా సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇచ్చారు. ఇటీవలే ఎన్సీపీ నుంచి బీజేపీలో ప్రవేశించిన సంజయ్‌కాకా పాటిల్‌కు సాంగ్లీ లోకసభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది.
ఉత్తర ముంబై నుంచి మాజీ పెట్రోలియం శాఖ మంత్రి రామ్‌నాయిక్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఆయన స్థానంలో బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ శెట్టికి అవకాశం ఇచ్చారు. దూలే సిట్టింగ్ ఎంపీ ప్రతాప్‌రావ్ సోనావణే అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అతడి స్థానంలో డాక్టర్ సుభాష్ భామరేకు టిక్కెట్ ఇవ్వనున్నారు. మరోవైపు ఎన్సీపీ నుంచి బీజేపీలో చేరిన డి.బి.పాటిల్‌ను నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపనున్నట్టు ప్రకటించింది.
మొదటి జాబితాలో అభ్యర్థుల వివరాలు...
నాగపూర్ : నితిన్ గడ్కరీ
బీడ్ : గోపీనాథ్‌ముండే
ఈశాన్య ముంబై: కిరీట్ సోమయ్య
ఉత్తర ముంబై : గోపాల్ శెట్టి
జాల్నా: రావ్‌సాహెబ్ దానవే
రావేర్: హరిభావు జావలే
జల్‌గావ్ : ఎ టి నానా పాటిల్
చంద్రాపూర్ : హంస్‌రాజ్ అహీర్
భండారా-గోండియా: నానా పటోలే
గడ్‌చిరోలి : అశోక్ నేతే
అహ్మద్‌నగర్ : దిలీప్ గాంధీ
ధులే: డాక్టర్‌సుభాష్ భామరే
నాందేడ్ : డి. బి. పాటిల్
దిండోరి: హరిచంద్ర చవాన్
పాల్ఘర్ : చింతామణి వనగా
సాంగ్లీ: సంజయ్‌కాకా పాటిల్
అకోలా: సంజయ్ ధోత్రే
బీజేపీ తొలిజాబితా విడుదల
Published Fri, Feb 28 2014 11:01 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement