బీజేపీ జిల్లా అధ్యక్షుడు మిస్సింగ్
సాక్షి, యూపీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కీలక నేత మిస్సింగ్ కేసు ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. బరేలీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర సింగ్ రాథోడ్ గత మూడు రోజులుగా కనిపించకుండాపోయారు.
మంగళవారం రాథోడ్ మధురకు బయలుదేరారు. అయితే అప్పటి నుంచే ఆయన ఆచూకీ లభించకుండా పోయింది. కుటుంబ సభ్యులతోపాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆయన కోసం వెతకటం ప్రారంభించారు. అయినా లాభం లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించారు.
ప్రత్యేక బృందాలు ఆయన ఆచూకీ కోసం రంగంలోకి దిగినా లాభం లేకపోయింది. రాథోడ్ గాలింపు కోసం మరిన్ని బృందాలను నియమించినట్లు అధికారులు చెబుతున్నారు.