రజనీకాంత్‌కు ఓపెన్‌ ఇన్విటేషన్‌! | Nitin Gadkari Open Invitation to Rajinikanth | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌కు ఓపెన్‌ ఇన్విటేషన్‌!

Published Mon, May 22 2017 10:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రజనీకాంత్‌కు ఓపెన్‌ ఇన్విటేషన్‌! - Sakshi

రజనీకాంత్‌కు ఓపెన్‌ ఇన్విటేషన్‌!

న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమంటూ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బలమైన సంకేతాలు ఇవ్వడంతో ఆయనకు గాలం వేసేందుకు బీజేపీ ఎంతమాత్రం వెనుకాడటం లేదు. కమలం గూటికి రారమ్మని రజనీని బీజేపీ నేతలు ముక్తకంఠంతో ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రజనీ కోసం బీజేపీ తలుపులు తెరిచే ఉన్నాయని అమిత్‌ షా పేర్కొనగా.. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ సైతం లాంఛనంగా రజనీని పార్టీలోకి ఆహ్వానించారు.  బీజేపీలో ఆయనకు సముచిత స్థానం కట్టబెడతామని ఆశ చూపారు.

‘రాజకీయాల్లోకి రజనీకి స్వాగతం. బీజేపీ గురించి ఆలోచించాల్సిందిగా ఆయనను నేను కోరుతున్నా. బీజేపీలో ఆయనకు సముచిత స్థానాన్ని ఇస్తాం’ అని ఆయన ఓ చానెల్‌తో పేర్కొన్నారు. సముచిత స్థానం అంటే తమిళనాడు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రజనీకాంత్‌ను ప్రకటిస్తారా? అని ప్రశ్నించగా.. అది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement