
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళ సినీ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయం కాషాయరంగు పులుముకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో రజనీ పలుమార్లు సమావేశమై ఈ అంశంపై చర్చించారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. రజనీ ఇప్పటికే గడ్కారీ తదితర కేంద్రమంత్రులతో, ముఖ్యనేతలతో సమావేశమైనట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై పదవీకాలం త్వరలో ముగియనుంది. త్వరలో రజనీకాంత్‌ను పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షునిగా చేయడం ద్వారా పార్లమెంటు ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెలుపొందాలని బీజేపీ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment