రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హులు | Advani deserves to be President of India, says Nitin Gadkari | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హులు

Published Sat, Jun 21 2014 5:55 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హులు - Sakshi

రాష్ట్రపతి పదవికి అద్వానీ అర్హులు

న్యూఢిల్లీ: బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ రాష్ట్రపతి పదవికి అర్హులని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అద్వానీ స్థాయికి ఆ పదవే సరైనదని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఉప ప్రధానిగా పనిచేసిన అద్వానీని లోక్సభ స్పీకర్ను చేయడం సముచితం కాదని గడ్కరీ అన్నారు.

అద్వానీ అంటే బీజేపీలో అందరికీ గౌరవమని, ఆయన స్థాయికి తగిన పదవిని అలంకరించాలని కోరుకుంటున్నామని గడ్కరీ వ్యాఖ్యానించారు. అద్వానీ, మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వంటి వారికి కేబినెట్లో చోటు కల్పించడం కష్టమని, అందుకే ప్రధాని నరేంద్ర మోడీ 75 ఏళ్ల పైబడిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోరాదని నిర్ణయించారని తెలిపారు. సీనియర్ నేతలు అద్వానీ, జోషీలను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో పోల్చారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవిని జోషీ ఆశిస్తున్నారన్న వార్తలను గడ్కరీ కొట్టిపారేశారు. జోషీ తెలివితేటలు, అనుభవాన్ని పార్టీ సద్వినియోగం చేసుకుంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement