న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్‌లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్‌లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్‌కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం.
డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్
కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్‌లో పర్యటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment