
కోల్‌కతా : కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ను బుధవారం జైలు నుంచి విడుదల అయ్యారు. ఆరు నెలల పాటు శిక్షను అనుభవించిన ఆయన కోల్‌కత్తాలోని ప్రెసిడెన్సీ జైలు నుంచి ఇవాళ విడుదలపై బయటకు వచ్చారు. కోర్టు ధిక్కార నేరం కేసులో కర్ణన్ ఈ ఏడాది జూన్ 20న కోయంబత్తూరులో పశ్చిమబెంగాల్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున సుప్రీంకోర్టు ఆయనకు శిక్ష విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది.