justice karnan
-
దళితులు ప్రశ్నించడమే నేరమా?
సాక్షి, హైదరాబాద్: దళితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నాయ ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యం కల్పించిన హక్కులను పొందకుండా చేస్తున్నాయ ని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణతోనే దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీజేయూ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ‘ఉమ్మడి రిజర్వేషన్ల విధానం విఫలమైంది. దళితుల్లో అభివృద్ధి చెందిన కులాలే రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నాయి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. అందులో భాగంగా ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేశారు. అదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోమంటే కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరిస్తోంది. నిలదీసే వ్యక్తిని అక్రమంగా జైల్లో పెడుతోంది. నన్ను ఒకే నెలలో రెండుసార్లు అరెస్టు చేశారు. నేను చేసిన నేరమేంటో ప్రభుత్వం చెప్పాలి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని కావడంతోనే జైల్లో పెట్టారు.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘మిలియన్ మార్చ్’ జరిగిన సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కోదండరాంలపై పదుల సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ ఒక్కరినీ జైల్లో పెట్టలేదని మంద కృష్ణ అన్నారు. కానీ తాను దళితుడు కావడంతో నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారన్నారు. ‘సుప్రీం కొలీజియం తీరును జస్టిస్ కర్ణన్ తప్పుబడితే ఆయనను జైల్లో పెట్టాలని ఓ జడ్జి తీర్పునిచ్చారు. కానీ అదే కొలీజియం తప్పులు చేస్తోందని, పక్షపాతంగా వ్యవహరిస్తోందని సుప్రీం జడ్జీలు గొంతెత్తి మీడియా ముందుకొచ్చారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వారితో సంప్రదింపులు చేస్తోంది. ఒక దళితుడు ప్రశ్నిస్తే నేరం... అగ్రవర్ణాలు, సంపన్నులు ప్రశ్నిస్తే సంప్రదింపులు చేస్తారా’ అంటూ మండిపడ్డారు. దళితులపై అణచివేతకు ఇంతకంటే పెద్ద ఉదంతం అవసరం లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, పరుష పదజాలం వాడితే కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా అరెస్టు చేయాలని నిర్ణయించడం దారుణమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ చేస్తామని బీజేపీ చెప్పిందని.., మరి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఇంకా వందరోజులు కాలేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక బృందాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. వర్గీకరణపై సోమవారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
జైలు నుంచి జస్టిస్ కర్ణన్ విడుదల
కోల్‌కతా : కోర్టు ధిక్కార నేరంపై అరెస్టయిన కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ను బుధవారం జైలు నుంచి విడుదల అయ్యారు. ఆరు నెలల పాటు శిక్షను అనుభవించిన ఆయన కోల్‌కత్తాలోని ప్రెసిడెన్సీ జైలు నుంచి ఇవాళ విడుదలపై బయటకు వచ్చారు. కోర్టు ధిక్కార నేరం కేసులో కర్ణన్ ఈ ఏడాది జూన్ 20న కోయంబత్తూరులో పశ్చిమబెంగాల్ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున సుప్రీంకోర్టు ఆయనకు శిక్ష విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. -
కొత్త రాష్ట్రపతికి జస్టిస్ కర్ణన్ వినతి
కోల్‌కతా(పశ్చిమబెంగాల్): తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ నూతన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు విజ్ఞప్తి చేశారు. తన ప్రతినిధి మాధ్యూస్ జె.నెడుంపర ద్వారా ఆయన కోవింద్‌కు అభ్యర్థన పంపారు. రాజ్యాంగంలోని 72 అధికరణ ప్రకారం.. రాష్ట్రపతికి వినతి అందజేసినట్లు ఆ ప్రతినిధి తెలిపారు. ఆయన త్వరలోనే దానిని పరిశీలిస్తారని ఆశిస్తున్నామన్నారు. దీనిపై రాష్ట్రపతి కార్యాలయంతో టచ్‌లో ఉంటామన్నారు. కోర్టు ధిక్కరణ నేరం కింద మే 9వ తేదీన జడ్జి కర్ణన్‌కు ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ ఆరు నెలల జైలు శిక్ష విధించగా జూన్ 20వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌లో ఉన్నారు. భారత న్యాయవ్యవస్థలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జైలు శిక్ష అనుభవిస్తున్న మొట్టమొదటి జడ్జి కర్ణనే కావటం గమనార్హం. -
హిమాచల్ సీఎం, జస్టిస్ కర్ణన్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్‌కు మరోసారి న్యాయస్థానంలో చుక్కెదురు అయింది. మనీ లాండరింగ్ కేసును కొట్టేయాలన్న ఆయన అభ్యర్థనను ఢిల్లీ కోర్టు సోమవారం తిరస్కరించింది. కాగా మనీ లాండరింగ్ కేసులో వీరభద్రసింగ్తో పాటు ఆయన కుటుంబంపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. యూపీఏ–2 ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా వీరభద్రసింగ్ పనిచేశారు. ఆ సమయంలో 2009 నుంచి 2011 మధ్య ఆయన, కుటుంబ సభ్యులు కలిసి రూ.10 కోట్ల దాకా అక్రమాస్తులు కూడబెట్టారని సీబీఐ 2015 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేసింది. జస్టిస్ కర్ణన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ మరోవైపు కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. కోర్టు ధిక్కర నేరానికిగానూ విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. కాగా కర్ణన్‌కు సుప్రీంకోర్టు ఆరు నెలలు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన అదేరోజు చెన్నైకు చేరుకున్న కర్ణన్ ఆ తర్వాత అరెస్టు, జైలు శిక్షను తప్పించుకునేందుకు కనిపించకుండాపోయారు. దీంతో కర్ణన్ అరెస్టు కోసం కోల్‌కతా పోలీసులు తమిళనాడులో గాలింపు తీవ్రం చేశారు. ఎట్టకేలకు గతనెలలో అరెస్ట్ చేశారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 11న కోల్‌కతా హైకోర్టుకు బదిలీఅయ్యారు. -
కోయంబత్తూరులో జస్టిస్ కర్ణన్ అరెస్ట్
-
కోయంబత్తూరులో జస్టిస్ కర్ణన్ అరెస్ట్
కోయంబత్తూరు : గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న జస్టిస్ సీఎస్ కర్ణన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. మంగళవారం ఆయనను తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్ట్ చేసినట్లు కర్ణన్ తరఫు లాయర్లు వెల్లడించారు. కర్ణన్‌ను పోలీసులు కోల్‌కతా తరలిస్తున్నారు. కాగా అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తిగా ఇప్పటికే పేరుపొందిన ఆయన.. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం సెలవుకాల ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు. కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్ తరఫు న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా జస్టిస్ కర్ణన్ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కు పశ్చిమ బెంగాల్ డీజీపీ గత సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. -
కర్ణన్‌తో పాటు మరికొందరు
వివాదాలకు కేంద్రంగా పలువురు న్యాయమూర్తుల వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారతదేశ న్యాయవ్యవస్థలో జస్టిస్ కర్ణన్ ఒక వివాదాస్పద అధ్యాయం.. జైలు శిక్ష ఎదుర్కొన్న తొలి న్యాయమూర్తిగా, అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో నిలిచిపోయారు. కర్ణనే కాకుండాగతంలోనూ పలువురు న్యాయమూర్తులు తమ తీర్పుల సందర్భంగా వివాదా స్పద వ్యాఖ్యలు చేసిన ఘటనలున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే.. రాజస్తాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న మహేశ్ చంద్ర శర్మ పదవీ విరమణకు ముందు ఈ ఏడాది మే 31న ఒక తీర్పు సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నెమలి బ్రహ్మచారి కావడం వల్లే జాతీయపక్షిగా ప్రకటించారని, ఆవు కూడా అంతే పవిత్రమని అందువల్ల జాతీయ జంతువుగా చేయాలని కోరారు. ‘మగ నెమలి బ్రహ్మచారిగా ఉంటుంది. ఆడ నెమలితో శృంగారం జరపదు. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారా ఆడ నెమలి గర్భం దాలుస్తుంద’న్న వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. జస్టిస్ జ్ఞాన సుధా మిశ్రా: న్యాయమూర్తుల ఆస్తుల ప్రకటన సందర్భంగా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ సుధా మిశ్రా సుప్రీం వెబ్సైట్లో ఆస్తుల వివరాలు పేర్కొంటూ.. వివాహం కాని తన కుమార్తెల్ని అప్పుగా ప్రస్తావించారు. జస్టిస్ భక్తవత్సల: 2012లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో వేధింపులకు పాల్పడుతున్న భర్త నుంచి విడాకులు కోరిన మహిళతో.. ‘పెళ్లి చేసుకుని అందరూ మహిళలు బాధలుపడుతున్నారు. నీకు పెళ్లై ఇద్దరు పిల్లలున్నారు.. అంటే మహిళగా నీవు ఇబ్బంది పడుతున్నావని అర్థం. నీ భర్త మంచి వ్యాపారం చేస్తున్నాడు. అతను నీ బాగోగులు చూస్తాడు. అలాంటప్పుడు అతను కొడుతున్నాడనే విషయం గురించే ఎందుకు మాట్లాడుతున్నావ’ని పేర్కొన్నారు. జస్టిస్ మార్కండేయ కట్జూ: పదవిలో ఉండగా ఒక తీర్పు సందర్భంగా ‘కొందరు అవినీతిపరుల్ని బహిరంగంగా ఉరితీస్తే.. మిగతావారు అవినీతికి పాల్పడకుండా ఉంటార’ని వివాదా స్పద వ్యాఖ్యలు చేశారు. మరో కేసులో ‘ముస్లిం విద్యార్థుల్ని గడ్డం పెంచుకునేందుకు అనుమతిస్తే.. దేశం తాలిబన్ల ప్రాంతంగా తయారవుతుంద’ని పేర్కొన్నారు. జస్టిస్ శ్రీవాత్సవ : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ శ్రీవాత్సవ భగవద్గీతను జాతీయ ధర్మశాస్త్రంగా ప్రకటించాలని కోరడం విమర్శలకు దారితీసింది. జస్టిస్ పి.దేవదాస్: 2015లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. అత్యాచారం కేసులో నేరస్తుడితో రాజీ చేసుకోమని బాధితురాలికి సూచించడం ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. నేరస్తుడికి బెయిల్ మంజూరు చేయడంతో పాటు, అతన్ని పెళ్లి చేసుకోవాలని బాధితురాలికి జస్టిస్ దేవదాస్ సూచించారు. జస్టిస్ జేబీ పర్దివాలా: గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ‘ఈ దేశాన్ని నాశనం చేస్తున్న రెండు అంశాలు ఏవంటే.. ఒకటి రిజర్వేషన్, రెండు అవినీత’ని పేర్కొనడం చర్చనీయాంశమైంది. -
సహకరించండి
► జస్టిస్ కర్ణన్ ‘కానవిల్లై’ ► పశ్చిమ బెంగాల్ డీజీపీ లేఖ ► అజ్ఞాతంలోనే ఉద్యోగ విరమణ కోర్టు ధిక్కారం కేసులో ఆరునెలల జైలు శిక్ష పడిన కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కనుమరుగై నెలరోజులు దాటినా ఎక్కడ ఉన్నారో ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. కర్ణన్ అచూకీ కోసం పడరానిపాట్లు పడుతున్నామని తమిళనాడు పోలీసులు ఆయాసపడుతుండగా, సరైన సహకారం అందలేదని పశ్చిమ బెంగాల్ డీజీపీ పరోక్షంగా ఆక్షేపించారు. చెన్నైలో ఉన్న కర్ణన్ అరెస్ట్‌కు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కుç పశ్చిమ బెంగాల్ డీజీపీ రాసిన ఉత్తరం సోమవారం అందింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా 2015లో సహ న్యాయమూర్తులపై అనేక ఆరోపణలు చేసిన ఫలితంగా జస్టిస్ కర్ణన్ సుప్రీంకోర్టు అగ్రహానికి గురై కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయ్యారు. కోల్‌కతాలో సైతం వివాదాస్పద వైఖరిని కొనసాగించారు. తన తోటి న్యాయమూర్తులకే విరోధిగా మారడమేగాక వారికి శిక్షలు విధించేందుకు సిద్ధం కావడంతో కర్ణన్ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకుంది. కర్ణన్ మానసిక స్థితిపై పరీక్షలు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్యులు ఆయన ఇంటికి వెళ్లగా నిరాకరించారు. అంతేగాక మానసిక పరీక్షలు చేయాలని ఉత్తర్వులు జారీచేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సైతం కర్ణన్ తీవ్రంగా విమర్శించడంతో గత నెల 10వ తేదీన ఆరు నెలల జైలు శిక్ష పడింది. కర్ణన్‌ను అరెస్ట్ చేసే బాధ్యతను కోల్‌కతా పోలీసులకు సుప్రీంకోర్టు అప్పగించింది. ముందుగానే సమాచారం అందుకున్న కర్ణన్ పోలీసులు అరెస్ట్ చేసేలోగా కోల్‌కతా నుంచి చెన్నై చేరుకున్నారు. చేపాక్ ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. అదే రోజు రాత్రి పశ్చిమబెంగాల్ పోలీసులు సైతం చెన్నైకి చేరుకుని కర్ణన్ అరెస్ట్‌కు సహకరించాల్సిందిగా చెన్నై పోలీస్ కమిషనర్‌ను కోరారు. అయితే చెన్నైకి చేరుకున్న రోజు అర్ధరాత్రి అధికారికి బందోబస్తును, ప్రొటోకాల్ కారును అతిథిగృహంలోనే ఉంచి ప్రయివేటు కారులో కర్ణన్ వెళ్లిపోయారు. బందోబస్తు పోలీసులు, ప్రభుత్వ కారు చేపాక్ అతిథిగృహం ముందే ఉండడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఆయన లోపలే ఉన్నారని భావించారు. అయితే తెల్లవారుతున్న సమయంలో అనుమానం వచ్చి ఆరాతీయగా ఆయన రూములో కొందరు న్యాయవాదులు మాత్రమే దర్శనమివ్వడంతో విస్తుపోయారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళుతున్నట్లు తన స్నేహితునికి సమాచారం ఇచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి పరుగులు పెట్టారు. అయితే శ్రీకాళహస్తిలో ఆయన చిక్కలేదు. మరికొందరి సమాచారం మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్గంలో దారికాచారు. అయినా ఆయన దొరకలేదు. కర్ణన్‌ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులతోపాటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైతం నిఘా పెట్టారు. కర్ణన్ కోసం ఒకవైపు గాలింపు జరుగుతుండగా తనకు విధించిన ఆరునెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఈ నెల 11వ తేదీన కర్ణన్ చెన్నై నుంచే అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. కర్ణన్ ఎక్కడికీ పారిపోలేదు, చెన్నైలోనే ఉన్నారని అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరఫు న్యాయవాదులు స్పష్టం చేసినా ఎక్కడ ఉన్నది బహిర్గతం చేయలేదు. కర్ణన్‌ను అరెస్ట్ చేసి, వెంటనే వెళ్లిపోవచ్చనే నమ్మకంతో చెన్నై వచ్చిన పశ్చిమ బెంగాల్ పోలీసులు మరికొన్నిరోజులు గడపక తప్పదని నిర్ధారించుకుని చెన్నై ఎగ్మూరులోని ఆఫీసర్స్ మెస్‌లో బస చేశారు. చెన్నై చూలైమేడులో కర్ణన్‌కు ఇల్లు ఉందని తెలుసుకుని అకస్మాత్తుగా దాడి చేసినా ఆయన అక్కడా దొరకలేదు. ఇదిలా ఉండగా, ఆరునెలల జైలు శిక్ష రద్దు కోరుతూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కోర్టు నిబంధనలకు లోబడి రిజిస్ట్రారు ద్వారా రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని స్వీకరణకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. కర్ణన్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్ విచారణకు రాక ముందే అరెస్ట్ చేయాలని పట్టుదలతో ఉన్న పశ్చిమ బెంగాల్ పోలీసులు చెన్నై పోలీసుల సహాయంతో విస్తృతంగా గాలిస్తూనే ఉన్నారు. రిటైరైన జస్టిస్: ఆరునెలల జైలు శిక్ష నుండి తప్పించుకునేందుకు అజ్ఞాతంలో ఉండగానే జస్టిస్ కర్ణన్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. డీజీపీ ఉత్తరం: జస్టిస్ కర్ణన్‌ను అరెస్ట్ చేసేందుకు అవసరమైన సహాయాన్ని అందించాల్సిందిగా పశ్చిమబెంగాల్ డీజీపీ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌ను కోరారు. కర్ణన్ తమిళనాడులోనే తలదాచుకుని ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం చెన్నైతోపాటూ తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో కర్ణన్ కోసం తమ పోలీసులు గాలిస్తూనే ఉన్నారని అన్నారు. కర్ణన్ చెన్నైలోనే ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉన్నందున ఆయనను అరెస్ట్ చేసేందుకు తగిన సహకారం అందిచాల్సిందిగా పశ్చిమబెంగాల్ డీజీపీ విజ్ఞప్తి చేశారు. -
పరారీలోనే పదవీ విరమణ
జస్టిస్ కర్ణన్ మరో రికార్డు న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్(62) సోమవారం పదవీ విరమణ సందర్భంగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తిగా ఇప్పటికే పేరుపొందిన ఆయన.. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం సెలవుకాల ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు. కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్ తరఫు న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా జస్టిస్ కర్ణన్ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కు పశ్చిమ బెంగాల్ డీజీపీ సోమవారం లేఖ రాశారు. ఆదినుంచీ వివాదాస్పదమే.. వివాదాస్పద ప్రవర్తన కారణంగా మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్న కర్ణన్‌ను గతేడాది మార్చి 11న కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. ఆ ఆదేశాల్ని కర్ణన్ ధిక్కరించడంతో ఆయనకు ఎలాంటి విధులూ అప్పగించొద్దని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సుప్రీం ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణకేసులో తమ ముందు హాజరుకావాలంటూ ఈ ఏడాది మార్చి 10న బెయిలబుల్ వారంట్ జారీచేసింది. మార్చి 31న సుప్రీంకోర్టుకు హాజరైన కర్ణన్ తన అధికారాల్ని పునరుద్ధరించాలని కోరగా కోర్టు తిరస్కరించింది. తనను జైల్లో పెట్టినా బెంచ్ ముందు హాజరుకానని కర్ణన్ స్పష్టం చేయడంతో.. అతని మానసిక స్థితిపై పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. వైద్యపరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరిస్తూ మే 4న కర్ణన్ లేఖ ఇవ్వడంతో పాటు సుప్రీం న్యాయమూర్తుల్ని అరెస్టు చేయాలంటూ తన ఇంటి నుంచే ఆదేశాలు జారీచేశారు. -
జస్టిస్ కర్ణన్‌కు ఎదురుదెబ్బ
► రివ్యూ పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: వివాదాస్పద హైకోర్టు న్యాయవాది జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో తనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ జస్టిస్ కర్ణన్ తన న్యాయవాది మాథ్యుస్ నెదుమ్పరా ద్వారా సుప్రీంకోర్టులో గురువారం రివ్యూ పిటీషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. ‘జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున ఆయనకు శిక్ష విధించాలని గతంలో ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్పు తక్షణం అమలు చేసేందుకు ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ కర్ణన్ జారీచేసే తదుపరి ఆదేశాలను ప్రచురించొద్దని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసఫ్‌ల ధర్మాసనం మీడియాకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. -
కర్ణన్ కోసం కాళ్లరిగేలా..
సాక్షి ప్రతినిధి, చెన్నై: అయ్యా...ఎక్కడున్నావయ్యా అని ఉసూరుమంటూ జస్టిస్ కర్ణన్ కోసం పశ్చిమ బెంగాల్ పోలీసులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. చెన్నైలో ఉన్నాడనే సమాచారంతో నాలుగురోజులుగా వెతుకులాడుతున్న పోలీసు అధికారులు ఆదివారం సైతం పలుచోట్ల గాలించారు. మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా 2015లో సహా న్యాయమూర్తులపై అనేక ఆరోపణలు చేసిన ఫలితంగా కోల్‌కతా హైకోర్టుకు బదీలీ అయ్యారు. అక్కడ సైతం అదే వివాదాస్పద వైఖరిని కొనసాగించి తోటి న్యాయమూర్తులకు విరోధిగా మారారు. న్యాయమూర్తులకు శిక్షలు విధించేందుకు సిద్దం కావడంతో కర్ణన్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను సైతం కర్ణన్ విమర్శించడంతో ఈనెల 10వ తేదీన ఆరు నెలల జైలు శిక్ష పడింది. కర్ణన్‌ను అరెస్ట్ చేసే బాధ్యతను కోల్కత్తా పోలీసులకు సుప్రీం కోర్టు అప్పగించింది. అయితే పోలీసులు అరెస్ట్ చేసేలోగా కోల్కత్తా నుండి చెన్నై చేరుకున్న కర్ణన్ చేపాక్ ప్రభుత్వ అతిధిగృహంలో బసచేశారు. అదే రోజు రాత్రి పశ్చిమబెంగాల్ పోలీసులు సైతం చెన్నైకి చేరుకుని పోలీస్ కమిషనర్‌ను కలుసుకుని చేపాక్ అతిధిగృహానికి చేరుకున్నారు. అయితే కోర్టు దిక్కరణ కేసులో సుప్రీం కోర్టుచే ఆరునెలల జైలు శిక్ష పడిన కోల్కత్తా హైకోర్టు న్యాయమూర్తి కర్ణన్ ఈనెల 10 తేదీన చెన్నై చేరుకుని పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఉన్నారని కొందరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నారని మరికొందరు చెప్పడంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు రెండు ప్రాంతాలకు పరుగులు పెట్టారు. మరికొందరు చేపాక్ అతిధిగృహం వద్దనే కాపుకాసారు. కర్ణన్‌ను అరెస్ట్ చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులతోపాటూ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సైతం రంగంలోకి దిగారు. మూడు రాష్టాల పోలీసులకు చిక్కకుండా జారుకున్నారు. కర్ణన్ కోసం ఒకవైపు గాలింపు జరుగుతుండగా తనకు విధించిన ఆరునెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఈనెల 11వ తేదీన కర్ణన్ అప్పీలు పిటిషన్ దాఖలు చేశారు. కర్ణన్ ఎక్కడికీ పారిపోలేదు, చెన్నైలోనే ఉన్నారని అప్పీలు పిటిషన్ దాఖలు చేసిన ఆయన తరపు న్యాయవాదులు ప్రకటించారు. కాగా, కర్ణన్‌ను అరెస్ట్ చేసి వెంటనే వెళ్లిపోవచ్చని ఆశించిన పశ్చిమ బెంగాల్ పోలీసులకు నిరాశేమిగిలింది. కర్ణన్ అరెస్ట్‌లో జాప్యం తప్పదని అర్దం చేసుకున్న కోల్కత్తా పోలీసులు చెన్నై ఎగ్మూరులోని ఆఫీసర్స్ మెస్‌లో బస చేసుకున్నారు. -
జైలు శిక్ష రద్దు చేయండి
-
జైలు శిక్ష రద్దు చేయండి
సుప్రీంకోర్టులో జస్టిస్ కర్ణన్ రివ్యూ పిటిషన్ న్యూడిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: కోర్టు ధిక్కరణ కేసులో తనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ జస్టిస్ కర్ణన్ తన న్యాయవాది మాథ్యుస్ నెదుమ్పరా ద్వారా సుప్రీంకోర్టులో గురువారం రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై తాను చేసిన ఫిర్యాదులపై విచారణ జరపాల్సింది పోయి.. జైలు శిక్ష విధించడం అన్యాయమని పిటిషన్లో పేర్కొన్నారు. న్యాయమూర్తులను తప్పుపట్టాను కానీ న్యాయస్థానాన్ని కాదని ఆయన వివరించారు. ఇది న్యాయస్థానాలను అవమానించినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. కర్ణన్ అభ్యర్థనపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ సానుకూలంగా స్పందించారు. ‘మీ అభ్యర్థనను అంగీకరిస్తున్నాం. దీన్ని పరిశీలిస్తాం’ అని జస్టిస్ ఖేహర్ అన్నారు. అలాగే జస్టిస్ కర్ణన్ దేశం విడిచి వెళ్లిపోయారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తరఫు న్యాయవాదులు ఖండించారు. ఆయన ఎక్కడికీ వెళ్లలేదని, చెన్నైలోనే ఉన్నారని తెలిపారు. రివ్యూ పిటిషన్ వేయమంటూ జస్టిస్ కర్ణన్ న్యాయవాదికి సమర్పించిన నోటరీ పత్రాలను కోర్టు చూపించమనడంతో వాటిని మాథ్యూస్ సుప్రీంకోర్టుకు చూపారు. అలాగే కర్ణన్ క్షమాపణలు కోరినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన తరఫు న్యాయవాదులు కొట్టిపారేశారు. కొనసాగుతున్న గాలింపు.. మరోవైపు జస్టిస్ కర్ణన్‌ను అదుపులోకి తీసుకునేందుకు కోల్‌కతా నుంచి చెన్నై వచ్చిన పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. -
జస్టిస్ కర్ణన్ ఎక్కడ?
► తడ ప్రాంతంలో ఉన్నట్లు జీపీఎస్ సమాచారం ► శ్రీకాళహస్తికి రాబోతున్నట్లూ వార్తలు.. చెన్నై/తడ/శ్రీకాళహస్తి: కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు ఆర్నెల్ల జైలు శిక్ష విధించిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ ఆచూకీపై మిస్టరీ నెలకొంది. అరెస్టును తప్పించుకునేం దుకు ఆయన చెన్నై నుంచి నెల్లూరు జిల్లా తడకు వచ్చారని ఒకపక్క, పూజల కోసం శ్రీకాళహస్తికి చేరుకుంటున్నారని మరోపక్క బుధవారం వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. జస్టిస్ కర్ణన్ కోసం గాలిస్తున్న కోల్‌కతా పోలీసులు ఆయన తడ ప్రాంతానికి వచ్చినట్లు జీపీఎస్, డ్రైవర్ ఫోన్ నంబర్ ఆధారంగా గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. జడ్జి కారు సరిహద్దు గ్రామమైన పన్నంగాడు వద్ద ఉన్నట్లు సిగ్నల్ చూపడంతో ఎస్ఐ సురేష్ బాబు వెంటనే అక్కడ గాలించారు. కానీ అక్కడ ఎలాంటి ఆచూకీ లభించలేదు. తడలోని సీసీ కెమెరాలను పరిశీలించినా ప్రయోజనం లేకపోయింది. కోల్‌కతా, చెన్నై పోలీసులు, మీడియా ప్రతినిధు లు కూడా తడ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని వివరాలు సేకరించారు. మరోపక్క.. తరచూ శ్రీకాళహస్తికి వచ్చే జస్టిస్ కర్ణన్ బుధవారం చెన్నై నుంచి శ్రీకాళహస్తి దేవస్థానా నికి వస్తున్నారని, సాయంత్రం రాహుకేతు పూజ చేస్తారని వార్తలొచ్చాయి. చెన్నైలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేసిన కర్ణన్ అధికారికంగా అక్కడి నుంచి ఖాళీ చేయలేదు. -
జస్టిస్ కర్ణన్ ఎక్కడ? పోలీసులకు చుక్కలు
-
జస్టిస్ కర్ణన్‌కు ఆర్నెల్ల జైలు
కోర్టుధిక్కార నేరం కింద శిక్ష విధించిన సుప్రీంకోర్టు ► తక్షణం తీర్పు అమలు చేయాలని ఆదేశం.. ► న్యాయమూర్తుల పరిరక్షణ చట్టం, సెక్షన్– 3 కర్ణన్‌కు వర్తించదు: న్యాయనిపుణులు న్యూఢిల్లీ, చెన్నై: కలకత్తా హైకోర్టుకు చెందిన వివాదాస్పద న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు కోర్టు ధిక్కార నేరం కింద ఆర్నెల్లు జైలుశిక్ష విధిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ‘జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున ఆయనకు శిక్ష విధించాలని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్పు తక్షణం అమలు చేసేందుకు ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ కర్ణన్ జారీచేసే తదుపరి ఆదేశాలను ప్రచురించొద్దని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసఫ్‌ల ధర్మాసనం మీడియాకు ఆదేశాలు జారీచేసింది. కాగా తనపై విచారణ చేపట్టిన రాజ్యాంగ ధర్మాసనంలోని సభ్యులకు సోమవారం తన ఇంట్లోనే విచారణ జరిపి ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం కింద ఐదేళ్ల చొప్పున కారాగార శిక్ష విధిస్తూ జస్టిస్ కర్ణన్ తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. వివాదాస్పద ప్రవర్తన కారణంగా మద్రాస్ హైకోర్టులో పనిచేస్తున్న కర్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే ఆ ఆదేశాలను కర్ణన్ ధిక్కరించడంతో ఆయనకు ఎటువంటి విధులూ అప్పగించొద్దని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. తమ ఆదేశాలు పాటించనందుకు కోర్టు ధిక్కరణకేసులో తమ ముందు హాజరుకావాలంటూ మార్చి 10న సుప్రీంకోర్టు జస్టిస్ కర్ణన్‌కు బెయిలబుల్ వారంట్ జారీచేసింది. ఆయన హాజరు కాకపోవడంతో నెల తరువాత తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలంటూ మరో నోటీసు జారీచేసింది. మార్చి 31న సుప్రీంకోర్టుకు హాజరైన జస్టిస్ కర్ణన్ తన అధికారాలను పునరుద్ధరించాలని కోరగా అందుకు కోర్టు తిరస్కరించింది. దీంతో తనను జైల్లో పెట్టినా సరే మరోమారు బెంచ్ ముందు హాజరుకానని ఆయన స్పష్టం చేశారు. దీంతో అతని మానసిక స్థితిపై పోలీసుల సమక్షంలో వైద్యపరీక్షలు నిర్వహించాలని ధర్మాసనం మే 1న ఆదేశాలు జారీచేసింది. అయితే మే 4న జస్టిస్ కర్ణన్ వైద్యపరీక్షలు చేయించుకోవడానికి తిరస్కరిస్తూ తను మానసికంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ లేఖ ఇచ్చారు. చెన్నైకి జస్టిస్ కర్ణన్: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్ మంగళవారం చెన్నైకి వచ్చారు. తనకు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడానికి ముందు నగరానికి చేరుకున్న ఆయన స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విడిది చేశారు. మధ్యాహ్నం తన గదిలో విలేకర్లతో మాట్లాడారు. పదవిలో ఉన్న న్యాయమూర్తిని శిక్షించవచ్చా? భారతదేశ ఉన్నత న్యాయస్థానాల చరిత్రలో పదవిలో కొనసాగుతూ శిక్ష ఎదుర్కోనున్న మొట్టమొదటి న్యాయమూర్తిగా జస్టిస్ సీఎస్ కర్ణన్ చరిత్రలో నిలిచిపోనున్నారు. అలాగే తాను చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపకుండా న్యాయవ్యవస్థలో కల్లోలం రేపిన న్యాయమూర్తిగా కూడా ఆయన అపఖ్యాతి మూటకట్టుకున్నారు. అయితే అసలు పదవిలో ఉన్న న్యాయమూర్తికి శిక్ష విధించవచ్చా..? ‘న్యాయమూర్తుల పరిరక్షణ చట్టం–1985 సెక్షన్ 3 ప్రకారం... న్యాయ, పరిపాలనా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు న్యాయమూర్తులపై ఎలాంటి సివిల్ లేదా క్రిమినల్ చర్యలు చేపట్టకుండా ప్రత్యేక్ష రక్షణ కల్పించారు. అయితే జస్టిస్ కర్ణన్‌ను న్యాయ, పరిపాలన విధుల నుంచి తప్పిస్తూ ఇంతకుముందే సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కర్ణన్‌ను దోషిగా నిర్ధారించేందుకు మార్గం సుగమమైంది. న్యాయమూర్తుల పరిరక్షణ చట్టం–1985 సెక్షన్ 3 కింద కర్ణన్‌కు ఎలాంటి రాజ్యాంగ రక్షణ లేదని సుప్రీంకోర్టు న్యాయవాది అతుల్ కుమార్ పేర్కొన్నారు. ఒక హైకోర్టు న్యాయమూర్తికి కోర్టు ధిక్కరణ నేరం కింద ఆరు నెలల జైలు శిక్ష విధించడం భారత దేశ చరిత్రలో ఇదే మొదటిసారని, అందుకోసం సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సాయం తీసుకుందని చెప్పారు. న్యాయవ్యవస్థ పరువు–ప్రతిష్టల్ని సుప్రీంకోర్టు తీర్పు కాపాడిందని, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రత్యేక గౌరవాన్ని కాపాడేందుకు సుప్రీం ఇచ్చిన తీర్పు సరైందని, ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని అతుల్ పేర్కొన్నారు. మరో సీనియర్ న్యాయవాది శంతను మాట్లాడుతూ.. ‘నువ్వు హైకోర్టు న్యాయమూర్తైనా సరే సుప్రీం కోర్టును తక్కువ అంచనా వేయకూడదనేందకు ఈ తీర్పు ఒక ఉదాహరణ’ని పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానం మర్యాదకు సంబంధించిన సమస్యను సుప్రీంకోర్టే పరిష్కరించిందన్నారు. వక్రమార్గం పట్టిన న్యాయమూర్తుల అనైతిక ప్రవర్తన నుంచి ఉన్నత న్యాయస్థానాల మర్యాద, గౌరవాన్ని రక్షించే క్రమంలో ఈ తీర్పు ఒక విజయమని మరో సీనియర్ న్యాయవాది అవనిశ్ కుమార్ చెప్పారు. ఆరేళ్లుగా వివాదాలే! వివాదాల్లో చిక్కుకోవడమేగాక, తోటి న్యాయమూర్తులతో బహిరంగంగా గొడవ పడడం, సుప్రీంకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేయడం కొందరు హైకోర్టు జడ్జీలకు ఏడెనిమిదేళ్లుగా సాధారణంగా మారింది. ఇక జస్టిస్ కర్ణన్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచీ వివాదాలతోనే ముందుకు సాగారు. కాలు తగిలించారంటూ సహజడ్జిపై ఆరోపణలు 2009లో మద్రాసు హైకోర్టు అదనపు జడ్జీగా నియామకంతో న్యాయవ్యవస్థలోకి అడుగుపెట్టిన కర్ణన్ ఆరేళ్లుగా ఏదొక వివాదంతో అలజడి రేపుతూనే ఉన్నారు. తన పక్కన కూర్చున్న తోటి జడ్జి కావాలని కాలు తాకించి కుల వివక్ష చూపించారని 2011లో విలేకరుల సమావేశం పెట్టి మరీ కర్ణన్ ఆరోపించారు. 2015లో మద్రాసు హైకోర్టులో న్యాయవ్యవస్థ నియామకాలపై వాదనలు జరుగుతుండగా, కర్ణన్ హఠాత్తుగా అక్కడకు వెళ్లి తన వాదన వినాలంటూ గొడవపడ్డారు. అదే ఏడాది ఏప్రిల్‌లో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్ కౌల్‌పై కోర్టుధిక్కార విచారణ ప్రారంభించి సంచలనం సృష్టించారు. దళితుడైనందున కౌల్ తనను వేధించడమేగాక, ప్రాధాన్యం లేని కేసుల్ని అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేసింది. సుప్రీంకోర్టుపైనే పోరాటం 2016 ఫిబ్రవరిలో జస్టిస్ కౌల్‌పై కర్ణన్ అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో అదే నెలలో సుప్రీంకోర్టు కర్ణన్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీచేసింది. వెంటనే సుప్రీం ఉత్తర్వుపై స్టే ఇస్తూ కర్ణన్ ఆదేశాలు జారీచేశారు. ఈ స్టేను ఇద్దరు జడ్జీల సుప్రీం బెంచ్ తొలగించగా, ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కింద వారిపై కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని ప్రకటనలపై ధిక్కార అభియోగం కింద చర్యలు తీసుకుంటానని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో దిగొచ్చిన కర్ణన్ తనకు ‘మతి స్థిమితం’ తప్పిందంటూ క్షమాపణ చెప్పారు. అప్పటి సుప్రీం ప్రధానన్యాయమూర్తి టీఎస్ ఠాకూర్‌తో ప్రైవేటుగా సమావేశమై.. కలకత్తా హైకోర్టులో జడ్జీగా చేరేందుకు అంగీకరించారు. అంతటితో ఆగకుండా 2017 జనవరిలో పదవిలో ఉన్న, రిటైరైన 20 మంది సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు అవినీతిపరులంటూ జాబితా విడుదల చేసి దుమారం సృష్టించారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రధానికి లేఖ రాశారు. గతంలోనూ వివాదాస్పద న్యాయమూర్తులు 2011లో అప్పటి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీడీ దినకరన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల వల్ల అభిశంసన చర్యలు ప్రారంభించగా ఏడాది ముందే ఆయన రాజీనామా చేశారు. 400 ఎకరాల భూమి అక్రమంగా సంపాదించడం, కక్షిదారుల ఇంట్లో బసచేయడం, ఓ హౌసింగ్ సొసైటీలో తన భార్య, కూతుళ్ల పేర్లపై ఇళ్ల స్థలాలు సంపాదించడం వంటి అనేక అభియోగాలు దినకరన్‌పై వచ్చాయి. 2012లో అవినీతి ఆరోపణలతో రాజ్యసభలో అభిశంసన ఎదుర్కొన్న కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ సౌమిత్ర సేన్.. తనను తొలగించముందే రాజీనామా చేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా తమిళనాడుకు చెందిన సుప్రీంకోర్టు జడ్జీ వి.రామస్వామిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానంపై చర్చ జరిగి, ఓటింగ్ జరిగే లోగా ఆయన రాజీనామా చేయడంతో అభిశంసన ప్రక్రియ నిలిపివేశారు. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సుప్రీం కోర్టుపై హైకోర్టు జడ్జి ప్రతీకారం
కోల్‌కతా: సుప్రీం కోర్టుకు, కలకతా హైకోర్టు జడ్జి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు మధ్య జరుగుతున్న న్యాయపోరాటం కొనసాగుతోంది. జస్టిస్ కర్ణన్‌కు మానసిక వైద్య పరీక్షలు నిర్వహించాలని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించగా.. ఆయన కూడా ఏడుగురు జడ్జిలపై ఇలాంటి ఆదేశాలే జారీ చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. సుప్రీం కోర్టు జడ్జిలను ఎయిమ్స్‌కు తీసుకెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను జస్టిస్ కర్ణన్ ఆదేశించారు. సుప్రీం కోర్టు ఆదేశాలను తాను పాటించబోనని, వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని జస్టిస్ కర్ణన్ స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తనకు బలవంతంగా వైద్యపరీక్షలు చేయించేందుకు వస్తే పశ్చిమబెంగాల్ డీజీపీని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. గతంలో మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర న్యాయమూర్తులపై ఆరోపణలు చేసిన కేసులో విచారణకు హాజరుకావాలంటూ జస్టిస్ కర్ణన్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఆయన విచారణకు హాజరుకావడం లేదు. ఆయనపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. తనపై చర్యలు తీసుకునే హక్కు సుప్రీం కోర్టుకు లేదంటూ, జస్టిస్ కర్ణన్ వారిపైనే చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. -
సుప్రీంకోర్టుపై జస్టిస్ కర్ణన్ ఆగ్రహం
కోల్‌కతా: సుప్రీంకోర్టుపై వివాదాస్పద కలకత్తా హైకోర్టు జస్టిస్ సీఎస్ కర్ణన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మానసిక స్థితిని పరీక్షించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. మానసికంగా తాను బలహీనుడ్ని కాదని కర్ణన్ చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కావాలనే తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని అన్నారు. దళితుడిని కాబట్టే తనను అవమానిస్తున్నారని, తనను ప్రశ్నిస్తున్న జడ్జిలంతా అవినీతిపరులే అని కర్ణన్ పేర్కొన్నారు. కాగా జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. మే 5లోగా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. 8వ తేదీ కల్లా కర్ణన్ మానసిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సోమవారం సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెడికల్ బోర్డ్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను మే 18కి వాయిదా వేసింది. తోటి న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను భారత న్యాయ చరిత్రలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరైన సిట్టింగ్ న్యాయమూర్తిగా కర్ణన్ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. -
జస్టీస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు!
న్యూఢిల్లీ: వివాదాస్పద కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయించింది. మే 5లోగా వైద్య పరీక్షలు నిర్వహించి.. 8వ తేదీ కల్లా కర్ణన్ మానసిక పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని సోమవారం సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం మెడికల్ బోర్డ్‌ను ఆదేశించింది. కర్ణన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించేందుకుగాను పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పశ్చిమ బెంగాల్ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కర్ణన్ ఏమైనా చెప్పాలనుకుంటే అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే ఆయన చెప్పేదేమీ లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ కేసు తదుపరి విచారణను మే 18కి వాయిదా వేసింది. తోటి న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను భారత న్యాయ చరిత్రలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట హాజరైన సిట్టింగ్ న్యాయమూర్తిగా కర్ణన్ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. -
ప్రధాన న్యాయమూర్తిపై జస్టిస్ కర్నన్ దూకుడు!
దేశ న్యాయ చరిత్రలోనే ఇదో సంచలనం. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్నన్ ఓ పెద్ద దుస్సాహసం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, మరో ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జీలను తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశించారు!! ఈనెల 28వ తేదీన కోల్‌కతాలోని తన రెసిడెన్షియల్ కోర్టుకు రావాలని తెలిపారు. జస్టిస్ కర్నన్ మీద ఇంతకుముందే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్, మరో ఆరుగురు న్యాయమూర్తులు కోర్టు ధిక్కార నేరాన్ని విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆయనను మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశింఆచరు. అంతేకాదు, జస్టిస్ కర్నన్ మీద బెయిలబుల్ అరెస్టు వారెంటును కూడా ఈ రాజ్యాంగ ధర్మాసనం జారీచేసింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలపై అత్యాచారాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినందుకు వారికి ఏ శిక్ష విధించాలన్న విషయమై అభిప్రాయాలు చెప్పాలని.. అందుకోసం పైన పేర్కొన్న గౌరవనీయులైన ఏడుగురు జడ్జీలు రోజ్డేల్లోని తన రెసిడెన్షియల్ కోర్టులో తన ఎదుట 28వ తేదీ ఉదయం 11.30 గంటలకు హాజరు కావాలని తాను ఆదేశించినట్లు జస్టిస్ కర్నన్ మీడియాకు తెలిపారు. ఈ సుమోటో జ్యుడీషియల్ ఆర్డర్‌ను తన ఇంటినుంచే జారీచేసినట్లు ఆయన చెప్పారు. కోల్‌కతాలోని రోజ్డేల్ నివాసంలో తన తాత్కాలిక కోర్టును ఏర్పాటుచేసుకున్నానన్నారు. ఆ ఏడుగురు న్యాయమూర్తులు దురుద్దేశంతో తనను కావాలనే అవమానించారని, కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించారని ఆయన చెప్పారు. ఈ ఏడుగురు న్యాయమూర్తులు ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద నిందితులని తాను మార్చి 31వ తేదీనే ఒక తీర్పు చెప్పానని జస్టిస్ కర్నన్ న్నారు. కాగా, కర్నన్ మానసిక స్థితి ఎలా ఉందో అనే అనుమానాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ వ్యక్తం చేశారు. ధర్మాసనంలోని మిగిలిన ఆరుగురు న్యాయమూర్తులు కూడా దాన్ని నిర్ధారించారు. ఈ ప్రశ్నను బహిరంగ కోర్టులో లేవనెత్తడం ద్వారా వారు తనను అవమానించారని ఇప్పుడు కర్నన్ అంటున్నారు. బహిరంగ కోర్టులో ఇది తనకు చాలా పెద్ద అవమానమని ఆయన అన్నారు. -
నన్ను జైలుకు పంపండి: జడ్జి
తన పని వెంటనే మళ్లీ తనకు ఇప్పించాలని, లేని పక్షంలో తాను మళ్లీ మరోసారి కోర్టుకు హాజరయ్యేది లేదని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్నన్ స్పష్టం చేశారు. కావాలంటే తనను జైలుకు పంపాలని కూడా చెప్పారు. సుప్రీంకోర్టును కూడా లెక్క చేసేది లేదని.. కోర్టు ధిక్కార కేసు విచారణను తాను ఎదుర్కోబోనని కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్నన్ మొండికేయడంతో సుప్రీంకోర్టు ఆయనపై గతంలో బెయిలబుల్ అరెస్టు వారంటు జారీచేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఏడుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట శుక్రవారం హాజరయ్యారు. తన పాలనాపరమైన, న్యాయపరమైన పనిని ఫిబ్రవరి నెలలో ఏకపక్షంగా లాగేసుకున్నందున దాన్ని వెంటనే పునరుద్ధరించాలని జస్టిస్ కర్నన్ ధర్మాసనాన్ని కోరారు. తాను ఉగ్రవాదిని గానీ, అసాంఘిక శక్తిని గానీ కానని, అంతగా కావాలనుకుంటే ధర్మాసనం తనను జైలుకు కూడా పంపుకోవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎదుట జస్టిస్ కర్నన్ (61) వాదించారు. అయితే, ఆయనకు కలకత్తా హైకోర్టులో మళ్లీ విధులు అప్పగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నాలుగు వారాల్లోగా సమాధానం సమర్పించాలని ఆదేశించింది. ఆయన మానసిక స్థఙతి ఏమీ బాగోలేదని, అందువల్ల ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే, అలాంటిదేమీ లేదని.. ఆయన ఏం చేస్తున్నారో ఆయనకు స్పష్టంగా తెలుస్తోందని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదించారు. 20 మంది జడ్జీలపై చేసిన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నారా, లేదా ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకుని బేషరతు క్షమాపణలు చెబుతారో చెప్పాలని సుప్రీంకోర్టు జస్టిస్ కర్నన్‌ను అడిగింది. తాను చేసిన ఫిర్యాదు చట్టానికి లోబడే ఉందని ఆయన అన్నారు. దాంతో జడ్జి అయినా కూడా ఆయనకు విధివిధానాలు తెలియవని కోర్టు వ్యాఖ్యానించింది. -
హైకోర్టు జడ్జిపై కోర్టు ధిక్కార చర్యలు!
దేశ న్యాయవ్యవస్థలోనే ఇంతవరకు ఎన్నడూ జరగని ఘటన ఒకటి జరిగింది. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులపై ఆరోపణలు చేసినందుకు కలకత్తా హైకోర్టు సిటింగ్ జడ్జి జస్టిస్ సిఎస్ కర్నన్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నిర్ణయించారు. ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును బుధవారం విచారించనుంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిటింగ్ జడ్జిపై కోర్టు ధిక్కార విచారణ జరిపేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు కూడా కొంతమంది సిటింగ్ జడ్జిలపై ఆరోపణలు వచ్చినా, వాళ్ల తొలగింపునకు సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా పార్లమెంటుకు ప్రధాన న్యాయమూర్తి సూచించారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కె. కౌల్ మీద కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటానని చెప్పి జస్టిస్ కర్నన్ 2015లో మద్రాస్ హైకోర్టును పెను సంక్షోభంలోకి నెట్టేశారు. జస్టిస్ కౌల్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని తాజాగా కొలీజియం సూచించింది. మరో న్యాయమూర్తి విద్యార్హతల విషయంలో సీబీఐ విచారణ కోరారని, తన పనిలో కౌల్ అడ్డుపడుతున్నారని కర్నన్ ఆరోపించారు. తాను దళితుడిని కాబట్టి కులవివక్ష చూపుతున్నారని, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను వేధిస్తున్నారని కూడా ఆరోపించారు. ఆ తర్వాత తనను బదిలీ చేయగా, సుప్రీం ఉత్తర్వులపై కర్నన్ స్టే విధించారు. -
సంచలన కర్ణన్!
సాధారణంగా గంభీర వాతావరణం రాజ్యమేలే న్యాయస్థానాల్లో వింత ఉదంతాలను ఎవరూ ఊహించలేరు. కానీ ఊహకందనివి ఎక్కడైనా చోటు చేసుకోవచ్చునని మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ నిరూపించారు. తనను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించుకుంటూ తీర్పునివ్వడమేకాక తన విధుల్లో జోక్యం చేసుకుని విసిగించొద్దంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు...ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని నిండు న్యాయస్థానంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా జాతి వ్యతిరేకులని ముద్రలేసే వాతావరణం కొనసాగుతున్న వర్తమానంలో ఈ మాటలే మరోచోట ఎవరైనా అని ఉంటే ఏమయ్యేదో ఊహించుకోవడం పెద్ద కష్టంకాదు. ఈ మాదిరి ప్రవర్తనతో అందరినీ ఆశ్చర్యపరచడం జస్టిస్ కర్ణన్‌కు కొత్తగాదు. విభిన్నమైన ధోరణితో, విలక్షణమైన తీర్పులతో ఆయన గతంలోనూ ‘ఔరా’ అనిపించారు. సివిల్ జడ్జీల ఎంపిక కోసం ఏర్పాటైన కమిటీలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధనపాలన్‌ను నియమించడాన్ని ప్రశ్నిస్తూ నిరుడు ఏప్రిల్‌లో ఆయన ఆదేశాలిచ్చారు. ఆ న్యాయమూర్తి బోగస్ సర్టిఫికెట్లతో, ప్రశ్నార్ధకమైన ప్రవర్తనతో న్యాయమూర్తి పదవిని చేజిక్కించుకున్నారని అనడంతోపాటు సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు. తన ఉత్తర్వులకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్కే కౌల్ ఆటంకం కలిగించారని తెలిసి ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి ప్రవర్తనకు కోర్టు ధిక్కార నేరంకింద చర్యలు తీసుకోవలసివస్తుందని జస్టిస్ కౌల్‌ను హెచ్చరిస్తూ మరో ఆదేశాన్నిచ్చారు. ఈ ప్రహసనంపై మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీ సుప్రీంకోర్టుకెక్కి ఆ ఆదేశాల అమలును నిలిపేయించింది. ఎందుకిలా చేయాల్సివచ్చిందో సంజాయిషీ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై 12 వారాల తర్వాత చూద్దామని జవాబిచ్చారు. జస్టిస్ కర్ణన్ కేవలం ఇలా వివాదాల్లో చిక్కుకుని మాత్రమే వార్తల్లోకెక్కలేదు. ఆయనచ్చిన తీర్పులు వాటికవే సంచలన వార్తలుగా మారిన సందర్భాలున్నాయి. పెళ్లీడు వచ్చిన ఇద్దరు ఆడ, మగ మధ్య లైంగిక సంబంధం ఏర్పడితే దాన్ని పెళ్లిగా పరిగణించవచ్చునని, వారిని భార్యాభర్తలుగా గుర్తించవచ్చునని జస్టిస్ కర్ణన్ తీర్పునిచ్చినప్పుడు దేశవ్యాప్తంగా గగ్గోలుపుట్టింది. న్యాయమూర్తుల నియామకం వ్యవహారాలను చూసే కొలీజియం వ్యవస్థ స్థానంలో జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై విచారణ సాగుతున్న సమయంలో మద్రాస్ హైకోర్టులో ఏర్పడిన వివాదం ప్రస్తావనకొచ్చింది. ప్రవర్తన సరిగాలేనివారు న్యాయమూర్తులుగా రావడంవల్ల న్యాయవ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని ఆ సందర్భంగా కేంద్రం తరఫున వాదించిన అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. అలాంటివారిని సరిచేయలేని నిస్సహాయ స్థితిలో కొలీజియం ఉన్నదని కూడా అన్నారు. ఆ సంగతిని బెంచ్ సైతం అంగీకరించకతప్పలేదు. ఒక న్యాయమూర్తిని తొలగించడమంటే మాటలు కాదు. దానికి ఎంతో సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. ఏ దశలోనైనా ఆ ప్రక్రియ కుప్పకూలితే అది మళ్లీ మొదటికొస్తుంది. స్వతంత్ర భారత చరిత్రలో ఉన్నత న్యాయస్థానాల్లో అవినీతి ఆరోపణలు లేదా ఇతరత్రా వ్యవహారాల్లో పదవులు కోల్పోయిన న్యాయమూర్తులెందరని ఆరా తీస్తే దాదాపు ఎవరూ లేరన్న సమాధానం వస్తుంది. తొలగింపు ప్రక్రియ ఎంతో సంక్లిష్టమైనది కావడమే దీనికి కారణం. రాజ్యాంగంలోని 124(4) అధికరణ ప్రకారం వందమంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ సభ్యులు ఆయా చట్టసభల అధ్యక్షులకు తీర్మానం అందజేయాలి. లోక్‌సభ సభ్యులు తీర్మానం అందజేసిన పక్షంలో స్పీకర్ దాని ఆధారంగా న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటుచేస్తారు. రాజ్యసభ సభ్యులనుంచి తీర్మానం వచ్చిన సందర్బంలో చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. అలా ఏర్పాటయ్యే కమిటీ సిఫార్సు న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఉంటేనే చట్టసభల్లో అభిశంసన తీర్మానంపై చర్చ జరుగుతుంది. చర్చ సందర్భంగా న్యాయమూర్తి సభకు హాజరై తన వాదనను వినిపించవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వి. రామస్వామిపై ఆరోపణలొచ్చినప్పుడు లోక్‌సభలో వాటిపై చర్చ జరిగింది. ఓటింగ్ జరిగినప్పుడు కాంగ్రెస్ గైర్హాజరు కావడంతో అభిశంసన తీర్మానం వీగిపోయింది. అనంతరకాలంలో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రసేన్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినకరన్‌లపై అభిశంసన తీర్మానాలొచ్చాయి. సౌమిత్రసేన్‌ను అభిశంసించే తీర్మానం రాజ్యసభలో ఆమోదం పొందింది. లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దినకరన్ సైతం ఈ పద్ధతిలోనే తప్పుకున్నారు. చిత్రమేమంటే వీరిద్దరూ అనంతరకాలంలో రిటైర్మెంట్ సదుపాయాలన్నీ పొందారు. చట్టంలో స్పష్టత లేకపోవడమే దీనికి కారణం. ఇంత సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రక్రియ గనుకే సర్వసాధారణంగా అభిశంసన జోలికిపోరు. ఇప్పుడు జస్టిస్ కర్ణన్‌పై అలాంటి చర్యకు ఉపక్రమిస్తే ఆయన మౌనంగా ఉండిపోరు. రాజీనామా చేసి వెళ్లిపోరు. చట్టసభల్లో తన వాదనను గట్టిగా వినిపిస్తారు. తనపై కుల వివక్ష చూపుతున్నారని, తనను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆయన చెప్పినట్టయితే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. న్యాయమూర్తులను తొలగించడానికి ఇప్పుడనుసరిస్తున్న ప్రక్రియను సరళతరం చేయాలని న్యాయ నిపుణులు చెబుతారు. అలా చేయడం తర్వాత సంగతి...అసలు నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉంటే విపరీత పోకడలు, అవినీతి చరిత్ర ఉన్న వ్యక్తులు రావడం అసాధ్యమవుతుంది. అప్పుడు న్యాయవ్యవస్థ విశ్వసనీయత, ప్రతిష్ట మరింత పెరగడానికి అవకాశం కలుగుతుంది.