జస్టిస్ కర్ణన్‌కు ఎదురుదెబ్బ
► రివ్యూ పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వివాదాస్పద హైకోర్టు న్యాయవాది జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బతగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో తనకు విధించిన ఆరు నెలల జైలు శిక్షను రద్దు చేయాలని కోరుతూ జస్టిస్ కర్ణన్ తన న్యాయవాది మాథ్యుస్ నెదుమ్‌పరా ద్వారా సుప్రీంకోర్టులో గురువారం రివ్యూ పిటీషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.
‘జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడటంతో పాటు న్యాయవ్యవస్థను, న్యాయపక్రియను ధిక్కరించినందున ఆయనకు శిక్ష విధించాలని గతంలో ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్పు తక్షణం అమలు చేసేందుకు ఆయన్ని వెంటనే అదుపులోకి తీసుకోవాలి’ అని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ కర్ణన్ జారీచేసే తదుపరి ఆదేశాలను ప్రచురించొద్దని జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జె చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ కురియన్ జోసఫ్‌ల ధర్మాసనం మీడియాకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.