టెరీ వాల్ష్ సేవలు ఇక అవసరం లేదని హాకీ ఇండియా(హెచ్ ఐ) స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: టెర్రీ వాల్ష్ సేవలు ఇక అవసరం లేదని హాకీ ఇండియా(హెచ్ ఐ) స్పష్టం చేసింది. వాల్ష్ మనసు మార్చుకుని భారత హాకీ జట్టుకు మళ్లీ కోచ్ పనిచేసేందుకు సిద్ధపడినా తాము అంగీకరించబోమని హెచ్‌ఐ అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపారు. ఈ మేరకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ జిజి థామ్సన్ కు ఆయన లేఖ రాశారు.
టెర్రీ వాల్ష్ సేవలు అవసరం లేదని, సాయ్ అనుమతితో కొత్త కోచ్ ను నియమించుకుంటామని బాత్రా పేర్కొన్నారు. హాకీ ఇండియా ఒప్పుకుంటే భారత హాకీ జట్టు కోచ్‌గా మరో సారి టెర్రీ వాల్ష్‌ను నియమించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సాయ్ ప్రకటించిన నేపథ్యంలో బాత్రా ఈ లేఖ రాశారు.