ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు ఢిల్లీలోని తమ కార్యాలయాన్ని ఈనెల 7 నుంచి తెరిచేందుకు అనుమితి ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా లేఖ రాశారు. ‘టోక్యో’తో సంబంధమున్న దాదాపు 240 మంది వివరాలను నమోదు చేయాల్సి ఉందని... లాక్‌డౌన్‌తో ఇంటివద్ద నుంచే ఈ పని చేస్తున్నా సవ్యంగా జరగడం లేదని బాత్రా అన్నారు.
ఒలింపిక్స్ కోసం భారత బృందం సర్వ సన్నద్ధంగా ఉందని నరీందర్ బాత్రా రెండురోజుల క్రితం వెల్లడించారు. ఇప్పటివరకైతే వంద మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇందులో 56 మంది పురుషులు, 44 మంది మహిళలు కాగా... క్వాలిఫికేషన్స్ కటాఫ్ తేదీ వరకల్లా ఈ జాబితాలో మరో 25 నుంచి 35 మంది చేరతారని ఐఓఏ ఆశిస్తోంది. కోచ్, సహాయ సిబ్బంది కలుపుకొని సుమారు 190 మందితో భారత జట్టు టోక్యోకు వెళుతుందని బా త్రా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment