
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ కోసం భారత బృందం సర్వ సన్నద్ధంగా ఉందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా వెల్లడించారు. ఇప్పటివరకైతే వంద మంది అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించారు. ఇందులో 56 మంది పురుషులు, 44 మంది మహిళలు కాగా... క్వాలిఫికేషన్స్ కటాఫ్ తేదీ వరకల్లా ఈ జాబితాలో మరో 25 నుంచి 35 మంది చేరతారని ఐఓఏ ఆశిస్తోంది. కోచ్, సహాయ సిబ్బంది కలుపుకొని సుమారు 190 మందితో భారత జట్టు టోక్యోకు వెళుతుందని బా త్రా చెప్పారు. క్రీడా శాఖ ఆదేశాల ప్రకారం కోచ్, అధికారులు ఎవరైనా క్రీడాకారుల మొత్తంలో మూడో వంతుకు మించడానికి వీల్లేదని ఆయన తెలిపారు. గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ధరించబోయే కిట్ ను క్రీడా మంత్రి కిరిణ్ రిజిజు ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment