
మోడీ కంటే మన్మోహన్ దుర్మార్గుడు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
విశాఖపట్నం..న్యూస్‌లైన్: గుజరాత్‌లో మారణ హోమం సృష్టించిన మోడీ కంటే ప్రధాని మన్మోహన్‌సింగ్ దుర్మార్గుడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ఘాటుగా విమర్శించారు. అణు ఒప్పందంతోపాటు బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తని ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ.. దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయాలు కాదన్నారు. కేంద్రంలో ఉన్న అసమర్థ పాలనే రాష్ట్రంలోనూ ఉందన్నారు. తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం అంటే చట్ట సభలపై గౌరవం లేకపోవడమేనన్నారు.