
సీట్ట సర్దుబాటుకు కేసీఆర్ స్పందించలేదు
ఖమ్మం లోక్‌సభ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ
మధిర, టీఆర్‌ఎస్‌తో సీట్ల సర్దుబాటు చేసుకుందామని ప్రయత్నించినప్పటికీ ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పందించలేదని ఖమ్మం లోక్‌సభ సీపీఐ అభ్యర్థి కె.నారాయణ తెలిపారు. మధిరలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ కోసం 2000 సంవత్సరం నుంచే తాము క్రమబద్దంగా పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. సోనియాగాంధీ మాట తప్పకుండా రాష్ట్రం ఇచ్చినందున ఆ పార్టీతో తెలంగాణ ప్రాంతం వరకే సీట్ల సర్దుబాటు చేసుకున్నామని, టీఆర్‌ఎస్‌తో కూడా సీట్ల సర్దుబాటు చేసుకుందామని ప్రయత్నించినప్పటికీ కేసీఆర్ స్పందించలేదని తెలిపారు. ఈ విషయాన్ని తెలంగాణ అభిమానులు, జేఏసీ నాయకులు దృష్టిలో ఉంచుకుని తనను గెలిపించాలని ఆయన కోరారు.