విలువలకు నిలువుటద్దం సీఆర్ | CR is the symbol of values | Sakshi
Sakshi News home page

విలువలకు నిలువుటద్దం సీఆర్

Published Sat, Jun 6 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

విలువలకు నిలువుటద్దం సీఆర్

విలువలకు నిలువుటద్దం సీఆర్

(సందర్భం)
కమ్యూనిస్టు యోధులు చం డ్ర రాజేశ్వరరావు 101వ జయంతిని జూన్ 6న దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నా రు. రాజకీయ విలువలకు నిలువుటద్దం సీఆర్. తన చివ రి ఊపిరి వరకు నిబద్ధతతో ఆదర్శప్రాయుడైన చండ్ర రా జేశ్వరరావు, పుచ్చలపల్లి సుం దరయ్య, వి. సుబ్బయ్య లాంటి వారి త్యాగాలే మన పెట్టుబడులు. రాజకీయ వ్యవస్థ పవిత్రమైంది. పవిత్రమైన రాజకీయ వ్యవస్థను ద్రౌపది వస్త్రాపహరణం లాగా నడి వీధుల్లో ఆడుకుంటున్నారు. తాజాగా రేవంత్‌రెడ్డి ఓటు కొనుగోలు విషయంలో ఆధా రాలతో సహా పట్టుబడ్డాడు. ఎంతో పకడ్బందీగా ప్రభుత్వం పథకం రూపొందించ బట్టే ఆధారాలతోసహా దొరికిపోయారు. అసలు రేవంత్‌కు మూలం ఏంటి అనే వైపు దారితీసి చివరికి చంద్రబాబు కేరాఫ్‌కు పోయింది. సెల్‌ఫోన్ తదితర ఆధారాలతో విచారణ జరుగుతున్నది.

 ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడిలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ చురుకుగా వ్యవహరిం చింది. టీడీపీ ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయించింది. టీఆర్‌ఎస్ నిజమైన ఓట్లతో 5వ అభ్యర్థి గెలవడం అసాధ్యం. అయినా ఐదు మందిని పోటీ పెట్టి గెలిపించుకోవాలనే వ్యూహంతోనే ముందుకు కదిలారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఫర్వాలేదు టీడీపీ అభ్యర్థి గెలవకూడదనే పట్టుదల టీఆర్‌ఎస్‌ది కాగా, కాంగ్రెస్ గెలిచినా ఫర్వాలేదు టీఆర్‌ఎస్ గెలవకూడదని టీడీపీ పట్టుపట్టింది. టీఆర్‌ఎస్ పట్టుదల వల్ల కాంగ్రెస్ పార్టీ క్షేమంగా బయటపడితే, రాజకీయ అవమానాలతో టీడీపీ కుదేలయింది. రేవంత్ జైలుకు వెళ్లాల్సివచ్చింది.

 ప్రత్యేక తెలంగాణ నినాదంతో స్పటికంలాగా పైకి వచ్చి, ఆచరణలో కల్తీ సరు కుగా మారాల్సిన పరిస్థితి టీఆర్‌ఎస్‌కు వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. సకల జనులు బరితెగించి పోరాడారు. ఆ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని స్థాపించింది. అందరూ హర్షిం చారు. అయితే తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంగా మాట్లాడిన పార్టీలకు చెందిన గెలిచినా, ఓడినా ప్రతినిధులతో కేబినెట్ నింపేస్తున్నారు. ఇక టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో సొంత మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసుకు న్నది. అయినా వైఎస్‌ఆర్ పార్టీ నుండి గెలిచిన ప్రజా ప్రతినిధులను టీడీపీ ఆకర్ష్ పథ కం అమలు చేశారు కానీ, తెలంగాణలో ఫిరాయింపులపై ఫిర్యాదులు చేస్తున్నారు టీడీపీ నాయకులు.

తెలుగునాట రాజకీయ రక్తి రసం డ్రైనేజిగా మారి కంపుకొడు తోంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్టుల బలం కనీసం 10కి తగ్గకుండా ఉండి ఉంటే కూడా ఇంతటి అధ్వాన్నంగా సభ జరిగేది కాదు. రాజకీయ పరిణామాలు దిగజారేవి కాదు. ఈ రొంపిలో మనకెందుకని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమకున్న చెరొక ఓటు ‘తటస్థం’ అని ప్రకటించి మంచి పని చేశారు.

 

 (డాక్టర్ కె. నారాయణ  కార్యదర్శి, సీసీఐ జాతీయ సమితి, 94909 52222)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement