సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రాజీనామాతో రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే ప్రజలే ప్రభుత్వ కార్యాలయాలను ఆక్రమించుకుంటారని హెచ్చరించింది. కేంద్రం రాష్ట్రానికి దిశానిర్దేశం ఇవ్వలేకపోవడాన్ని ఆక్షేపించింది.
పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యదర్శివర్గ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఉభయ రాష్ట్రాల పార్టీ శాఖ కమిటీలు, భవిష్యత్ కార్యక్రమాల ఎజెండాపై చర్చించారు. మార్చి 3న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై హైదరాబాద్‌లో, 4న ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిపై విజయవాడలో సదస్సులు నిర్వహించాలని ఈ భేటీలో నిర్ణయించారు. తెలంగాణ కల సాకారమైన నేపథ్యంలో మార్చి 12న వరంగల్‌లో విజయోత్సవ సభను పార్టీ నిర్వహించనుంది.
ఇలాగైతే జనమే కార్యాలయాలు ఆక్రమిస్తారు: సీపీఐ
Published Thu, Feb 27 2014 1:48 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement