
సెక్షన్-8 అవసరం లేదు: నారాయణ
'ఓటుకు కోట్లు' వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే మొదలైందని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. ఆయన శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ... టీడీపీకి అనుకూలంగా ఉంటే గవర్నర్ మంచోడు... కాకపోతే మంచి వారు కాదా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు బాధ ప్రజల బాధగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెక్షన్ -8 అవసరం లేదని నారాయణ అభిప్రాయపడ్డారు.