‘ఢిల్లీలో వెంకయ్య...విజయవాడలో చంద్రబాబు’ | cpi Narayana slams chandrababu, venkaiah naidu over special status for ap | Sakshi
Sakshi News home page

‘పవన్ కల్యాణ్ గుడ్డోడు గుట్లో రాయి వేసినట్లు’

Published Thu, Sep 8 2016 1:30 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘ఢిల్లీలో వెంకయ్య...విజయవాడలో చంద్రబాబు’ - Sakshi

‘ఢిల్లీలో వెంకయ్య...విజయవాడలో చంద్రబాబు’

హైదరాబాద్ : ప్రత్యేక హోదాపై తెలుగు ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మూడు నామాలు పెట్టిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హోదాపై ఢిల్లీలో వెంకయ్య నాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామా చేశారన్నారు. కేంద్రం నుండి టీడీపీ బయటకు రావాలని నారాయణ డిమాండ్ చేశారు. జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ గుడ్డోడు గుట్లో రాయి వేసినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఎల్లుండి జరిగే ఏపీ బంద్ను విజయవంతం చేయాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.

తెలుగు ప్రజల పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement