
కె.నారాయణ
ఖమ్మం: తాను హజరయ్యే సమావేశాలకు దూరంగా ఉంటానని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన వ్యాఖ్యలపై సిపిఐ జాతీయ నేత కె.నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది సాంఘిక బహిష్కరణ కిందకు వస్తుందన్నారు. ఇది కమ్యునిస్టుల సంస్కృతి కాదని నారాయణ వ్యాఖ్యానించారు.
ఓట్ల లెక్కింపు ప్రారంభానికి ముందు ఖమ్మం లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న తనను ఓడించడానికి వీరభద్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని నారాయణ ఆరోపించారు. ఆ తరువాత వ్యాఖ్యలపై నారాయణ విచారం వ్యక్తం చేస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నప్పటికీ వీరభద్రం మాత్రం శాంతించినట్లు లేదు.