జిల్లాలో చాలా మంది బడా వ్యాపారుల కబంధ హస్తాల్లో వేల ఎకరాలు ఉన్నాయని, పేదల గుడిసెలపై కాకుండా వాటి మీద
సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ
కొమురంభీంనగర్‌ను సందర్శించిన అఖిలపక్ష నేతలు
ఆదిబట్ల : జిల్లాలో చాలా మంది బడా వ్యాపారుల కబంధ హస్తాల్లో వేల ఎకరాలు ఉన్నాయని, పేదల గుడిసెలపై కాకుండా వాటి మీద ప్రభుత్వం చర్యలకు పూనుకుంటే మంచిదని ీసీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అ న్నారు. ఇబ్రహీంపట్నం మండలం మంగల్‌పల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్162లో పేదల గుడిసెలను కూల్చిన ప్రాంతాన్ని శనివారం అఖిల పక్ష నాయకులు సందర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యద ర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.జి నర్సింగ్‌రావ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, ఆర్‌ఎస్‌పీ, లోక్‌సత్తా నాయకులు తదితరుల అఖిలపక్ష బృందం గుడిసెలు కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించింది.
ఈ సందర్భంగా కె. నారాయణ విలేకరులతో మాట్లాడారు. కార్పొరేట్ వ్యాపారుల కొమ్ము కాస్తు పేదల ప్రజలను అన్యాయానికి గురి చేయడం తగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడవెంకట్‌రెడ్డి మాట్లాడుతూ గుడిసెల కూల్చివేతకు కేసీఆర్ పర్యటనతోనే ప్రారంభమైందని, వారం క్రితం ఔటర్ రింగ్‌రోడ్‌లో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేసీఆర్ ఔటర్‌పై పర్యటిస్తూ కొమురంభీంనగర్‌లో ఉన్న ప్రాంతంపై కన్ను పడిందన్నారు. వెంటనే గుడిసెలను తొలగించడానికి ఆదేశాలు జారీ చేశారని దుయ్యబట్టారు. నగరంలోని హుస్సే న్‌సాగర్‌ను తర లిస్తామని, ఉస్మానియా యూని వర్సిటిలో ఇళ్ల కట్టిస్తామని పూటకో మాట చెబుతు పిచ్చివా డిలా మాట్లాడు తున్నాడని ఎద్దేవా చేశారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల మందు పేదల పక్షాన మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు పేదలపై అహంకారంగా ప్రవర్తిం చడం దారుణమన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని, త్వరలోనే అఖిల పక్ష కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు తెలిపారు. ఈ పర్యటనలో సీపీఐ జిల్లా నాయకులు బాలమల్లేష్, జానకిరామ్, నరేందర్, భూ తం వీరన్న, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలు క మధుసుదన్‌రెడ్డి,ఇబ్రహీంపట్నం నియోజకవ ర్గ టీడీపీ ఇన్‌చార్జి రొక్కంభీం రెడ్డి, మాజీ ఎ మ్మెల్యే మస్కు నర్సింహ, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు శిగవీరాస్వమి,దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.