మీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నారు.
సాక్షి, హైదరాబాద్: ‘మీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నారు. హైకమాండ్ వద్ద కూడా ఆయన ప్రాముఖ్యం తగ్గింది’ అని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తనతో చెప్పినట్లు సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె. నారాయణ తెలిపారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందంతో ఇటీవల జరిగిన భేటీ ముచ్చట్లను శనివారం పత్రికా ప్రకటన రూపంలో వెలువరిస్తూ నారాయణ ఈ అంశాన్ని ప్రస్తావించారు. తెలంగాణపై లీకులతో తెలుగు ప్రజలను ఎందుకు చీలుస్తున్నారన్న తన ప్రశ్నకు జీవోఎం సభ్యులు చిరునవ్వు చిందించారని, కాలయాపన చేస్తే ఎన్నికల్లో కాంగ్రెస్ మట్టికొట్టుకుపోతుందని తాను హెచ్చరించానని చెప్పారు.
విచారణకు హాజరయ్యేలా ఏజీకి సూచించండి
కేంద్రమంత్రి సిబల్‌కు వినోద్ లేఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికరణ 3, 371(డి)లకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు విచారణకు వచ్చే సమయంలో కోర్టుకు హాజరయ్యేలా అటార్నీ జనరల్(ఏజీ)కు సూచించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌ను టీఆర్‌ఎస్ నేత వినోద్‌కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సిబల్‌కు లేఖ రాశారు. అధికరణ 3, 371(డి)లకు సంబంధించి 9 పిటిషన్లు దాఖలయ్యాయని, విభజనను అడ్డుకునేందుకే వీటిని దాఖలు చేశారన్నారు. వీటికి ఎటువంటి చట్టబద్ధత లేదని, వీటిని విచారణ సమయంలో కొట్టివేసే అవకాశం ఉందన్నారు.