తెలంగాణ ప్రకటనపై సీపీఐది ద్వంద్వ వైఖరి కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ బుధవారం నల్గొండలో స్పష్టం చేశారు. సీపీఐపై నిందలు వేస్తే ఎంపీ లగడపాటి, మంత్రి టీజీలకు నాలుకలుండవని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుపై చంద్రబాబుకు గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ కన్నుకొట్టపోయారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీలతో సీపీఐ పొత్తులుండవని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.