
'తీర్మానం చేయకుంటే... రెండు ఒక్కటే అనుకుంటారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ మహానాడులో తీర్మానం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును సీపీఐ నేత కె.నారాయణ డిమాండ్ చేశారు. లేదంటే టీడీపీ దాని మిత్ర పక్షం బీజేపీ ఒక్కటే అని ప్రజలు భావించే ఆస్కారం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం విజయవాడలో కె. నారాయణ మాట్లాడారు. ప్రధాని మోదీ ఏడాది పాలన కార్పొరేట్లకే లాభం చేకూర్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీ మహానాడు బుధవారం నగర శివారుల్లోని గండిపేటలో ప్రారంభమైనాయి.
అదికాక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంటే... తెలంగాణలో ప్రతిపక్షం పార్టీల్లో ఒకటిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించి మహానాడులో టీడీపీ పలు తీర్మానాలు చేయనుంది. అందులోభాగంగా తెలంగాణలో టీడీపీ మరింత బలం పుంజుకోవడానికి... ఏపీలో నూతన రాజధానిపై తీర్మానం చేయనుంది. ఆ తీర్మానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలని చంద్రబాబును నారాయణ డిమాండ్ చేశారు.