3 ఎంపీ, 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ! | K.Narayana met Ponnala Lakshmaiah in Hyderabad | Sakshi
Sakshi News home page

3 ఎంపీ, 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ!

Published Fri, Mar 21 2014 11:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM

K.Narayana met Ponnala Lakshmaiah in Hyderabad

రానున్న ఎన్నికల్లో 3 ఎంపీ, 22 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీ చేయాలని సీపీఐ నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వెల్లడించారు. ఈ మేరకు ఆ జాబితాను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు అందజేసినట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన పొన్నాలతో భేటీ ఆయ్యారు.  ఈ సందర్భంగా పొన్నాల,నారాయణల మధ్య ఎన్నిలలో పార్టీల పొత్తు, సీట్లు తదితర అంశాలపై చర్చించారు.

 

అనంతరం నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో పొత్తు పెట్టుకుని ఎన్నికలల్లోకి వెళ్లాలని కోరుకున్నామని తెలిపారు. అయితే పొత్తులపై టీఆర్ఎస్కు ప్రతిపాదన పంపామని, అయినా ఆ పార్టీ నుంచి ఎటువంటి స్పందన రాలేదని నారాయణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement