జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి
న్యాయవాదుల దీక్షకు ‘పొన్నాల’ సంఘీభావం
కొనసాగుతున్న జేఏసీ రిలే దీక్షలు
జనగామ : జనగామ జిల్లా కోసం టీఆర్‌ఎస్ నాయకులు ఉద్యమంలోకి కలిసిరావాలని జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలో గురువా రం దుకాణ, గ్రేయిన్ మార్కెట్ హమాలీ కార్మికులు గాదరి నర్సింహ్మ, బండ భాస్కర్, గవ్వల రాములు, గాజుల గంగులు, నక్క గణేష్‌లు దీక్షలో కూర్చోగా, మాజీ ఎమ్మెల్యే రాజారెడ్డి ప్రారంభించారు. కాగా, న్యాయవాదుల రిలే దీక్షకు పొన్నాల లక్ష్మయ్య సంఘీభావం తెలి పారు. దీక్షలో ఇషాన్, ఉమాపతి, సత్తెయ్య, కాంతారావు కూర్చోగా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి ప్రసాద్, మంచాల రవీందర్, లక్ష్మణస్వామి, రవీందర్ సంఘీభావం తెలిపారు. ఉద్యమ కార్యాచరణపై జేఏసీ నా యకులతో పొన్నాల గంటపాటు చర్చించారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల వేణుగోపాల్‌రావు, బర్ల శ్రీరాములు, సత్యపాల్‌రెడ్డి, స త్యం, డాక్టర్ రాజమౌళి, జక్కుల వేణుమాధవ్, కేమిడి మల్లయ్య, వైకుం ఠం, తీగల సిద్దూగౌడ్, సౌడ రమేష్, పిట్టల సత్యం, అజహరొద్దిన్, కాసుల శ్రీనివాస్, వీరస్వామి ఉన్నారు.
రిప్రజెంటేషన్ కాపీలను ఇవ్వాలి
జనగామ : జనగామ జిల్లా కోసం అధికారికం గా ప్రభుత్వానికి పంపించిన వివరాలను ఇవ్వాల్సిందిగా జేఏసీ చెర్మైన్ ఆరుట్ల దశమంతరెడ్డి, జిల్లా సాధన సమితి కన్వీనర్ మంగళ్లపల్లి రాజు సమాచార హక్కు చట్టం ద్వారా గురువారం కలెక్టర్‌ను కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ మూడు నెలల నుంచి జి ల్లాకు కావాల్సిన వనరులు, రాజకీయంగా ప్ర జాప్రతినిధులు ఇచ్చిన ప్రతులు, భూ సంబందిత వివరాలను అందించాలని అందులో పే ర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు కలెక్టర్ పంపించిన నివేదికలు, ఎమ్మెల్యే, ఎంపీ ఇచ్చిన లేఖలు, ప్రభుత్వ పరం గా ఆర్డీఓ, తహసీల్దార్ రిపోర్టు కాపీలను ఇవ్వాలని కోరి నట్లు పేర్కొన్నారు.