![TRS Candidate Muthireddy Yadagiri Reddy Election Campaigns In Janagama - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/6/6.jpg.webp?itok=k8xuC1_X)
జనగామ: కాంగ్రెస్ మాయమాటలను నమ్మి మోసపోవద్దని తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ నియోజకవర్గం సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లి, రేబర్తి గ్రామాల్లో ఆయన సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితమంటూ ప్రచారం చేసుకుం టున్న పొన్నాల లక్ష్మయ్య.. ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. వరుస కరువుతో వ్యవసాయాన్ని వదులుకున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా ఇవ్వలేక పోయిందన్నారు. నాడు నీళ్లమంత్రిగా ఉన్న పొన్నాల ఒక్క చెరువు కూడా నింపలేక పోయాడన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక తాను గోదావరి జలాలతో ఊళ్లకు పునీతం చేసి రూ.20కోట్ల పంట దిగుబడుల నుంచి రూ.350 కోట్లకు తీసుకువచ్చానని అన్నారు. రైతుల పక్షాన నిలబడి.. అన్ని వర్గాల ప్రజలకు సర్కారు ఫలాలను అందించి.. 24 గంటల పాటు అందుబాటులో ఉన్నానని, ఈ సారి ఆశీర్వదిస్తే.. జనగామను మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముత్తిరెడ్డికి ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment